breaking news
Sivanagar
-
మత్తులోకి దింపి..
ఘరానా దోపిడీ కొత్తగా పెళ్లయిందని అద్దెకు దిగి.. యజమాని ఇంట్లో దోపిడీ నగదుతోపాటు 7 తులాల బంగారం, టీవీ, డీవీడీ ప్లేయర్ అపహరణ శివనగర్‌లో ఘటన ఖిలావరంగల్ : కొత్తగా పెళ్లరుుందని అద్దెకు దిగిన ఓ జంట ఆ ఇంటి యజమానులకు పాయసం పెట్టి.. మత్తులోకి దించి దోపిడీకి పాల్పడిన సంఘటన వరంగల్ శివనగర్‌లో గురువారం ఆర్ధరాత్రి జరిగింది. వృద్ధదంపతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ శివనగర్‌లోని బీసీ హాస్టల్ సమీపంలో దాసరి కొమురయ్య, కళావతి దంపతులు 5 గదుల రేకుల ఇంటిని నిర్మించుకుని ముందు గదిలో చిన్నపాటి కిరాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి కుమారులు శ్రీనివాస్, రవీందర్, ఒక కూతురు ఉన్నారు. వారికి పెళ్లిళ్లు కావడంతో వేరుగా ఉంటున్నారు. ఐదు గదుల్లో రెండు గదులు వారు ఉపయోగించుకుంటుండగా.. మరో గదిలో మూడేళ్లుగా ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. మరో రెండు గదులు ఖాళీగానే ఉంటున్నాయి. ఇంటి బయట ‘రూమ్‌లు కిరారుుకి ఇవ్వబడును’ అనే బోర్డును తగిలించారు. ఈ క్రమంలోనే 20 రోజుల క్రితం తమకు కొత్తగా పెళ్లరుుందని, ఇల్లు అద్దెకు కావాలని ఓ జంట వృద్ధ దంపతులను అడిగారు. గతంలో ఇచ్చిన వారికంటే రూ.200 అదనంగా ఇస్తామని అద్దె మాట్లాడుకున్నారు. అంతలో మరో జంట రావడంతో ఒక్క జంటకైతేనే ఇల్లు కిరారుుకి ఇస్తామని యజమాని చెప్పగా మరుసటి రోజు ఒక్క జంటకే ఆద్దె కావాలంటూ వచ్చింది. ‘మాది ఆంధ్రా ప్రాంతం.. వరంగల్ నగరంలో మేస్త్రీ పని చేయడానికి వచ్చామని చెప్పి నమ్మించారు. అద్దె కిరాయి ముందుగానే ఒక నెల వెయ్యి రూపాయలు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఆ తర్వాత ఇంట్లో దిగాక యజమానులతో సఖ్యతతో ఉంటూ దగ్గరయ్యూరు. సుమారు 20 రోజులయ్యూక గురువారం రాత్రి 9 గంటలకు ఆ కిలాడీ జంట మా పెళ్లి రోజు పాయసం చేశామని చెబుతూ సేమ్యాలో మత్తు మందు కలిపి వృద్ధ దంపతులతోపాటు పక్క గదిలో ఉండే మరో కుటుంబానికి ఇచ్చారు. ఆద్దెకు ఉంటున్న కుటుంబం సేమ్యాను తినకుండ పక్కన పెట్టగా, వృద్ధ దంపతులు మాత్రం ఆరగించారు. ఆ తర్వాత వారు మత్తులోకి జారిపోయూరు. అర్ధరాత్రి కాగానే ఆ కిలాడి జంట వృద్ధ దంపతుల ఇంట్లోకి ప్రవేశించి ఒంటిపైన ఉన్న బంగారం, బీరువాలో ఉన్న నగదుతోటు 7 తులాల బంగారం, కలర్ టీవీ, డీవిడీ ప్లేయర్ అపహరించారు. శుక్రవారం ఉదయం పక్కింటి వృద్ధురాలు రాజమ్మ కిరాణ షాపులో పాల ప్యాకెట్ కావాలంటూ తలుపు తట్టింది. లోపల ఆ వృద్ధులు మాట్లాడలేకుండా ఒంటిపై బట్టలు లేని దృశ్యాన్ని చూసి వెంటనే అద్దెకు ఉంటున్న మంద రాజు, లావణ్యను లేపి విషయం చెప్పింది. వారు వృద్ధ దంపతుల కుమారులు, కూతురుకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే చేరుకున్నారు. మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేసి బాధితులను 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నగర డీఎస్పీ సురేంద్రనాథ్, మిల్స్‌కాలనీ సీఐ సత్యనారాయణ, ఎస్సై ఎ.రవీందర్ సంఘటన స్థలానికి చేరుకుని చోరీ జరిగిన తీరును బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఆ ఇంటి గదులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరిశీలించారు. కేసు దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండి వస్తువుల అపహరణ క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన క్రైం డీఎస్పీ ఖిలావరంగల్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన నగరంలోని శివనగర్ ప్రాంతంలోని సాయిగణేష్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి జరి గింది. ఇంట్లోని బీరువా తాళం తీసి 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు ఒక సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఎస్సై వెంకటరావు కథన ప్రకారం.. సాయిగణేష్‌నగర్‌కు చెందిన బొజ్జ రంజిత, రాజ్‌కుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి 9.30 గంటలకు సినిమాకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరపడ్డారు. బీరువాపైన ఉన్న తాళం చెవితో తాళాన్ని తీసి సుమారు 90 వేల విలువైన 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. వారు సినిమా చూసి ఇంటికొచ్చేసరికి ఇంట్లో లైట్లు వేసి.. ఇంటి ముందు గడియ విరిగి కనిపించింది. డోర్‌ను నెట్టగా రాకపోవడంతో దొంగలు.. దొంగలు అని అరవడంతో దుండగులు ఇంటి వెనక ప్రహరి దూకి పారిపోయారు. బాధితులు ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బెడ్రూముల్లో దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వారు వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం ఉదయం సీసీఎస్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్, మిల్స్‌కాలనీ ఎస్సై బి.వెంకట్రావు, క్లూస్ టీంతో చేరుకుని క్షుణంగా పరిశీలించారు. ఇంటి యజమాని బొజ్జ రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.