breaking news
sinhambhatla Subbarao
-
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ముఖ్య విషయాలపై బంధువులతో చర్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. గులాబి, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థికంగా బలం చే కూరుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విహారాదియాత్రలు చేస్తారు. సంఘంలో పేరు గడిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. శుభకార్యాల నిర్వహణలో పాలుపంచుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో వివాదాల నుంచి బయటపడతారు. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. లేత ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణబాధలు చాలావరకూ తీరతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. బంధువుల ఆదరణ, ఆప్యాయత పొందుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. వివాదాలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళాకారులకు నూతనోత్సాహం, అవార్డులు. వారం మ«ధ్యలో ఆరోగ్యసమస్యలు. వివాదాలు. తెలుపు, నేరేడురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) మీమాటే శిరోధార్యంగా భావిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. స్వల్ప అనారోగ్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. వాహనయోగం. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరించడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి సహాయం కోరతారు. ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు సాధిస్తారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో మిత్రులతో కలహాలు. కుటుంబంలో ఒత్తిడులు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థికంగా కొంత అనుకూలస్థితి ఉంటుంది. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరుల నుంచి పిలుపు అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగి లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఒత్తిడులు, సమస్యలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి, ఆత్మస్థైర్యంతో అడుగువేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వీరికి అన్నింటా విజయాలే. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారికి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. నీలం, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరి రుణాలు తీరతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో మిత్రులతో కలహాలు. శ్రమ పెరుగుతుంది. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు టారో ( 1 జూలై నుంచి 7 జూలై, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈ నెలంతా మీకు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నింటికీ నిలబడి పోరాడతారు. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుంది. వృత్తి జీవితం బాగుంటుంది. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాల్సిన సమయమిది. కలిసివచ్చే రంగు : గోధుమ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈ నెలంతా మీకు కొత్త కొత్తగా ఉంటుంది. జీవితంలో ఏదో ఒక సమయంలో ఇలా బతకాలి అని రాసిపెట్టుకున్న కొన్ని కలలు నెరవేరతాయి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొన్ని చుట్టుముట్టినా త్వరలోనే వాటికి పరిష్కారాలు కూడా లభిస్తాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరనుకున్న పని చెయ్యలేరని తెలుసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాల్సిన సమయం ఇది. వాతావరణ మార్పులతో వచ్చే కొన్ని ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) గత కొంతకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. వృత్తి జీవితంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవిని అలంకరిస్తారు. జీవితాశయానికి దగ్గరవుతారు. మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. వారిని ఎప్పటికీ వదులుకోకండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారమంతా ఉత్సాహంగా గడుపుతారు. మీ శ్రమకు తగ్గ ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఎప్పట్నుంచో కోరుకుంటున్న మీకిష్టమైన ప్రపంచం వైపు అడుగులు వేస్తారు. మీకిష్టమైన వ్యక్తి ఈ సమయంలో మీ పక్కనే ఉండటం గొప్ప సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని గొప్ప అవకాశాలు కాలంతో పోరాడినప్పుడే దక్కుతాయని నమ్మండి. పని ఒత్తిడి పెరిగినట్టు భావిస్తారు. ఇది మీలో విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచనను పెంచుతుంది. కలిసివచ్చే రంగు : బంగారం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈనెలంతా మీరొక కొత్త ప్రపంచాన్ని వెతుక్కుంటూ వెళతారు. ఈ దారిలో మీకు ఎదురయ్యే అనుభవాలు మిమ్మల్ని మీకు కొత్తగా పరిచయం చేసి చూపిస్తాయి. చాలాకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సమసిపోతాయి. ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. వాతావరణం మార్పులతో వచ్చే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) చాలాసార్లు మనం చెయ్యాల్సిన పనులు వాయిదా వేసుకుంటూ వచ్చి విజయం దక్కడం లేదని బాధపడిపోతాం. ఒక్కసారి మనల్ని మనం విశ్లేషించుకుంటే సమస్య ఎక్కడుందో తెలిసిపోతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, భవిష్యత్ కోసం కష్టపడాలన్న ఆలోచన మీలో రావాలి. ఈ నెల్లోనే ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ముందు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే చాలా బాగుంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఈవారం మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ఒక శుభవార్త వింటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయంలో ఆ అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనా విధానంలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాదాసీదాగా ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. అయితే ప్రస్తుతానికి కొత్త పెట్టుబడులకు దూరంగా ఉంటేనే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈ ప్రపంచంలో ఎవ్వర్నీ ఏ భయమూ అన్నిసార్లూ భయపెడుతూ ఉండలేదు. దానికి ఎదురెళ్లి నిలబడితే అదే పారిపోతుంది. మిమ్మల్ని ఎప్పుడూ వెంటాడే భయాల్ని దూరం చేసుకోవాల్సిన సమయం ఇదే. మీరు ప్రేమించిన వ్యక్తి మీకు ఈ సమయంలో అన్నివిధాలా అండగా నిలబడతారు. గొప్ప అవకాశాలు మనకి దక్కేముందు మన ఆలోచనలు వాటిని అందుకునేంత స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండాలని తెలుసుకోండి. ఈ నెలాఖర్లో మీ జీవితాశయం వైపుకు తొలి అడుగులు వేస్తారు. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : బంగారం ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆత్మవిశ్వాసంతో చేసే ఏ పనైనా ఫలితంతో సంబంధం లేకుండా గొప్ప ఆత్మసంతృప్తిని ఇస్తుంది. మీరు ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రతి పనినీ ఆత్మవిశ్వాసంతో చేస్తూ ముందుకెళ్లండి. ఈ నెల్లోనే మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లాలన్న మీకిష్టమైన కోరికలను తీర్చుకుంటారు. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. వాతావరణ మార్పుల వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా ఊహించనంత ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి జీవితంలో రాబోయే రోజుల్లో గొప్ప మార్పు కనిపిస్తోంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. మీరెప్పట్నుంచో కోరుకుంటున్న ప్రపంచం వైపు మెల్లిగా అడుగులు వేస్తారు. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు గొప్ప అదృష్టాన్ని తీసుకొస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఎప్పుడూ ఏదో ఒక కలని కంటూనే ఉంటారు. మీరెంతో ఇష్టంగా కొన్నాళ్లుగా కంటున్న ఒక కల నెరవేరే సమయం దగ్గర్లోనే ఉంది. ఈ నెల్లోనే ఆ దిశగా అడుగులు వేస్తారు. కొన్ని గొప్ప విషయాలు గొప్ప విషయాలుగా మారకముందు అతి సాధారణంగానే కనిపిస్తాయని తెలుసుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వారం చివర్లో విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. జీవితం గురించి మిమ్మల్ని వేధించే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ ఒక కొత్త ప్రయాణం మొదలుపెడతారు. కలిసివచ్చే రంగు : గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితంలో ఒక్కోసారి చాలా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒక్కోసారి మనమే వెతుక్కుంటూ వెళ్లినా ఒక్క అవకాశమూ దక్కదు. మీరిప్పుడు జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్లైతే, అందుకు సరైన సమయం ఇదేనని తెలుసుకోండి. మీరిష్టపడే వ్యక్తి మీరు కొత్తగా మొదలుపెట్టే ఈ ప్రయాణానికి అన్నివిధాలా అండగా నిలబడతారు. ఆర్థిక పరిస్థితి గురించి ఎక్కువ ఆలోచించకుండా, రావాల్సిన సమయానికి డబ్బులు అవే వస్తాయనుకొని నమ్మి కష్టపడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గులాబి - ఇన్సియా ,టారో అనలిస్ట్ -
నవంబర్ 9నుండి 15 వరకు
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష పండితులు మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపార లావాదేవీలు అంతంతగా ఉంటాయి. ఉద్యోగస్తులు పైస్థాయి వారి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో ఆకస్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోహణి, మృగశిర 1,2పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. అంచనాలు నిజమవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఏపని చేపట్టినా విజయవంతంగా పూర్తి కాగలదు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవలకు గుర్తింపు లభిస్తుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించవచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాల నుంచి చాకచక్యంగా బయటపడతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) మీ సమర్థతను చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. పనులు చకచకా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. రుణాలు తీరుస్తారు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన వార్తలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఊరట కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కొత్త పనులకు శ్రీకారం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా అనుకూలం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అనుకోని విధంగా డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ముఖ్య నిర్ణయాలలో తొందరవద్దు. పనులలో జాప్యం. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. బంధువులు ఒత్తిడులు పెంచుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వాహనయోగం.