breaking news
Siri Media
-
నా పాత్ర ఏమీలేదు: దాసరి నారాయణరావు
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణం కేసుతో తనకు ఏమీ సంబంధంలేదని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శక నిర్మాత దాసరి నారాయణరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు ఆయనను ప్రశ్నించింది. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవని దాసరి పేర్కొన్నారు. బొగ్గు కుంభకోణంలో తన పాత్ర ఏమీలేదని ఆయన 9 పేజీల వాంగ్మూలం ఇచ్చారు. సిరి మీడియాలో తనకు ఎటువంటి షేర్లు లేవని తెలిపారు. ఈ నెల 18న దాసరిని మరోసారి ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించుకుంది. దాసరికి ఆరోగ్యం బాగోలేనందున మరోసారి విచారణకు పిలుస్తామని ఈడీ వర్గాలు తెలిపాయి. సిరి మీడియా డైరెక్టర్లను కూడా ఈడీ విచారించనుంది. ** -
రాయే...రాయే.. మనసును లాగకే...
అందమైన సాయంత్రం... అందునా సముద్ర తీరం. ఎదురుగా మోనాల్ గజ్జర్ లాంటి పాలరాతి బొమ్మ... ఇక ఏ అబ్బాయి అయినా సాంగ్ సింగకుండా ఉంటాడా? అల్లరి నరేశ్ అదే చేశాడు. ‘రాయే... రాయే... మనసును లాగకే, లాగకే... మాయచేసి నన్ను చంపకే’ అంటూ ఓ పాటేసుకున్నాడు. ఏంటి? ఇదంతా నిజం అనుకుంటున్నారా! సినిమా కోసమే. ‘వీడు తేడా’ఫేం చిన్ని దర్శకత్వంలో అల్లరి నరేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సిరి మీడియా పతాకంపై అమ్మిరాజు కానుమల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం పాట చిత్రీకరణ వైజాగ్ సముద్ర తీరంలో జరిగింది. శేఖర్‌చంద్ర స్వరసారథ్యంలో, భాస్కరభట్ల ఈ పాట రాశారు. ఈ పాటతో షూటింగ్ దాదాపు పూర్తయిందనీ, ఈ నెల చివరివారంలో ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసి, సెప్టెంబర్ తొలివారంలో పాటల్ని విడుదల చేస్తామనీ నిర్మాత చెప్పారు. అల్లరి నరేశ్ చెల్లెలుగా నాటి అందాల తార రాధ కుమార్తె కార్తీక నటించారు. ఈ చిత్రానికి కథ: విక్రమ్‌రాజు, కెమెరా: విజయకుమార్ అడుసుమల్లి, కార్యనిర్వాహక నిర్మాత: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: ఈవీవీ సత్యనారాయణ.