breaking news
secretly filming
-
వాకింగ్ చేస్తున్నట్లు నటిస్తూ.. మహిళల ఫోటోలు తీసిన వృద్ధుడు
ఫ్లోరిడా: చూడ్డానికి పెద్ద మనిషి తరహాలో ఉన్నాడు. వయసు కూడా దాదాపు 70 ఏళ్లకు పైనే ఉంటుంది. కానీ బుద్ధి మాత్రం నికృష్టం. ఏం ఏరగని వాటిలా అటూ ఇటూ తిరుగుతూ.. రహస్యంగా బీచ్‌లో ఉన్న ఆడాళ్ల ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించాడు. ఇది గమనించిన ఓ యువతి ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కొని చూడగా.. తనతో పాటు మరికొందరు మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని డిలీట్ చేసి అతడి నిర్వాకం గురించి బీచ్‌లోని వారందరికి తెలిపింది. ఈ సంఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఓ మహిళ తన స్నేహితురాలితో కలిసి బీచ్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఓ వృద్ధుడు మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్లు నటిస్తూ.. రహస్యంగా వారి ఫోటోలు తీయడం ప్రారంభిస్తాడు. అతడి ప్రవర్తన మీద అనుమానం వచ్చిన మహిళ అతడి దగ్గరకు వెళ్లి ఫోన్ లాక్కుని చూడగా మొబైల్లో తనతో పాటు మరికొంందరి మహిళల అసభ్య ఫోటోలు ఉన్నాయి. వాటిని చూడగానే సదరు మహిళకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే వాటిని డిలీట్ చేయమని ఆదేశించిది. ఆ తర్వాత ఫోన్ గ్యాలరీ ఒపెన్ చేసి చూడగా మరి కొందరు మహిళల అసభ్య ఫోటోలు దర్శనం ఇచ్చాయ. దాంతో ఆ మహిళ అతడి ఘనకార్యం గురించి అందరికి వెల్లడించి.. వాటిని డిలీట్ చేయించింది. చదవండి: బూతులు తిడుతూ, రెస్టారెంట్ సిబ్బందిని చితక్కొట్టిన మహిళలు -
రహస్యంగా వీడియో తీసి...
లండన్: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ పాడు పనులకు పాల్పడి బ్రిటన్ లో జైలు పాలయ్యాడు. రహస్యంగా టీనేజర్లను అభ్యంతకరంగా చిత్రీకరించి తీసి జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. నిందితుడు జొనాథన్ థామ్సన్-గ్లొవర్(53)కు కోర్టు సుమారు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. బ్రిస్టల్ లోని క్లిఫ్టన్ కాలేజీలో 16 ఏళ్లపైగా పనిచేసిన థామ్సన్ 12 నుంచి 17 ఏళ్ల వయసున్న 120 టీనేజర్లను రహస్యంగా వీడియో తీశాడు. స్నానాలు, పడక గదుల్లో వారి కదలికలను చిత్రీకరించాడు. సెలవుల్లో పాఠశాల గోడల్లో కెమెరాలు అమర్చి వాటిని తన గదిలోని వీడియో రికార్లకు కనెక్ట్ చేశాడు. అతడి వద్ద 2500 గంటల ఫుటేజీ దొరికింది. జర్మనీకి చెందిన థామ్సన్ ను యూకే నేషనల్ క్రైమ్ ఏజెన్సీ గతేడాది అరెస్ట్ చేసింది. టీనేజర్లకు చెందిన అభ్యంతకర చిత్రాలను డౌన్ చేస్తున్నారన్న నేరంపై అతడిని అదుపులోకి తీసుకోగా రహస్య చిత్రీకరణ విషయం బయటపడింది. దోషిగా తేల్చిన టాండన్ క్రౌన్ కోర్టు.. అతడికి మూడు ఏళ్ల 9 నెలల జైలు శిక్ష విధించింది.