breaking news
settidemudu
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
-
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత
విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం వెదురువాడ సమీపంలో సోమవారం వేకువజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ట్రాక్టర్లో యలమంచిలి వైపు వెళ్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో శెట్టి దేముడు(45), కె.అప్పలనాయుడు(38) అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు.