breaking news
sep 11
-
9/11 ఉగ్రదాడి కేసు : రూ.600 కోట్ల పరిహారం
న్యూయార్క్ : అమెరికాపై ఆల్‌ఖైదా ఉగ్రవాదులు 2001, సెప్టెంబర్ 11న దాడి చేసిన ఘటనలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లు రెండు ధ్వంసం అయ్యాయి. ఆ రెండు భారీ ఆకాశహర్మ్యాలను రెండు విమానాలు ఢీకొనడంతో ఈ విధ్వంసం జరిగిన విషయం తెలిసిందే. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌తోపాటు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ సంస్థలకు చెందిన విమానాలతో ఉగ్రవాదులు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశారు. అయితే ఇప్పుడు ఆ దాడి కేసులో ఓ సెటిల్మెంట్ జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాపర్టీస్ డెవలప్ చేస్తున్న లారీ సిల్వర్‌స్టన్ 12.3 బిలియన్ల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాగా తాము రూ.600 కోట్లు చెల్లించేందుకు రెండు విమాన సంస్థలు అంగీకారాన్ని తెలిపాయి. రెండు భారీ బిల్డింగ్లు నేలకూలిన కేసులో ఇప్పటికే ఆయనకు 4.55 బిలియన్ డాలర్ల బీమా అందింది. ఇప్పుడు తాజాగా విమాన సంస్థలు కూడా సిల్వర్‌స్టన్‌తో నష్టపరిహాం కేసులో సెటిల్మెంట్ చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం కుదిరిన ఒప్పందానికి అమెరికా కోర్టు అంగీకారం తెలపాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు ట్విన్ టవర్స్ కూల్చివేసిన ఘటనలో సుమారు 2700 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
మాట్రిమోనీ ఐపీవో షురూ!
సాక్షి, ముంబై: ప్రస్తుత బిజీ లైఫ్‌లో మాట్రిమోనీ.కామ్ ప్రాముఖ్యత, అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాలిన పనిలేదు. 30 లక్షల మందికిపైగా యాక్టివ్ ప్రొఫైల్స్ తో ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలను కుదిర్చే ఈ సంస్థ భారీ లాభాలనే ఆర్జించింది. అటు మాట్రిమోనీ.కామ్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ ఈ రోజు (సెప్టెంబర్ 11, సోమవారం) ప్రారంభంకానుంది. బుధవారం ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 983-985 మధ్య మూడు రోజులపాటుకొనసాగనుంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ద్వారా రూ. 500 కోట్లు సమకూర్చుకోవాలని కంపెనీ నిర్ణయించింది. భావిస్తోంది. ఆఫర్లో భాగంగా రూ. 5 ముఖ విలువగల 37.67 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు రూ. 130 కోట్ల విలువ చేసే ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. ఇప్పటికే షేరుకి రూ. 985 ధరలో హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్, గోల్డ్‌మన్ శాక్స్, బేరింగ్ పీఈ ఇండియా తదితర యాంకర్ ఇన్వెస్టర్లకు దాదాపు 23 లక్షల షేర్లను విక్రయించింది. తద్వారా రూ. 226 కోట్లు సమీకరించింది. రిటైలర్లకు డిస్కౌంట్ విషయానికి వస్తే పబ్లిక్ ఇష్యూలో భాగంగా అర్హతగల కంపెనీ ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు షేరుకి రూ. 98 డిస్కౌంట్‌ను మాట్రిమోనీ ఆఫర్ చేస్తోంది. అయితే కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అంతకుమించి షేర్లు కొనుగోలు చేయాలంటే రూ. 2 లక్షల విలువకు మించకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐపీవో ద్వారా సమీకరించే నిధులను ప్రకటనలు, బిజినెస్ ప్రమోషన్, చెన్నైలో కార్యాలయం ఏర్పాటు తదితరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. కాగా 2001లో దేశీయ తొలి మాట్రిమోనీ కంపెనీగా ఏర్పాటైన కంపెనీఅవతరించిన భారత్ మాట్రిమోనీ ఇంటర్నెట్, మొబైల్ ప్లాట్‌ఫామ్స్ ఆధారంగా పెళ్లి సంబంధాలు తదితర సర్వీసులను అందిస్తోంది.