ఎమ్మెల్సీపై కేసు నమోదు
గుంటూరు: బాపట్ల సూర్యలంక బీచ్‌లో పర్యాటక శాఖ రిసార్టు డిప్యూటీ మేనేజర్‌పై దాడి చేసిన కేసులో ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌పై కేసు నమోదైంది. ఆయన అనుచరులపై కూడా బాపట్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా అదనపు ఎస్పీ వై.టి.నాయుడు ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది.
బీచ్ రిసార్టు డిప్యూటీ మేనేజర్, సిబ్బందిని ఆయన విచారించారు. కాగా, ఇలాంటి వ్యవహారాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని సతీష్‌పై టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.