breaking news
Sams Ahmad
-
IPL 2022: ఒత్తిడిలో గుజరాత్ చిత్తు!
ముంబై: గుజరాత్ 178 పరుగుల లక్ష్యఛేదనలో ఓపెనర్లే 12 ఓవర్లలో 106 పరుగులు చేశారు. ఇక మిగిలిన 8 ఓవర్లలో 72 పరుగులు 10 వికెట్లున్న జట్టుకు కష్టమే కాదు. కానీ ముంబై బౌలర్ల కష్టం, చక్కని ఫీల్డింగ్, ఆఖరి బంతి దాకా చూపిన పోరాటం టైటాన్స్‌కు ఊహించని షాకిచ్చాయి. 6 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన దశలో ఆఖరి ఓవర్ వేసిన సామ్స్ వికెట్ తీయడమే కాకుండా కేవలం 3 పరుగులే ఇచ్చి ముంబైని గెలిపించాడు. శుక్రవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై 5 పరుగులతో గెలిచింది. మొదట ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45; 5 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రోహిత్ శర్మ (28 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, చివర్లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టిమ్ డేవిడ్ (21 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విరుచుకుపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (40 బంతుల్లో 55; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (36 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. రాణించిన రోహిత్, కిషన్ రోహిత్ రెండో ఓవర్లో 2 ఫోర్లు, భారీ సిక్సర్‌తో వేగం పెంచాడు. రషీద్ ఖాన్ తొలి ఓవర్లో ఇషాన్ కిషన్ రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చాడు. పవర్ ప్లేలో ముంబై 63/0 స్కోరు చేసింది. రోహిత్‌ను రషీద్ ఎల్బీగా పంపగా స్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ (13), ఇషాన్ కిషన్, పొలార్డ్ (4) వికెట్లను కోల్పోయింది. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగానే బ్యాట్‌కు పనిచెప్పాడు. షమీ వేసిన 16వ ఓవర్లో 2 ఫోర్లు కొట్టిన డేవిడ్, జోసెఫ్ 18వ ఓవర్లో బౌలర్ తలపైనుంచి సిక్సర్ బాదాడు. ఓపెనర్లే వంద వరకు... ఓపెనర్లు సాహా, గిల్ ఆరంభం నుంచే వేగంగా పరుగులు సాధిస్తుండటంతో ముంబై బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ప్రధాన సీమర్ బుమ్రా బౌలింగ్‌ను సాహా చితగ్గొట్టాడు. గిల్ కూడా పోటాపోటీగా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో ఓపెనింగ్ జోడీ 54 పరుగులు చేసింది. సామ్స్ వేసిన 8వ ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లు కొట్టిన గిల్, కార్తికేయ ఓవర్లో 6, 4 బాదాడు. సాహా (34 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్ (33 బంతుల్లో; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒకరి వెంట ఒకరు ఫిఫ్టీలు పూర్తి చేసుకొన్నారు. జట్టు స్కోరు వంద దాటాకా మురుగన్ అశ్విన్ ఒకే ఓవర్లో గిల్, సాహాలను పెవిలియన్ పంపాడు. దీంతో 106 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) రషీద్ (బి) జోసెఫ్ 45; రోహిత్ (ఎల్బీ) (బి) రషీద్‌ఖాన్ 43; సూర్యకుమార్ (సి) రషీద్ (బి) సంగ్వాన్ 13; తిలక్ రనౌట్ 21; పొలార్డ్ (బి) రషీద్ 4; డేవిడ్ నాటౌట్ 44; సామ్స్ (సి) రషీద్ (బి) ఫెర్గూసన్ 0; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–74, 2–99, 3–111, 4–119, 5–157, 6–164. బౌలింగ్: షమీ 4–0–42–0, జోసెఫ్ 4–0–41–1, రషీద్ 4–0–24–2, ఫెర్గూసన్ 4–0–34–1, సంగ్వాన్ 3–0–23–1, తెవాటియా 1–0–11–0. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాహా (సి) సామ్స్ (బి) మురుగన్ 55; గిల్ (సి) పొలార్డ్ (బి) మురుగన్ 52; హార్దిక్ రనౌట్ 24; సుదర్శన్ హిట్‌వికెట్ (బి) పొలార్డ్ 14; మిల్లర్ నాటౌట్ 19; తెవాటియా రనౌట్ 3; రషీద్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–106, 2–111, 3–138, 4–156, 5–171 బౌలింగ్: సామ్స్ 3–0–18–0, బుమ్రా 4–0–48–0, మురుగన్ అశ్విన్ 4–0–29–2, మెరిడిత్ 4–0–32–0, కార్తికేయ 3–0–29–0, పొలార్డ్ 2–0–13–1. ఐపీఎల్లో నేడు పంజాబ్ X రాజస్తాన్ వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి లక్నో X కోల్‌కతా వేదిక: పుణే, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
జీప్ థ్రిల్స్
రోడ్డెక్కితే చిరుతలాంటి వేగం.. రూపంలో ఉట్టిపడే వైవిధ్యం, దర్పం.. రోడ్డున్నా.. లేకున్నా బేఫికర్. కొండలు.. గుట్టలు.. మట్టినేల.. బురద ఏదైనా బలాదూర్. స్టార్ట్ చేస్తే చాలు ఎక్కడైనా రయ్యిన దూసుకుపోవడమే నైజం. ఒక్కసారి ఎక్కితే చాలు హుషారెక్కిపోవాల్సిందే. దానిపై జర్నీ ఎంతో ఫన్నీ.. ఏదేమైనా జీప్ లుక్కే వేరు. అదంటే ఇష్టపడే, పిచ్చి ప్రేమగల వారంతా కలసి ‘జీప్ థ్రిల్స్ హైదరాబాద్ 4గీ4 క్లబ్’ ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగర రహదారులపై రోజుకో అధునాతన మోడల్ కారు పరుగులు తీస్తున్నా.. ఇక్కడి రోడ్స్‌కి, ఆఫ్రోడ్స్కి బెస్ట్ ఫ్రెండ్ జీపే అంటారు. భారత్‌లో మొదటి ఆఫ్‌రోడ్ గ్రూప్ జీప్ థ్రిల్స్ హైదరాబాద్ 4గీ4 క్లబ్. శాంస్ అహమద్, షాఫత్ అలీ 2005లో దీన్ని ప్రారం భించారు. 2008లో రిజిస్టర్ అయిన ఈ క్లబ్ ఇప్పటి వరకు అంతర్జాతీయ మోటారు కంపెనీలతో కలసి పది కంటే ఎక్కువ మెగా ఈవెంట్లు ఆర్గనైజ్ చేసింది. 250కి పైగా ఆఫ్ ద రోడ్ (ఓటీఆర్) ట్రిప్స్ హైదరాబాద్ చుట్టు పక్కల నిర్వహించింది. ప్రతి రెండు వారాలకోసారి 10-15 వెహికల్స్‌తో చిన్న ట్రిప్పులు నిర్వహిస్తుంటారు. ఆఫ్‌రోడింగ్ అంటే ఆసక్తి గలవారిని ఎంకరేజ్ చేయటం, 44 జీప్ వెహికల్స్‌ని మెయింటైన్ చేయటంతో పాటు మాడిఫై చేయటానికి సంబంధించిన సందేహాలూ తీరుస్తుంటారు. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇందులో 1942 నాటి నుంచి నేటి వరకు జీప్ మోడల్స్ ఈ క్లబ్లో ఉన్నాయి. నేచర్ లవర్స్.. జీప్ అంటే ఇష్టం, ఆసక్తితో ఈ క్లబ్లో చేరే వారికి ఇక్కడి యాక్టివిటీస్ ఉచితం. ఈ క్లబ్లో అందరూ నేచర్ లవర్స్ ఉంటారు. ‘అందుకే జీప్ రైడ్‌తోపాటు క్యాంపింగ్, హైకింగ్, ఫొటోగ్రఫీ, ఫిషింగ్, బార్బెక్యూ లాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేస్తాం. వీటిలో సోషల్ యాక్టివిటీస్ కూడా చేరుస్తుంటాం’ అని క్లబ్ ఫౌండర్ శాంస్ అహమద్ అంటారు. హిమాయత్‌సాగర్ వీరికి చాలా ఇష్టమైన ప్లేస్. ఆఫ్‌రోడింగ్‌కి, బార్బెక్యూ ఫుడ్ తినడానికి బెస్ట్ లేక్‌వ్యూ చక్కటి స్పాట్. ఆఫ్ రోడింగ్... మన దేశంలో రహదారులున్న ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో, అంతకంటే ఎక్కువగా రోడ్లు లేనివీ ఉన్నాయి. అలా రహదారి లేని ప్రాంతాలను ఆఫ్‌రోడ్ అంటారు. గుర్తింపే ధ్యేయం నిజాం కాలం నుంచి మా ఇంట్లో జీప్ వాడకం ఉంది. మన దేశంలో ఎన్నో అవసరాలకు, ఎన్నో ప్రాంతాలకు జీపు మాదిరిగా మరే మోటారు వాహనం ఉపయోగపడలేదు. అందుకే జీప్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తెచ్చి, జీప్ అంటే ఇష్టం ఉన్న వారందరినీ ఒక చోటికి తీసుకురావాలని క్లబ్ స్టార్ట్ చేశాం. జీప్ క్రీడలకు గుర్తింపు తీసుకురావాలనేది కూడా ఈ క్లబ్ ఉద్దేశం. 18 నుంచి 80 ఏళ్ల వయసు వారు ఈ క్లబ్లో మెంబర్స్‌గా ఉన్నారు. - శాంస్ అహమద్, క్లబ్ ఫౌండర్ ఎకో ఫ్రెండ్లీ మొక్కల పెంపకం, వన్యప్రాణి రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎక్కడికి వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించకుండా, రోడ్లపై చెత్తా చెదారం వేయకుండా జాగ్రత్తలు పాటిస్తాం. సిటీలో ఉన్నా, టూర్లో అయినా చెత్త బుట్టలోనే చెత్త వెయ్యటం మా నియమం. - శ్యామల్ జేత్వా, క్లబ్ జాయింట్ సెక్రటరీ