breaking news
shivaram prasad
-
‘లోహార’కు త్వరలో ఇంటర్నెట్
ఆదిలాబాద్ రూరల్: ఆదిలాబాద్ రూరల్ మండలం లోహార గ్రామంలో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్, నెట్ సరిగా లేక విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు గుట్టలు, చెట్లు ఎక్కుతున్న తీరుపై ‘సిగ్నల్ దొరికేనా.. పాఠం వినేనా’అనే శీర్షికతో జూలై 3న ‘సాక్షి’మెయిన్ పేజీలో ఫొటో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన టెలికం టెస్, టెరా టెక్నో సొల్యూషన్స్, టెలికం శాఖ అధికారులు నెట్వర్క్ ఏర్పాటు కోసం రెండు రోజుల పాటు లోహార గ్రామంలో సర్వే చేశారు. పీఎం–వాణి ద్వారా త్వరలో ఇంటర్నెట్ అందుబాటులో తెస్తామని ఈ సందర్భంగా టెలికం శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఎస్.శివరాంప్రసాద్ తెలిపారు. ఈ మేరకు లోహార గ్రామస్తులతో సమావేశం నిర్వహించి పీఎం–వాణి పథకంలో భాగంగా పబ్లిక్ డేటా ఆఫీస్ (పీడీవో)ల ఏర్పాటుపై అవగాహన కల్పించామని చెప్పారు. గతంలో టెలిఫోన్ బూత్‌ల వద్ద ఎలా ఫోన్ ఉపయోగించేవారో అలాగే పీడీవోకు వచ్చి ఇంటర్నెట్ వాడుకోవచ్చన్నారు. చేతిలో ఫోన్ లేకున్నా పీడీఓలో అందుబాటులో ఉండే ఫోన్ ద్వారా తమ పనులు చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. -
శేషాచల కొండల్లో ఫ్లయింగ్ స్నేక్
తిరుపతి : భారతదేశంలో ఎక్కడా కనిపించని శ్రీలంకన్ ఫ్లయింగ్ స్నేక్ శేషాచలం అడవుల్లో ఉన్నట్టు నిర్ధారణ అయిందని తిరుపతి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ శివరామ్‌ప్రసాద్ తెలిపారు. ఆయన వివరాల మేరకు చెట్ల పైభాగాన సంచరించే ఈ స్నేక్ బూడిద రంగులో ఉంటుంది. శరీరంపై నల్లటి చారలుంటాయి. విషపూరితమైన ఈ పామును చామల రేంజ్ అటవీప్రాంతంలో శివరామ్‌ప్రసాద్ ఆధ్వర్యంలో తమిళనాడు పరిశోధకుడు బుభేష్గుప్తా ఏడాది క్రితం గుర్తించారు. బెంగుళూరులోని ఇండియన్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు డీఎన్ఏని పంపి 2 రోజుల క్రితం నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం దీన్ని తిరుపతిలోని బయో రీసెర్చి సెంటర్లో ఉంచారు. వైఎస్ఆర్ జిల్లా బాలపల్లి రేంజ్‌లోని కోడూరు ప్రాంతంలో ఈ పాము కనబడిందని.. ఇక్కడ స్లెండర్ కోరల్ స్నేక్, షీల్టైల్ స్నేక్, బూబ్రౌన్ వైన్ స్నేక్, ఎల్లో కాలీడ్ ఉల్ఫ్ స్నేక్, రేసర్ లనూ గుర్తించారని తెలిపారు.