సీఎం సారూ.. ఫీజులు తగ్గించండి..!
స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ వినూత్న ప్రచారం
సాక్షి, హైదరాబాద్: స్కూళ్లు పునఃప్రారంభ మవుతున్నాయంటేనే భయం... ఫీజుల లూటీకి ద్వారాలు తెరుచుకొంటున్నాయని. ఎల్కేజీ... యూకేజీ... తరగతి ఏదైనా బాదుడు లక్షల్లోనే! అడ్డూ... అదుపూ లేని ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాకు విద్యార్థుల తల్లిదండ్రులు హడలెత్తిపోతున్నారు. ప్రైవేటు యాజమాన్యాల ఇష్టారాజ్యానికి కళ్లెం వేసి... ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలని చాలాకాలంగా హైదరా బాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఆందోళనలు చేస్తూనే ఉంది. కానీ... ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోవడంతో శనివారం వినూత్నంగా తమ గోడు వెళ్లబోసుకుంది. ‘ముఖ్యమంత్రి సార్... దయచేసి స్కూలు ఫీజులు నియంత్రించండి.
ఫీజుల లూటీ ఆపండి’ అన్న నినాదాల స్టిక్కర్లను పంజగుట్ట క్రాస్‌రోడ్స్‌లో వచ్చిపోయే వాహనాలకు అంటిం చి సంఘం సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రైవేటు పాఠశాలల ఫీ‘జులుం’పై నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు యాజమాన్యాల ఫీజుల దందా అరికట్టేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించేలా చేయా లన్నది తమ లక్ష్యమని కార్యక్రమ నిర్వాహకులు పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆటో డ్రైవర్లు ఈ ఉద్యమానికి స్వచ్ఛందంగా మద్దతు తెలిపా రన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలను దోచుకుంటున్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై ముఖ్యమంత్రి మౌనం సరి కాదన్నారు. హెచ్ఎస్పీఏ కార్యవర్గ సభ్యురాలు అరవింద జాతా మాట్లాడుతూ... ప్రభుత్వం ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పాఠశాల ఫీజులపై నియమించిన తిరుపతిరావు కమిటీ తక్షణమే నివేదికను అందజేయాలని డిమాండ్ చేశారు.