breaking news
single child
-
రెండేళ్ల పాటు బాలికలకు స్కాలర్షిప్.. ఆన్లైన్లో అప్లై చేయండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్(ఎస్జీసీఎస్) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్షిప్ను సీబీఎస్ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు ► విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్ గర్ల్‌చైల్డ్) అయి ఉండాలి. ► ఈ స్కాలర్షిప్కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు. ► విద్యార్థిని సీబీఎస్ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి. ► పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు. ► 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు. ► 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు. ► సీబీఎస్ఈ బోర్డుకు సంబంధించి ఎన్ఆర్ఐ విద్యార్థిని అయితే ట్యూషన్ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్షిప్కు అర్హురాలే. ► విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్ఈ వెబ్సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్/నోటరీ అటెస్ట్ చేసిన ఒరిజనల్ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. స్కాలర్షిప్ వ్యవధి ► స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ► స్కాలర్షిప్ రెన్యువల్ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి. ► విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి. ► ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్షిప్ కొనసాగుతుంది. ► స్కాలర్షిప్ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు. స్కాలర్షిప్ మొత్తం ► విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 ► సీబీఎస్ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022 ► వెబ్సైట్: cbse.nic.in -
చైనాలో రెండో బిడ్డకు ఓకే!!
చైనాలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి దంపతులు రెండో బిడ్డను కనేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే.. ఇందుకు ఓ కండిషన్ ఉందండోయ్!! తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు వారి తల్లిదండ్రులకు ఒకరే బిడ్డ అయి ఉండాలి. చైనాలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడం, యువతీ యువకుల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఆలస్యంగానైనా మేల్కొన్న అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) స్థాయీ సంఘం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ స్థాయీ సంఘం తీర్మానానికి చైనాలో చట్టబద్ధత ఉంటుంది. దీనికి అనుగుణంగా అక్కడి రాష్ట్రాలు కూడా తమ కుటుంబ నియంత్రణ విధానాలను మార్చుకోవాలని, లేదా అవసరమైతే ప్రత్యేక చట్టాలు కూడా చేయాలని తెలిపారు. ఇప్పటివరకు చైనాలో అమలులో ఉన్న 'ఒకే సంతానం' నిబంధనను సడలించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) నిర్ణయించింది. రాజ్యాంగంలో కూడా కుటుంబ నియంత్రణను అత్యవసర విషయంగా పేర్కొనడంతో, ఇప్పుడు దాన్ని సవరించడానికి అత్యున్నత శాసన వ్యవస్థ కలగజేసుకోవాల్సి వచ్చింది.