breaking news
sewer water
-
వరికి ఆకుముడత, లద్దెపురుగు
అనకాపల్లి: వరిపై పురుగు, తెగుళ్ల దాడి మొదలైంది. జిల్లాలో ఉన్న అధిక శాతం వరిలో భాగంగా సాంబమసూరి, ఆర్జీల్ 2537 రకాలపై ఆకుముడత, లద్దెపురుగు, గోదుమరంగు మచ్చ తెగులు విజృంభిస్తున్నాయి. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. జమున, డాక్టర్ ఎన్. రాజ్‌కుమార్‌లు బుధవారం అనకాపల్లి, మునగపాక మండలాల సరిహద్దుల్లోని వరి పొలాలను పరిశీలించి ఈ తెగుళ్లను గుర్తించారు. ప్రస్తుత వరి పొలాలు ఈనిక దశ నుంచి పాలు దశలో ఉన్నాయి. కాండం తొలుచు పురుగు యొక్క తల్లి రెక్కలు పురుగులు ఎక్కువుగా తిరగడం వల్ల వరికి నష్టం వాటిల్లితున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి గుడ్లు పెట్టి లార్వాలుగా మారిన వెంటనే వరి పంటపై తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ కారణంగానే తెల్ల కంకులు ఏర్పడుతున్నట్లుగా శాస్త్రవేత్తలు గమనించి వాటి సంతతి వృద్ధి చెందకుండా ముందు జాగ్రత్తగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈనిక దశలో ఉన్న వరి పొలాల్లో ఆకుముడత, లద్దెపురుగు, గోదమ రంగు మచ్చ తెగుళ్లు ఆశిస్తున్నందువల్ల ఆకుముడత పురుగు ఆకులను ముడత చేసుకొని లోపల దాగి ఉండి ఆకుల పత్రహరితాన్ని గోకి తింటుందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆకులు ఈ కారణంగా చారలు చారలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. లద్దె పురుగు వల్ల ఆకులు కత్తిరించబడడం, ఆకులు తినివేయడం తరువాత గింజగట్టి పడే దశలో వెన్నెలు కొరికి నష్టాన్ని కలుగు జేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రెండు రకాల పురుగుల నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు, ఒక మిల్లీలీటరు నువాన్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. లద్దె పురుగులు దుబ్బుల అడుగున దాగి వుండడం వల్ల పొలం నీరు నిలబెట్టి పిచికారీ చేసినట్లయితే దాగి వున్న పురుగులు పైకి వచ్చి చనిపోతాయి. గోదమ మచ్చ తెగులు ఎక్కువుగా ఉన్నచోట లీటరు నీటికి ఒక గ్రాము కార్బన్డిజం కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచిస్తున్నారు. ఇదిలావుండగా తుపాను నేపధ్యంలో ఎలుకలు వాటి సంతతిని ఎక్కువుగా చేసుకొని పాలు పోసుకున్న కంకులను కొరికివేయడం వల్ల ఎక్కువుగా నష్టం వాటిల్లుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు విషపు ఎరలను పెట్టాలని సూచించారు. 96 పాళ్ల బియ్యపు నూకను, రెండుపాళ్ల నూనె, రెండుపాళ్ల గ్రోమోర్ డయోలిన్ చొప్పున కలిపి విషపు ఎరను తయారు చేసినట్లయితే ఎలుకుల నివారణకు సాధ్యపడుతుందని తెలిపారు. ఇలా తయారైన మిశ్రమాన్ని 20 గ్రాములు చొప్పున చిన్న చిన్న పొట్లాలను కలిపి పొలం గట్ల మీద ఉన్న ఎలక కన్నాలలో వేస్తే వాటి నివారణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. మినుము, పెసర సాగులో మెలకువలు యలమంచిలి : సాధారణంగా ఎర్రనేలల్లో మినుము, పెసర రబీ పంటగా చేపట్టవచ్చని, అడపాదడపా కురుస్తున్న వర్షాలు అనుకూలమని వ్యవసాయాధికారులు తెలిపారు. మురుగునీరు నిలవని ఎర్ర, నల్ల రేగడి నేలల్లో ఈ పంట సాగు లాభదాయకంగా ఉంటుందని వివరించారు. రకాలు: మినుము సాగుకు ఎల్.బి.జి. 752, 709 (పంటకాలం 75-85 రోజులు) రకాలను ఎంపిక చేసుకోవచ్చు. పెసర సాగుకు ఎల్.జి.జి 407 ఎం.ఎల్ - 267 (పంటకాలం 60-70 రోజులు) రకాలను విత్తుకోవచ్చు. విత్తే విధానం: ఎకరాకు ఎనిమిది కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు విత్తనాలను మూడు రకాలుగా శుద్ధి చేయడం ద్వారా తొలి దశలో పైరుకు చీడపీడల బెడద ఉండదు. కీటకాల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ కలిపి ఆరబెట్టాలి. అనంతరం తెగుళ్ల నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెట్ కలపాలి. భూమిలోని నత్రజనిని మొక్కలు సులువుగా తీసుకునేందుకు వీలుగా 200 గ్రాముల రైజోబియం కల్చరును చల్లార్చిన బెల్లం పాకంలో కలిపి ఎనిమిది కిలోల విత్తనాలకు పట్టించాలి. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండేలా విత్తుకోవాలి. రాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేలల్లో వెదజల్లే పద్ధతిని విశాఖజిల్లా రైతులు పాటిస్తున్నారు. మినుము, పెసర చేలకు చుట్టూ కంచె పంటగా జొన్న, ఆవాలు, బంతిమొక్కలను పెంచితే కాయతొలిచే పురుగు, పచ్చపురుగు తెల్లదోమ వ్యాప్తి తగ్గుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువుతో పాటు ఎనిమిది కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం అందించే ఎరువులను విత్తడానికి ముందుగా భూమిలో వేయాలి. కలుపు నివారణకు పప్పుధాన్యపు పైర్లను విత్తిన 24 గంటల్లోపు 500 మిల్లీలీటర్లు పెండిమిథాలిన్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా తడినేలపై పిచికారీ చేస్తే నెలరోజుల పాటు కలుపు బెడద ఉండదు. సస్యరక్షణ: ఆకులను జల్లెడలా మార్చే చిత్తపురుగుల నివారణకు లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్లు చొప్పున క్లోరిపైరిఫాస్ కలిపి మొక్కలు తడిచేలా చల్లాలి. పల్లాకు తెగులు సోకితే, ఈ తెగులును వ్యాప్తిచేసే తెల్లదోమ నివారణకు లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున థయోఫానేట్ మిథైల్ కలిపిన ద్రావణాన్ని మొక్కలు తడిచేలా చల్లాలి. చేలో పల్లాకు తెగులు మొక్కలు ఎక్కువగా ఉంటే, వాటిని పీకి పొలానికి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. కాయతొలిచే మచ్చల పురుగు నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు క్లోరిపైరిఫాస్, ఒక మిల్లీలీటర్లు డైక్లోరోవాస్ కలిపి పిచికారీ చేయాలి. చోడవరం : సుడిదోమ బెడద నుంచి వరి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. హుద్‌హుద్ తుఫాన్ ప్రభావం వల్ల జిల్లాలో వరికి వివిధ చీడపీడలు ఆశించాయి. వేలాధి ఎకరాల్లో పంట నాశనమవుతోంది. దోమ కారణంగా పంట పూర్తిగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉన్న పంటను రక్షించుకునేందుకు నానా యాతన పడుతున్నారు. వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తల సూచన మేరకు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. చోడవరం,మాడుగుల నియోజకవర్గాల్లో సుమారు 80వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. ఇందులో సుమారు 30వేల ఎకరాలకు దోమ సోకింది. పక్కపొలాలకు విస్తరిస్తోంది. ఆకుల ఆడుగు భాగాన ఆశించడంతో అవి ఎండిపోయి పంట మాడిపోతోంది. సందట్లో సడేమియాలా నివారణకు వినియోగించే మందుల్లో నకిలీలు ఉంటున్నాయి. కొన్ని రకాల మందులు పనిచేయడం లేదని వ్యవసాయాధికారులే చెబుతున్నప్పటికీ వాటి విక్రయాలను నిలిపివేయకపోవడంతో రైతులు చాలా నష్టపోతున్నారు. పంటల పరిరక్షణకు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ ఏడీ బి.మోహనరావు సూచించారు. వరిపంటను ఆవరించిన సుడిదోమ తెగుళు నివారణకు మోనోక్రోటోపాస్ రె ండు గ్రాములు, నివానోక్రాన్ ఒక గ్రాము కలిపి లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇలా కలిపిన ద్రావణాన్ని ఎకరాకు 200లీటరు మందును ఆకు తడిసే వరకు పిచికారీ చేయాలని సూచించారు. -
‘మురుగు’పాలిటీలు!
మున్సిపాలిటీల్లో దిగజారిన పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పేరుకుంటున్న చెత్తచెదారం సరిపోని పారిశుద్ధ్య కార్మికులు డంపింగ్యార్డుల్లేక అవస్థలు కొత్త పాలకవర్గాలైనా దృష్టి సారించాలి అనకాపల్లి రూరల్, న్యూస్‌లైన్: సుమారు లక్ష జనాభా నివసిస్తున్న అనకాపల్లి పట్టణాన్ని పారిశుద్ధ్య సమస్య పీడిస్తోంది. ఇటీవలే జీవీఎంసీలో విలీనమైనా సమస్య పరిష్కారం కాలేదు. వర్షం కురిస్తే చాలు రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తుంది. పాదచారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. కాలువలను రోజూ శుభ్రం చేయకపోవడం వల్ల నీరు నిల్వ ఉండిపోతోంది. దోమల విజృంభణతో వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. సులభ్ కాంప్లెక్స్‌లైతే మరీ అధ్వానం. వాటినసలు పూర్తిగా శుభ్రపరిచిన దాఖలాల్లేవు. ముప్ఫయ్యేళ్ల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా 256 మంది పారిశుద్ధ్య కార్మికులుండేవారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు కూడా 144 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వాస్తవానికి 162 మంది పారిశుద్ధ్య కార్మికులున్నా 18 మంది డిప్యుటేషన్‌పై వాచ్మన్లు, ఆయాలుగా విధులు నిర్వహిస్తున్నారు. రోజూ కాలువలను శుభ్రపరచరు కాలువలను రోజూ శుభ్రం చేయడం లేదు. దీనివల్ల దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నాం. వర్షాలు కురిసినప్పుడు కాలువలు పొంగి నీరు రోడ్లపై ప్రవహించడంతో నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. - మొల్లేటి కేశవరావు, గవరపాలెం శుభ్రతకు నోచని సులాభ్ కాంప్లెక్స్ గవరపాలెం 19వ వార్డులోని సులాభ్ కాంప్లెక్స్‌ను శుభ్రపరిచి నెలలు గడుస్తున్నాయి. ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. పట్టించుకునే నాధుడే లేడు. - దొడ్డి తవుడుబాబు, గవరపాలెం