breaking news
selfie girl
-
సెల్ఫీ కోసం బిత్తిరి పని, పోలీసుల ఎంట్రీతో..
భోపాల్: సెల్ఫీ తీసుకోవటం అంటే ఇష్టంలేని వాళ్లు ఉండరు. సెల్ఫీ ఫోటోల కోసం యువత ఎన్ని సహసాలకైనా సిద్ధమవుతోంది. కొంతమంది సెల్ఫీ ఫోటోల దిగే క్రమంలో ప్రాణాలను సైతం కోల్పోయిన సంఘటనలు చూశాం. తాము అందరి కంటే భిన్నంగా సెల్ఫీ ఫోటోలు దిగాలనే మోజులో మరికొంత మంది యువతీ, యువకులు విచిత్రమైన విన్యాసాలు చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్లోని రత్లం జిల్లా సుఖేదా గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువతి తన స్నేహితుల వాట్సాప్ గ్రూప్లో విభిన్నమైన సెల్పీ ఫోటోలను పంపి తన స్నేహితులను ఆశ్చర్యపరచాలని భావించింది. అందుకోసం ఏకంగా ఓ బావిగట్టు మీదకి ఎక్కి పలు రకాల సెల్ఫీ పోజులు ఇస్తూ ఫోటోలు దిగింది. అలా ఫోటోలు తీసుకుంటున్న సమయంలో అదుపు తప్పి ఆ యువతి ఒక్కసారిగా బావిలోకి జారీ పడిపోయింది. ఆ యువతి అరుపులతో సమీపంలోని ఓ యువకుడు ఆమెను పైకి తీసుకురావడానికి బావిలోకి దిగాడు. కానీ, వారిద్దరికీ బావి నుంచి పైకి రావటం ఎలాగో తెలియలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళ్లతో వారిద్దరినీ సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘సెల్ఫీ కోసం ఏంటి ఆ పని’, సెల్ఫీ ఫోటో కోసం నువ్వు చేసిన సాహసం నీ స్నేహితులకు తెలిస్తే నవ్వుతారు’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. చదవండి: అమ్మాయిల వాట్సాప్ గ్రూపు.. అతడేం చేశాడంటే.. -
మరో సారి వార్తల్లోకి 'సెల్ఫీ' గర్ల్!
న్యూయార్క్:అమెరికా సెక్సీ మోడల్ కిమ్ కర్దాషియాన్ పేరు విననివారుండరంటే నమ్మండి. తన అందచందాలతో యాత్ ని ఒక ఊపు ఊపారు. కర్దాషియాన్ తన మనసులోని మాటలను కొన్నింటిని తరుచు బయటపెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. అయితే మొన్నామధ్య 'సెల్పిష్' బుక్ తో వస్తున్నానని ప్రకటించిన కర్దాషియాన్.. ప్రస్తుతం ఆ పనిలోనే నిమగ్నమైందట. ఆ సెల్పీ బుక్ ను తప్పకుండా అభిమానుల ముందుకు తీసుకువస్తానని గారాలు పోతుంది ఈ 33 ఏళ్ల చిన్నది. అసలు తనకు ఈ ఐడియా ఎలా వచ్చిందో కూడా వ్యక్తికరీంచింది. ఒకానొక వాలైంటెన్స్ డే సందర్భంలో చూసిన 'సెక్సీ పొలారాయిడ్'ఫోటోలే తన మదిలో ఆలోచనలో రేకిత్తించాయని.. దాంతోనే ఆ పుస్తకాన్ని రాయడానికి శ్రీకారం చుట్టడానికి పూనుకొంటున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాది కానీ అభిమానుల చెంతకు చేరదు. ఈ 'సెల్ఫిష్' పుస్తకం ఏప్రిల్ 7 వ తేదీ నాటికి విడుదల చేస్తానని కిమ్ స్పష్టం చేసింది. 352 పేజీలు ఉన్న ఈ పుస్తకం ఖరీదు దాదాపు రూ.1,200.