breaking news
senier journalist
-
సీనియర్ పాత్రికేయుడి మృతి
భువనేశ్వర్ : సీనియర్ పాత్రికేయుడు చంద్రభాను పట్నాయక్ (60) కన్నుమూశారు. ఆయన స్థానిక ప్రముఖ దిన పత్రికలు సమాజ్, సమయ్ సంపాదకులుగా పనిచేశారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక క్యాపిటల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి స్థానిక స్పర్శ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు. పూరీ స్వర్గ ద్వార్ సముదాయంలో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన చంద్రభాను పట్నాయక్ రాజకీయ విశ్లేషకులుగా పేరొందారు. ఆంగ్లంలో పట్టభద్రుడైన ఆయన స్థానిక ఏకామ్ర కళాశాలలో అధ్యాపకుడిగా కొద్దికాలం పనిచేశారు. అనంతరం పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టారు. స్థానిక ఒడియా దినపత్రిక ప్రగతివాదిలో తొలుత పాత్రికేయునిగా జీవితం ప్రారంభించారు. తదుపరి ప్రతిష్టాత్మక సంబాద్, సమయ్, ఎస్టీవీ చానల్ సంపాదకుడిగా వ్యవహరించారు. ఒడియా కళలు, సంస్కృతి, సాహిత్యంపట్ల ఆయన గట్టి పట్టు సాధించారు. -
సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య!
మొహాలి: ఇటీవల బెంగళూరులో సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్, త్రిపురలో శాంతను భౌమిక్‌ల దారుణ హత్యల్ని మరువకముందే పంజాబ్‌లో మరో సీనియర్ జర్నలిస్ట్ శనివారం అనుమానాస్పదంగా మృతిచెందారు. మొహాలిలోని ఫేజ్3 బీ2 ఇంట్లో నివాసముంటున్న సీనియర్ జర్నలిస్ట్ కేజే సింగ్(64), ఆయన తల్లి గురుశరణ్ కౌర్(92)లు తమ గదుల్లో విగతజీవులై కన్పించారు. సింగ్ గొంతు కోసి కత్తితో పొడిచిన దుండగులు, ఆయన తల్లి గొంతు నులిమి హతమార్చి ఉంటారని ముఖ్యమంత్రి కార్యాలయం అధికార ప్రతినిధి మీడియాకు తెలిపారు. సింగ్‌ను కలుసుకునేందుకు ఆయన చెల్లి యశ్పాల్ కౌర్ మేనల్లుడు అజయ్ పాల్లు శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట మధ్యలో ఇంటికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చిందన్నారు. సింగ్ ఇంటికి ఎలాంటి సీసీటీవీలు బిగించుకోలేదనీ, ఆయన కారు కూడా కనిపించడం లేదని వెల్లడించా రు. పంజాబ్ సీఎం అమరీందర్ ఆదేశాలతో దుండగుల్ని పట్టుకోవడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సిట్‌కు ఐజీ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తారని తెలిపారు. వీరిద్దరిని హత్యచేసిన దుండగులు.. సింగ్ మెడలోని బంగారు గొలుసును, ఆయన తల్లి గదిలో ఉన్న రూ.25 వేల నగదును ముట్టుకోలేదన్నారు. ఇది దోపిడీ ఘటనలా కన్పించినప్పటికీ అసలు కారణం వేరే ఉంటుందన్నారు. -
జర్నలిస్టు కె.ఎల్.రెడ్డికి రూ.15 లక్షల సాయం
చెక్కును అందించిన సీఎం కేసీఆర్ సాక్షి, హైద రాబాద్: వయోధిక పాత్రికేయుడు, తొలితరం తెలంగాణ పాత్రికేయ ఉద్యమకారుడు, ర చయిత కంచర్ల లక్ష్మారెడ్డి (కె.ఎల్.రెడ్డి)కి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.15 లక్షల ఆర్థిక సహాయం అందించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంతోపాటు అనేక సామాజిక అంశాలపై అక్షర సమరం సాగిస్తున్న కె.ఎల్.రెడ్డి ప్రస్తుతం అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి, సోమవారం కె.ఎల్.రెడ్డిని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి, యోగ క్షేమాలు విచారించారు. అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. వైద్య ఖర్చులు, ఇతర అవసరాల కోసం రూ.15 లక్షల చెక్కును అందించారు. ఏడు దశాబ్దాల పాటు ఆయన పాత్రికేయ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ సహాయం అందిస్తున్నట్లు సీఎం చెప్పారు. నల్లగొండ జిల్లా నరసాయపల్లెకు చెందిన కంచర్ల లక్ష్మారెడ్డి వయసు 85 సంవత్సరాలు. కాగా, తన పట్ల ముఖ్యమంత్రి చూపించిన ఆదరణకు కె.ఎల్. రెడ్డి కృతజ్ఞతలుతెలిపారు.