breaking news
seaze
-
ఓల్వో బస్సు సీజ్
పెనుకొండ : హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఆదిత్య ఓల్వో బస్సును పెనుకొండ ఎంవీఐ మల్లికార్జున గురువారం తెల్లవారుజామున సీజ్ చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని ప్రయాణికులతో బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు ఆంధ్రా ట్యాక్స్ లేదని సమాచారం మేరకు చెక్‌పోస్ట్ సమీపంలో వాహనాన్ని ఆపి రికార్డులు పరిశీలించారు. ట్యాక్స్ కట్టని విషయం నిర్ధరణ కావడంతో సీజ్ చేశారు. -
రేషన్ దుకాణం సీజ్
ఎర్రగుంట్ల: దుకాణంలో సరుకులు ఉన్నా ఇవ్వకపోవడంతో తహశీల్దార్ మహేశ్వర్‌రెడ్డి ఆ దుకాణాన్ని తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సంఘటన గురువారం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో జరిగింది. వివరాలు.. మున్సిపాలిటీలోని ఆరో నంబర్ రేషన్ దుకాణంలో నిత్యం సరుకుల కొరత ఉందని, ప్రజలకు అరకొరగా సరుకులు ఇస్తున్నారు. అంతేకాకుండా బియ్యం తూకాల్లో తేడా రావడం, కిరోసిన్ ఉన్నా లేదని చెబుతుండటంతో ప్రజలు తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ దుకాణాన్ని తనిఖీ చేసి జరుగుతున్న అక్రమాలను గుర్తించి సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.