sanitation work impartent
-
ఆదాయం వెయ్యి కోట్లు.. కాగితం కొనేందుకు డబ్బుల్లేవు!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రైతులు పండించిన పంటల క్రయ విక్రయాలలో విశేష సేవలు అందజేస్తూ.. ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ఆదాయం సముపార్జించి పెడుతున్న మార్కెట్ కమిటీల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. నిధులు లేక పోవడం మార్కెట్ కమిటీలకు కనీసం తెల్లకాగితం కొనేందుకు కూడా డబ్బులు ఉండడం లేదు. రాష్ట్రంలో మొత్తం 206 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 180 కమిటీలకు పాలకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని మార్కెట్ల నుంచి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఇంత భారీగా ఆదాయం వస్తున్నా.. మార్కెట్ యార్డులను ప్రతిరోజూ శుభ్రం చేసే వర్కర్లకు గత 5 నెలలుగా వేతనాలు అందడం లేదు. ఈ క్లీనింగ్ కార్మికులకు నెలలో 26 రోజులకు గాను రోజుకు రూ.503 చొప్పున వేతనం చెల్లించాల్సి ఉంది. అయితే వీరికి మార్కెట్ కమిటీల నుంచి ఇచ్చిన చెక్కులు పాస్ కావడం లేదు. హైదరాబాద్ లాంటి చోట్ల మార్కెట్లలో పారిశుధ్య పనులను ఏజెన్సీల ద్వారా చేయిస్తున్నారు. ఈ ఏజెన్సీలకు సైతం చెల్లింపులు చేయడం లేదు. కొన్ని చెక్‌పోస్టుల్లో నిలిచిన ఫీజు వసూలు మార్కెట్ కమిటీల విద్యుత్, ఇంటర్నెట్, వాటర్ ప్లాంట్ల నిర్వహణ, ఫోన్ బిల్లులు, సీసీ కెమెరాల నిర్వహణ, ఈ–నామ్ సాఫ్ట్వేర్ యాంటీ వైరస్ బి ల్లులతో పాటు తెల్ల కాగితాలు, ప్రింటింగ్, జిరాక్స్, లైట్లు, బ్లీచింగ్ తదితరాలకు సంబంధించిన నిర్వహ ణ బిల్లులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ల జీతాలు, వాహనం అలవె న్సు బిల్లులు సైతం ఇవ్వడం లేదు. వీటన్నింటికీ గత ఐదు నెలలకు సంబంధించి రూ.250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం తనకే మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పలు మార్కెట్ కమిటీలకు సంబంధించి చెక్‌పోస్టుల విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. దీంతో ఆయా చోట్ల ఇంటర్నెట్ సిస్టమ్ నడవడం లేదు. దీంతో మార్కె ట్ ఫీజులు వసూలు చేయలేని దుస్థితి నెలకొంది. వైఎస్ హయాంలో కమిటీల ఖాతాల్లోనే డబ్బులువైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మార్కెట్ కమిటీల ఆదాయం వాటి ఖాతాల్లోనే ఉండేది. ఇప్పుడు మాత్రం నేరుగా ట్రెజరీ ఖాతా లోకి వెళుతుండటంతో కమిటీలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతంలో ఎల్వోసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా మార్కెట్ కమిటీలకు బిల్లులు వచ్చేవి. ఇప్పుడు ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) ద్వారా లింక్ చేయడంతో మార్కెట్ కమిటీల నిర్వహణ నిధులకు సంబంధించి ప్రతి చిన్న బిల్లుకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంటోంది. ఈ అనుమతులు రాకపోవడంతో మార్కెట్ కమిటీల నిర్వహణలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ కమిటీల చైర్మన్లు, కార్యదర్శులే తమ సొంత డబ్బులు ఖర్చు పెడుతూ నెట్టుకొస్తున్నట్టు తెలుస్తోంది. -
పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించం
కలెక్టర్ అరుణ్‌కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం కాకినాడ సిటీ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నా పారిశుద్ధ్య పనుల అమలులో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడాడుతూ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ కోసం జిల్లాలో 25 మంది జిల్లాస్థాయి అధికారులు నియమించామన్నారు. వారు జిల్లాలో ప్రతి శనివారం పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, మరీ ముఖ్యంగా నాల్గవ శనివారం ప్రత్యేక కార్యక్రమాలు ఉండాలన్నారు. ఇప్పటికే మలవిసర్జన లేని గ్రామాలుగా ప్రకటించిన గ్రామాల్లో తదనుగుణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతంచేసి, జిల్లాలో షెడ్యూల్డ్ కులాల సబ్‌ప్లా¯ŒS ప్రకారం నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ఏజెన్సీ ప్రాంతాలలో రహదారులు నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ మేరకు అటవీ, ఐటీడీఏ అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. 4 నుంచి డివిజ¯ŒS స్థాయి సమీక్షలు వివిధ పనుల ప్రగతిని సమీక్షించేందుకు డివిజ¯ŒS స్థాయి సమావేశాలను ఈనెల 4వ తేదీ నుంచి ఆయా డివిజన్లలో నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డివిజ¯ŒSలోని మండల అధికారులు మండల ప్రగతిని తెలియజేస్తూ వివరించే విధంగా సిద్ధపడి రావాలని కలెక్టర్ సూచించారు. గృహ నిర్మాణ పక్షోత్సవాలు జిల్లాలో ఎ¯ŒSటీఆర్ రూరల్ హౌసింగ్, గ్రామీణ పథకాల అమలుకు 1 నుంచి 15 రోజుల పాటు గృహ నిర్మాణ పక్షోత్సవాన్ని నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. దీనిలో భాగంగా జిల్లాకు మంజూరైన గృహ నిర్మాణాలను ప్రా రంభించడం, లబ్ధిదారులకు మంజూ రు పత్రాలు అందించాలని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ఈ–ఆఫీస్ రాష్ట్రంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఈ–ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టిలని ప్రభుత్వం నిర్ణయించిందని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఈ సమావేశంలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని మండల, డివిజ¯ŒS స్థాయి అధికారులు సంబంధిత ఫైల్స్‌ను స్కా¯ŒS చేయించడంతో పాటు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జేసీ–2 రాధాకృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఎస్ఈ వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఎస్ఈ మూర్తి, ట్రా¯Œ్సకో ఎస్ఈ ప్రసాద్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాజేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కె.పద్మ పాల్గొన్నారు.


