breaking news
Sarah packets
-
సగం సీజ్.. సగం సేల్
ఫుల్లు.. బిజినెస్ తప్పును కప్పిపుచ్చుకొనే యత్నాల్లో ఎక్సైజ్ అధికారులు? కొడకండ్ల : సీజ్ చేసిన గుడుంబాను నాటుసారా విక్రయదారులకు విక్రరుుస్తూ సొమ్ము చేసుకుం టున్న కొడకండ్ల ఎక్సైజ్ సిబ్బంది తీరుపై సర్వ త్రా విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా రుు. దాడుల్లో పట్టుకుని లెక్కల్లో చూపని నాటు సారా ప్యాకెట్లను స్థానిక ఎక్సైజ్ కానిస్టేబుల్ నరేష్ లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన జి.సత్తయ్యకు విక్రయించడం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ స్టేషన్లో సీఐ, ఎస్సై, జూనియర్ అసిస్టెంట్, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఏడుగురు పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. స్టేషన్ అధికారి స్థానికంగా ఉండకుండా అడపదడపా వచ్చిపోతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇద్దరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ గలీజు దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొడకం డ్ల, పాలకుర్తి మండలాల పరిధిలోని గ్రామాలు, గిరిజన తండాల్లో దాడుల సందర్భంగా స్వాధీ నం చేసుకున్న నాటుసారాను రికార్డుల్లో సగమే చూపిస్తూ మిగతా గుడుంబాను తమకు నమ్మకమైన వ్యక్తులకు విక్రరుుస్తున్నారని సదరు సిబ్బందిపై విమర్శలున్నారుు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ యంత్రాంగం గుడుంబాపై యుద్ధం ప్రకటిస్తే ఈ సర్కిల్లో మాత్రం అధికారులు తూతూమంత్రంగా దాడు లు నిర్వహించారనే ఆరోపణలు ఉన్నారుు. కొందరు టోల్‌ఫ్రీ నంబర్‌కు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి భారీ నిల్వలను పట్టుకుని కేసు నమోదు చేసిన ఘటనలు జరిగారుు. స్థానిక వైన్స్‌లో కూడా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రరుుస్తూ దోచుకుంటున్నారని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారి పట్టించుకోలేదు. దీంతో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి నిర్వహించి వైన్స్‌పై కేసు నమోదు చేశారు. తప్పును కప్పిపుచ్చుకునే యత్నం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది కలిపి నడిపిస్తున్న దందాను కప్పిపుచ్చుకునేందుకు స్థానిక అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కొడకండ్ల ఎక్సైజ్ స్టేషన్‌ను ప్రభుత్వ సారారుు దుకాణంగా మార్చిన వ్యవహారంపై జిల్లా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి విచారణ ప్రారంభించకపోవడంతో జరిగిన తప్పును తారుమారు చేసే ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. ఈ దందాపై లోతుగా విచారణ చేపడితే తమ మెడకు ఎక్కడ ఉచ్చు బిగుస్తుందోనన్న భయంతోనే వారు పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఏమైనప్పటికీ ఈ దందాపై సమగ్ర విచారణ చేపట్టాలని పలువురు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. -
సారా ఏరులు
మూడు పీపాలు, ఆరు క్యాన్లుగా వెలిగిపోతున్న తయారీదారులు కిరాణా దుకాణాలకు సరఫరా గుట్టుగా అమ్మకాలు విశాఖపట్నం: బెల్టు దుకాణాలపై ఎక్సయిజ్ శాఖ దాడులు పెరగడంతో మందుబాబులు సారా బాట పడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సారా ప్యాకెట్లను ద్విచక్రవాహనాల్లో తరలిస్తూ విక్రయిస్తున్నారు. కిరాణా దుకాణాలకు సరుకులను సరఫరా చేసినట్టు బ్యాగుల్లో సారా ప్యాకెట్లను నింపి బైకుల పై సంచరిస్తూ విక్రయిస్తున్నారు. చౌకగా లభించడం, తక్కువ మోతాదుకే ఎక్కువ కిక్ ఇస్తుండటంతో పల్లెల్లో దొరికే సారాకు మద్యం ప్రియులు ఎగబడుతున్నా రు. జిల్లాలో ఇప్పటికే 97 మద్యం దుకాణాలకు వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో ఆ వ్యాపారాన్ని సారా ముఠా చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఎక్సయిజ్ శాఖ కళ్లుగప్పి సారా వ్యాపారాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించేందుకు చక్రం తిప్పుతోంది. పెరుగుతున్న సారా కేసులు : జిల్లాలో కొంతకాలంగా సారా కేసులు పెరుగుతున్నాయి. జూలైలో భారీగా కేసులు నమోదు కావడం ఎక్సయిజ్ శాఖకు తలనొప్పిగా పరిణమించింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 720 మందిపై సారా కేసులు పెడితే, జూలై ఒకటి నుంచి 23 మధ్య 424 కేసులు నమోదయ్యాయంటే సారా విక్రేతల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతోందో ఊహించుకోవచ్చు. న ర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, పాడేరు, అరుకు, చింతపల్లి, అనకాపల్లిలోని కొన్ని ప్రాంతాల్లో సారా విక్రేతలు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. పాడేరు, చింతపల్లి, సీలేరు ప్రాంతాల్లో సారాను కాచి ప్యాకెట్లలోకి నింపుకుని చెక్‌పోస్టులు లేని మార్గాల్లో కావిళ్లతో గ్రామాల్లోకి రవాణా చేస్తున్నారు. అక్కడి నుంచి చిన్నచిన్న ప్యాకెట్లలోకి సారా పోసి వాటిని కిరాణా వర్తక వ్యాపార సంచుల్లో కుక్కి ఎవరికీ అనుమానం రాకుండా పైపైన చిరుతిళ్లను పెట్టి పల్లెల్లోకి సరఫరా చేస్తున్నారు. పట్టించుకోని యంత్రాంగం పల్లెల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు సాగుతున్నా అధికార యంత్రాంగం మౌనవ్రతం చేస్తోంది. గాజువాక పారిశ్రామిక వాడల్లోనూ ఈ వ్యాపారం ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటోంది. రాత్రి విధులు ముగించుకుని ఉదయాన్నే ఇంటిబాట పట్టేవారికి, ఇంటి నుంచి రాత్రి విధులకు వెళ్లేవారికి మార్గమధ్యంలోనే ఈ దుకాణాలు ఆహ్వానాలు పలుకుతున్నాయని మందుబాబులు చెప్పుకుంటున్నారు. 252 మందికి రిమాండ్ బెల్ట్ దుకాణాలు నిర్వహించే గ్రామీణులు కొందరు సారా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బెల్ట్ దుకాణాలు నిర్వహిస్తే అరెస్టు చేసి 15 రోజుల రిమాండ్‌కు తరలిస్తుండటంతో వారంతా ఈ వ్యాపారంలోకి వెళ్లినట్టు తెలిసింది. రెండు మాసాల్లో జిల్లాలోని 246 బెల్ట్ దుకాణాలపై కేసులు నమోదు చేసి 252 మందిని రిమాండ్‌కు తరలించారు.