శతాధిక వృద్ధురాలి మృతి
పరిటాల(కంచికచర్ల) : మండలంలోని పరిటాలకు చెందిన షేక్ అమీన్బీ(110) శతాధిక వృద్ధురాలు అనారోగ్యకారణంతో శుక్రవారం మృతి చెందింది. ఆమెకు నలుగురు కుమార్తెలున్నారు. బతికి ఉన్నంతకాలం గ్రామంతోపాటు ఇతర గ్రామాల్లో మంత్రసానిగా పనిచేసి అనేక సేవలందించేంది అని గ్రామస్తులు కొనియాడారు. ఆరు తరాలను చూసిన బామ్మ కన్నుమూయటంతో ముదిమనుమళ్ల కుమారులు బోరున విలపించారు. కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి. ఆమె భౌతికకాయాన్ని గ్రామానికి చెందిన పలువురు నాయకులు సందర్శించి నివాళులర్పించారు.