breaking news
Sharana Navaratri
-
శరన్నవరాత్రులు..ఆరో రోజు మహాలక్ష్మీగా అలంకారం..
శరన్నవరాత్రుల్లో ఊరు, వాడ, అమ్మవారి ఆరాధనలతో ఒక్కసారిగా ఆధ్యాత్మిక ప్రదేశాలు మారిపోతాయి. అప్పుడే నవరాత్రుల వేడుకులు ఆరో రోజుకి చేరుకున్నాయి. ఈ ఆరో రోజు అమ్మవారు 'శ్రీ మహాలక్ష్మీ దేవి'గా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, మరొక హస్తంతో కనకధార కురిపిస్తూ.. తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.మంగళ ప్రదాయినిఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.శ్లోకం: "యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా"! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే.."నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే" అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.మరోవైపు ఆరోరోజు పలుచోట్ల దుర్గమ్మని కాత్యాయనీ దేవిగా ఆరాధిస్తారు. ఈమెను హృదయపూర్వకంగా ఆరాధిస్తే అన్ని రోగాలు, దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు కాత్యాయని దేవి ఆరాధన చేయడం వలన వివాహం కానీ యువతులు కోరుకున్న వరుడిని పొందుతారని పురాణ వచనం.దుర్గామాత ఆరో రూపమే కాత్యాయని. కాత్యాయన మహర్షి పార్వతీమాత తన కుమర్తెగా జన్మించాలనే కోరికతో తపస్సు చేశాడు. అతని తపస్సుకి మెచ్చి కూతురుగా జన్మించింది. అందువల్లే దుర్గామాతకు కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో ఒక దేవిని సృష్టిస్తారు. ఆమెనే ఈ కాత్యాయని దేవి. ఈమెను మొట్టమొదటగా కాత్యాయన మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది.నైవేద్యం: పరమాన్నం, అప్పాలు, బూరెలు(చదవండి: దసరాలో తప్పక చూడాల్సిన ప్యాలెస్ ఇది..!) -
9వ రోజు (నేడు దుర్గాష్టమి) అలంకారం దుర్గాదేవి
శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారిని పులివాహనంపై కత్తి, త్రిశూలం చేబూని దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేయడానికి అవతరించిన దుర్గాదేవి నిజరూపంగా భక్తులకు దర్శనమిస్తుంది. లోకభయంకరుడైన రురువు కుమారుడు దుర్గముణ్ణి సంహరించిన తరువాత పరాశక్తి ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిందని పురాణ గాథ. ఎందరో రాక్షసులను సంహరించిన దుర్గాదేవిని దుర్గాష్టమి రోజున దర్శించుకుంటే దుర్గతులనుండి తప్పించుకోగలుగుతారనేది భక్తుల విశ్వాసం. శ్లోకం: సర్వ స్వరూప సర్వేశీ సర్వశక్తి సమన్వితే! భయేభ్యః ప్రాహివో దేవి దుర్గేదేవి నమోస్తుతే!! భావం: దుష్టశిక్షణ చేయడానికి అవతరించి సర్వభయాలనూ పారద్రోలు దుర్గాస్వరూపమైన అమ్మా! నీకు నమస్సులు. ఫలమ్: శత్రుబాధలు తొలగిపోయి సకల కార్యములయందు విజయం పొందుతారు. నివేదన: పేలాలు, వడపప్పు, పాయసం -
క్యూలైన్లో స్పృహ కోల్పోయిన చిన్నారి
ఆదివారం ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తడంతో.. వీఐపీ క్యూ లైన్లో ఓ చిన్నారి స్పృహతప్పింది. సెలవు రోజు కావడంతో ఆలయానికి భారీగా అనధికార వీఐపీలు పోటెత్తారు. ఆసహనానికి గురైన ఆలయ ఈవో వేణు వీఐపీ క్యూలైన్ గేట్లకు తాళాలు వేశాడు. ఇదే సమయంలో మచిలీపట్నం ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ(8) స్పృహతప్పింది. ఆమెను వెంటనే ప్రధమ చికిత్సాకేంద్రానికి తరలించారు. ఈవో చర్య వల్ల అర్చకులు సైతం గేట్లు దూకి గర్భగుడిలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈవో తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆదివారం మధ్యాహ్నానికి 80 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి 3 గంటలు, రూ.100, రూ.250 టికెట్ల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.