ఇలియానా.. చిట్టి బెల్లియానా..
ప్రముఖ సినీ నటి ఇలియానా చాలా కాలం తర్వాత సిటీలో తళుక్కుమంది. అమెరికాకు చెందిన లైఫ్‌స్టైల్, ఫుట్‌వేర్ బ్రాండ్ సంస్థ ‘స్కెచర్స్’ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఏర్పాటు చేసిన షోరూంను ఆమె బుధవారం ప్రారంభించింది. ‘నేను కావాలని తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం కాలేదు. మంచి పాత్రలు రాకపోవడంతోనే సినిమాలు చేయడం లేదు.
మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం హిందీలో అక్షయ్‌కుమార్‌తో ‘రుస్తూమ్’ చిత్రంలో నటిస్తున్నాను. ఈ చిత్రం నాకు మంచి పేరు తెస్తుందనే నమ్మకం ఉంద’ని చెప్పారు. కార్యక్రమంలో సంస్థ సీఈవో రాహుల్ వీరా తదితరులు పాల్గొన్నారు. - బంజారాహిల్స్