breaking news
silence protests
-
పసికందుతో మహిళ ధర్నా
తిరువొత్తియూరు: కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థలతో ఇంట్లోకి అనుమతించని భర్త ఇంటి ముందు ఓ ఇల్లాలు సోమవారం చంటి బిడ్డ సహా మౌన పోరాటం చేసింది. వివరాలు.. వెస్టు ముగపేర్ కార్పెంటర్ వీధికి చెందిన దినేష్ (35) ప్రైవేట్ సంస్థ ఉద్యోగి. అతని భార్య ప్రణీత (32). వీరికి రోహిత్ (9 నెలల) మగ బిడ్డ ఉన్నాడు. ప్రణీత వారం రోజుల ముందు అంబత్తూర్లో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. సోమవారం ఉదయం తన బిడ్డతో భర్త ఇంటికి వచ్చింది. ఆమెను వదిలి పెట్టడానికి తండ్రి బాలకన్నన్ వెంట వచ్చినట్టు తెలిసింది. భర్త దినేష్, అతని బంధువులు ప్రణీతను ఇంట్లోకి అనుమతించలేదు. బాలకన్నన్ వారికి సర్ది చెప్పినప్పటికీ వారు ససేమిరా అన్నారు. దీంతో ప్రణీత తన చంటి బిడ్డలో దినేష్ ఇంటి ముందు కూర్చుని మౌన పోరాటం చేశారు. ఆమె తండ్రి అక్కడే ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని భార్య, భర్తకు సర్దిచెప్పారు. -
ప్రేమ ముద్దు.. పెళ్లి వద్దు!
ప్రేమించామని ఊసులు చెబుతున్నారు. పెళ్లి చేసుకుం టామని నమ్మబలుకుతున్నారు. సినిమాలకు షికార్లకు తీసుకెళ్తున్నారు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా అడిగితే మాత్రం ప్లేట్ ఫిరాయిస్తున్నారు. దండేపల్లి ఘటనకు శుభం కార్డు పడకముందే ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రేమించిన వాడి ఇంటి ఎదుట మౌన పోరాటాలు చేస్తున్నారు యువతులు. మంగళవారం జన్నారం మండలంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్త ఇంటి ఎదుట బైఠాయించగా భర్త దూషించడంతో ఆత్మహత్యకు యత్నించింది. కెరమెరిలో యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైటాయించగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కెరమెరి(ఆసిఫాబాద్): కెరమెరి మండలం అనార్పల్లిలో మంగళవారం గోలేటికి చెందిన గుగులోతు కళ్యాణి పెళ్లి చేసుకోవాలని పోరాటం చేసింది. కళ్యాణి అనార్పల్లి గ్రామానికి చెందిన శ్రీదాస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తనను కాదని మరో అమ్మాయితో శ్రీదాస్ వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న కళ్యాణి ఆమె కుటుంబీకులతో కలిసి మంగళవారం అనార్‌పల్లికి చేరుకుంది. మధ్యలో ఉన్న ఆశ్రమ పాఠశాల సమీపంలో ఇరు వర్గాల మధ్య ఘర్షన చోటుచేసుకుంది. కళ్యాణి, శ్రీదాస్ బంధువులు వాదులాడుకున్నారు. దీంతో కెరమెరి పోలీసుల వచ్చి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం కళ్యాణి రోడ్డుపై మూడు గంటల పాటు బైఠాయించి నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను శ్రీదాస్ ఆరేళ్లుగా ప్రేమించుకున్నామని తన చెళ్లి పెళ్లి అయ్యాక పెళ్లి చేసుకుందామని శ్రీదాస్ నమ్మబలికాడని, తనను శారీరకంగా వాడుకున్నాక ఇప్పుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించుకు కూర్చుంది. సీఐ శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ విషయం తెలుసుకుని ఇద్దరిని పిలిపించి కౌన్సెలింగ్ జరిపిస్తామని ఆందోళన విరమింపజేసేందుకు ప్రయత్నం చేశారు. న్యాయం జరగకుంటే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేస్తానని కళ్యాణి తనతో తీసుకవచ్చిన పురుగుల మందు డబ్బాను ముందు పెట్టింది. డీఎస్పీ వదక్దు సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని, శ్రీదాస్ను కూడా పిలిపించి కౌన్సెలింగ్ చేస్తామని సీఐ, ఎస్సై చెప్పడంతో కళ్యాణి ఆందోళన విరమించింది. కళ్యాణికి ఉమ్మడి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు బియ్యాల పద్మ, నాయకురాళ్లు కాజల్ బిస్వాస్, పద్మా, తారా మద్దతు పలికారు. కళ్యాణితో ఎలాంటి సంబంధం లేదు కళ్యాణితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె నాకు బంధువు మాత్రమే. నేనెప్పుడూ ఆమెను ప్రేమించలేదు. 2015 లో ఉద్యోగం వచ్చిందని అప్పటి నుంచి నన్ను వేదనకు గురిచేస్తోంది. కళ్యాణి నాపై మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా పెట్టింది. నేను హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఉత్తర్వులు వచ్చాకే వివాహం చేసుకుంటున్నాను. – శ్రీదాస్ జన్నారం(ఖానాపూర్): జన్నారం మండలం పొన్కల్‌కు చెందిన జాదవ్ బద్రేశ్వర్, పొన్కల్‌కు చెందిన బాదవత్ స్వరూప పెద్దలనెదిరించి వివాహం చేసుకున్నారు. హైదరాబాద్‌లో చదువుతుండగా వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంట్లో వాళ్లను ఎదిరించి 2018 మార్చిలో గూడెంలోని ఆలయంలో వివాహం చేసుకున్నారు. అనంతరం కొన్ని గొడవలు జరగడంతో పది రోజుల క్రితం స్వరూప భర్త ఇంటి ఎదుట నిరసన తెలిపింది. చివరకు కలిసి ఉంటామని పోలీసుల ఎదుట కాగితం రాసుకున్నారు. వారం క్రితం హైదరాబాద్ వెళ్లారు. చిన్న చిన్న మనస్పర్ధలతో మంగళవారం తెల్లవారు జామున ఇద్దరూ జన్నారంకు వచ్చారు. నేను వస్తాను నువ్వు మీ ఇంటికి వెళ్లు అని బద్రేశ్వర్ ఎటో వెళ్లిపోయాడు. స్వరూప ఇంటికి వెళ్లడంతో ఆమె తల్లి అనసూయ ఇంటికి రానివ్వలేదు. దీంతో తిరిగి పొన్కల్‌లోని గాంధీనగర్‌కు వెళ్లే దారిలోని భర్త ఇంటి ఎదుట కూర్చుని ఫోన్ చేయడంతో విసిగించకు, టార్చర్ పెట్టకు అని భర్త అనడంతో స్వరూప సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగింది. స్థానికులు 108లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తల్లి అనసూయ, బంధువులు స్వరూపను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై తహసీనోద్దీన్ పరిస్థితిని సమీక్షించారు. ప్రేమించి మోసం చేసిన ప్రియుడి అరెస్ట్ సారంగపూర్(నిర్మల్): సారంగాపూర్ మండలం నాగపూర్ తండాకు చెందిన జాదవ్ కరుణ తన ప్రియుడు పెళ్లి చేసుకుంటానని మోసం చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం విధితమే. అయితే బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఈ ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శేక్ బాబ(30)ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై సునిల్‌కుమార్ తెలిపారు. -
పెళ్లింట.. కట్నం మంట
నిలిచిపోయిన పెళ్లి పెళ్లి చేసుకోవాల్సిందేనని.. యువతి మౌనపోరాటం పెళ్లిళ్లకు ప్రత్యేక డాట్‌కామ్‌లొచ్చాయి. ప్రస్తుతం యువతీయువకులు వాటిపైనే ఆధారపడుతున్నారు. ఆ విధంగానే ఓ జంటను కలిపింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్లికి ఇరువురు కుటుంబాలను ఒప్పించారు. కట్నకానుకలు ఓకే అనుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్నారు. కట్నం విషయంలో విభేదాలు వచ్చాయి. అంతే అడ్డం తిరిగాడు. అతడు పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫలితం లేదు. శనివారం మౌన పోరాటానికి దిగిన సంఘటన రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట చోటుచేసుకుంది. రెడ్డిగూడెం : కట్నం విషయంలో విభేదాలతో పెళ్లి చేసుకునేందుకు యువకుడు నిరాకరించడంతో బాధితురాలు శనివారం మౌనపోరాటానికి దిగింది. వివరాలు.. మండల పరిధిలోని అన్నేరావుపేటకు చెందిన నెల్లూరు విజయ్‌దీపు, గాజువాకకు చెందిన సామరోతు లక్ష్మీమానసకు మధ్య ఓ వెబ్సైట్ ద్వారా ఇద్దరు పరిచయమయ్యారు. పరిచయం వివాహం వరకు వెళ్లింది. ఇరువురి తల్లిదండ్రులు, పెద్దలూ అంగీకరించారు. పెళ్లి తేదీ పెట్టుకున్నారు. కట్నకానుకల విషయంలో విభేదాలు రావడంతో వివాహం చేసుకునేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో ఆమె తనకు న్యాయం చేయాలంటూ యువకుడు ఉద్యోగం చేస్తున్న హైదరాబాద్‌లోనూ, అదే విధంగా యువకుడు బంధువులున్న ఖమ్మం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ తనకు న్యాయం జరగకపోవడంతో శనివారం ఉదయం 5.30 గంటలకు విజయ్‌దీప్ స్వగ్రామమైన అన్నేరావుపేటలోని అతని ఇంటి ముందు దీక్ష చేపట్టింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు యువతిని దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నించిన అంగీకరించలేదు. మైలవరం సీఐ వెంకట రమణ, రెడ్డిగూడెం ఎస్ఐ కె.రమేష్ ఆమెతో చర్చించారు. అయినా ఫలితం లేదు. యువతి దీక్ష కొనసాగిస్తోంది.