breaking news
Samrajyam
-
ఆటోను ఢీకొన్న లారీ..ఇద్దరి మృతి
అమరావతి మండలం పెద్దమద్దూరు వద్ద లారీ ఆటోని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరుకుళ్లపాడు గ్రామానికి చెందిన కె.శిఖామణి(50), మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన గాదె సామ్రాజ్యం(60) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా..మరో నలుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులంతా అమరావతి నుంచి మంగళగిరికి ఆటోలో వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సామ్రాజ్యం కోసం...
ప్రతి మనిషి పుట్టుకకూ ఓ కారణం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి సాధించాలని ఆరాటపడుతుంటారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించడం కోసం హీరో ఏం చేశాడు? ఎవరితో తలపడ్డాడు. చివరికి విజయం సాధించాడా, లేదా? తెలుసుకోవాలంటే తమ చిత్రం చూడాల్సిందే అంటున్నారు నిర్మాత నైనాల సాయిరామ్. ఆర్య, కీర్తి జంటగా చరణ్ దర్శకత్వంలో తమిళంలో నిర్మించిన ఓ చిత్రాన్ని వీవీయస్ క్రియేషన్స్ పతాకంపై ‘సామ్రాజ్యం’ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ఆర్య తన కెరీర్లో చేసిన తొలి మాస్ సినిమా ఇది. తమిళంలో మంచి హిట్ అయింది. తెలుగు నేటివిటీకి పక్కాగా సరిపోయే కథ ఇది. పాటలు, ఫైట్స్, వినోదం హైలెట్గా ఉంటాయి. త్వరలోనే పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భరద్వాజ్, సహ నిర్మాత: రాజశ్రీ మణికంఠ, సమర్పణ: నైనాల సాంబమూర్తి, హైమావతి.