breaking news
Shane Dowrich
-
విండీస్ వికెట్‌కీపర్ సంచలన నిర్ణయం.. ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేసినా..!
విండీస్ వికెట్‌కీపర్, బ్యాటర్ షేన్ డౌరిచ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు లభించినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని డౌరిచ్ తెలిపాడు. డౌరిచ్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం పట్ల విండీస్ క్రికెట్ బోర్డు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 2015లో అంతర్జాతీయ క్రికెట్లోకి (టెస్ట్) ఎంట్రీ ఇచ్చిన 32 ఏళ్ల డౌరిచ్.. విండీస్ తరఫున 35 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. టెస్ట్‌ల్లో ఓవరాల్‌గా 1570 పరుగులు చేసిన అతను 3 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు సాధించాడు. వికెట్‌కీపర్‌గా డౌరిచ్ 91 మందిని ఔట్ చేయడంలో భాగమయ్యాడు. కాగా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు డిసెంబర్ 3 నుంచి కరీబియన్ దీవుల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలోని వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు ఇదివరకే తమ జట్లను ప్రకటించాయి. డిసెంబర్ 3, 6, 9 తేదీల్లో మూడు వన్డేలు.. 12, 14, 16, 19, 21 తేదీలో టీ20లు జరుగనున్నాయి. వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్: హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, విల్ జాక్స్, సామ్ కర్రన్, లియామ్ లివింగ్‌స్టోన్, రెహాన్ అహ్మద్, జోస్ బట్లర్ (కెప్టెన్), ఓలీ పోప్, ఫిలిప్ సాల్ట్, అట్కిన్సన్, టామ్ హార్ట్లీ, బ్రైడన్ కార్స్, జాన్ టర్నర్, మాథ్యూ పాట్స్ వెస్టిండీస్ జట్టు: అలిక్ అథాంజే, బ్రాండన్ కింగ్, జోన్ ఓట్లీ, షిమ్రోన్ హెట్‌మైర్, కీసీ కార్టీ, రోస్టన్ ఛేజ్, షాయ్ హోప్ (కెప్టెన్), షేఫాన్ రూథర్‌ఫోర్డ్, గుడకేశ్ మోటీ, షేన్ డౌరిచ్, అల్జరీ జోసఫ్, మాథ్యూ ఫోర్డ్, ఒషేస్ థామన్, యాన్నిక్ కారయ, రొమారియో షెపర్డ్ -
రామ్‌దిన్ కు షాక్
బసెటెర్రె (సెయింట్ కిట్స్): వెటరన్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ దినేశ్ రామ్‌దిన్ కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూసీబీ) షాక్ ఇచ్చింది. టెస్టు జట్టు నుంచి అతడికి ఉద్వాసన పలికింది. భారత్ తో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌కు ఎంపిక చేసిన విండీస్ టీమ్ లో అతడికి చోటు దక్కలేదు. అతడి స్థానంలో షేన్ డౌరిచ్ ను తీసుకున్నారు. తనను జట్టు నుంచి తప్పిస్తున్నట్టు విండీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కర్టీ బ్రౌన్ ముందుగా సమాచారం ఇచ్చారని గతవారం రామ్‌దిన్ వెల్లడించాడు. తన ఉద్వాసను బ్రౌన్ కారణమంటూ మండిపడ్డాడు. ఫాస్ట్ బౌలర్లు కీమర్ రోచ్, జెరోమ్ టేలర్ లను కూడా పక్కనపెట్టారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రొస్టన్ ఛేజ్ తొలిసారిగా జాతీయ జట్టులో స్థానం సంపాదించాడు. ఎడంచేతి బ్యాట్స్ మన్ లియన్ జాన్సన్ కూడా జట్టులోకి వచ్చాడు. విండీస్ టెస్ట్ టీమ్: జాసన్ హోల్డర్(కెప్టెన్), క్రెయిగ్ బ్రాత్‌వైట్(వైస్ కెప్టెన్), దేవేంద్ర బిషో, బ్లాక్‌వుడ్, కార్లోస్ బ్రాత్‌వైట్, డారెన్ బ్రావొ, రాజేంద్ర చంద్రిక, రొస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, లియన్ జాన్సన్, మార్లన్ శామ్యూల్స్, షనన్ గాబ్రియల్