breaking news
samrakshan
-
రైల్వే కొత్త యాప్.. ఎవరి కోసమంటే..?
ఇండియన్ రైల్వే ఫ్రంట్‌లైన్ భద్రతా సిబ్బంది కోసం భద్రతా శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే మొబైల్ అప్లికేషన్ 'సంరక్ష'ను ప్రారంభించింది. లక్షలాది మంది రైల్వే ఫ్రంట్‌లైన్ సిబ్బందికి క్లిష్టమైన కార్యాచరణ శిక్షణను అందించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే తెలిపింది.ఈ 'సంరక్ష' యాప్‌ను సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నాగపూర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ రూపొందించారు. రైల్వే ఉద్యోగుల శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించే సమర్థవంతమైన వ్యవస్థను అందించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, ఏఐ భవిష్యత్తులో సాధ్యాలతో, రైల్వే డొమైన్ పరిజ్ఞానంతో ఈ యాప్ అనుసంధానమై ఉంటుందని డీఆర్ఎం నమితా త్రిపాఠి పేర్కొన్నారు.రైల్వే రూపొందించిన ఈ యాప్ స్మార్ట్ లెర్నింగ్, ఫీడ్‌బ్యాక్ మెకానిజమ్‌లను కలిగి ఉంటుంది. ఇది మల్టీ లెవల్, రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్, పర్యవేక్షణను సాధ్యం చేస్తుంది. -
ప్రాధాన్యతా పనులకు ముందస్తు ప్రణాళిక
కలెక్టర్ అరుణ్‌కుమార్ కాకినాడ సిటీ : ఉపాధి హామీ, నీరు–చెట్టు పథకాల ద్వారా వచ్చే ఏడాది జల సంరక్షణ మిషన్ కింద జిల్లాలో చేపట్టే ప్రాధాన్యతా పనులకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్ అరుణ్‌కుమార్ జిల్లా అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించి శాఖలవారీగా అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిపై సమీక్షించారు. పథకం కింద పనులను గుర్తించి ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డిసెంబర్ ఒకటి నుంచి నగదు రహిత విధానంలో రేషన్ సరుకుల పంపిణీకి రంగం సిద్ధం చేసి డీలర్లు, ప్రజలలో సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం కింద రోడ్లు, హార్టికల్చర్, ఇరిగేషన్ తదితర అంశాల వారీగా నిర్వహించిన పనులు, నిధుల వినియోగంపై విశ్లేషణ చేసి నివేదిక సమర్పించాలని డ్వామా పీడీకి సూచించారు. జిల్లాలో చేపట్టిన సీసీ రోడ్లు, అంగన్వాడీ భవనాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు డిసెంబర్ మాసాంతానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు పనితీరుపై నిర్దేశించిన కీ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్ల సాధన నివేదికలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదుచేసి, గ్రేడింగ్‌లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని స్పష్టం చేశారు. జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.