breaking news
Shobhana Bhartia
-
టాప్ 100 శక్తివంత మహిళల్లో మనవాళ్లు నలుగురు
న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందిందిన ఈ ఏడాది అగ్రశ్రేణి వంద అత్యంత శక్తివంతమైన మహిళల్లో మన దేశానికి చెందిన నలుగురు మహిళలకు చోటుదక్కింది. హెచ్‌సీఎల్ రోష్ని నాడార్ మల్హోత్రా, బయో కాన్ కిరణ్ మజుందార్ షా, హిందుస్థాన్ టైమ్స్ శోభన భర్తియ, సినీతార ప్రియాంక చోప్రా జాబితాలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 మందితో రూపొందించిన ఈ జాబితాలో అగ్రస్థానంలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిలిచారు. ఆమె ఈ జాబితాలో టాప్‌లో నిలవడం ఇది వరుసగా ఎనిమిదో సంవత్సరం. రెండో స్థానంలో యూకే ప్రధాని థెరిసా మే, మూడో స్థానంలో ఐఎమ్ఎఫ్ ఎమ్డీ క్రిస్టినా లగార్డే ఉన్నారు. 51వ స్థానంలో రోష్ని నాడార్... హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు సీఈఓగా వ్యవహరిస్తున్న రోష్ని 51వ స్థానంలో నిలిచారు. కిరణ్ షా 60వ స్థానంలో, హెచ్‌టీ మీడియా సీఎండీ శోభనా భర్తియ 88వ స్థానంలో నిలిచారు. ప్రియాంక చోప్రా 94వ స్థానంలో నిలిచారు. -
ఆ పవర్ ఫుల్ మహిళల్లో నలుగురు మనోళ్లే
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల్లో మనవాళ్లు నలుగురు నిలిచారు. ప్రపంచంలో 100మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా 2016 ఎడిషన్ ను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య(25వ ర్యాంకు), ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచ్చర్(40వ ర్యాంకు), బయోకాన్ చైర్మన్, ఎండీ కిరణ్ మజుందర్ షా(77వ ర్యాంకు), హెచ్ టీ మీడియా లిమిటెడ్ ఎడిటోరియల్ డైరెక్టర్, చైర్ పర్సన్ శోభనా భారతీయ(93వ ర్యాంకు)లు చోటు దక్కించుకున్నారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో జర్మన్ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. వరుసగా ఆరోసారి ఆమె ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. మెర్కెల్ తర్వాత స్థానం అమెరికా అధ్యక్ష అభ్యర్థురాలు హిల్లరీ క్లింటన్ ను వరించింది. అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్ జానెట్ ఎల్లెన్ ఈ లిస్ట్ లో మూడో స్థానంలో నిలిచారు. బిలీనియర్లు, బిజినెస్, ఫైనాన్స్, మీడియా, పాలిటిక్స్, ఫిలాంథ్రఫిక్ట్స్, ఎన్ జీవోస్, టెక్నాలజీ వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారినుంచి ప్రపంచంలోనే 100 మంది అత్యంత శక్తివంతుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ కేటగిరీల్లో సంపద, మీడియా ఉనికి, ప్రతిభపాటవాలు వంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది.