breaking news
samirsarma
-
మున్సి‘పోల్స్’ రిజర్వేషన్లు ఖరారు
కేటాయింపులు ఇలా... మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ.. అన్ రిజర్వుడు నూజివీడు.. జనరల్ మహిళ ఉయ్యూరు, నందిగామ.. బీసీ జనరల్ తిరువూరు.. ఎస్సీ మహిళ మచిలీపట్నం, న్యూస్‌లైన్ : జిల్లాలోని పురపాలక సంఘాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి సమీర్‌శర్మ జీవో నంబరు 94ను శనివారం విడుదల చేశారు. ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ల జాబితాకు గవర్నర్ ఆమోదం తెలపటంతో పురపాలక సంఘాల్లో చైర్మన్ పదవికి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో ఐదు పురపాలక సంఘాలు, మూడు నగర పంచాయతీలు ఉన్నాయి. మచిలీపట్నం, పెడన, జగ్గయ్యపేట, గుడివాడ పురపాలక సంఘాలను అన్ రిజర్వుడు చేశారు. నూజివీడు పురపాలక సంఘాన్ని జనరల్ మహిళకు కేటాయించారు. ఉయ్యూరు నగర పంచాయతీని బీసీ జనరల్‌కు, తిరువూరు నగర పంచాయతీని ఎస్సీ మహిళకు, నందిగామ నగర పంచాయతీని బీసీ జనరల్‌కు కేటాయించారు. 2011 డిసెంబర్ 28న ఉయ్యూరు, తిరువూరు, నందిగామ మేజర్ పంచాయతీలను నగర పంచాయతీలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడుచోట్ల పాలకవర్గాలను మొట్టమొదటి సారిగా ప్రజలు ఎన్నుకోవాల్సి ఉంది. మూడున్నరేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే.. మచిలీపట్నం, నూజివీడు, గుడివాడ, పెడన, జగ్గయ్యపేట మునిసిపాలిటీలు మూడు సంవత్సరాల ఐదు నెలలు (41 నెలలు)గా ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. వాటి పదవీ కాలం 2010 సెప్టెంబరు 29 నాటికి ముగిసింది. అప్పటి నుంచి పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఉరుకులు పరుగులు... పురపాలక సంఘాల్లో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని తీర్పు -
నైట్షెల్టర్లకు మంచిరోజులు
సాక్షి, సిటీబ్యూరో : నిర్వాసితులు రాత్రివేళల్లో తలదాచుకునేందుకు సదుపాయవంతమైన నైట్‌షెల్టర్లు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్లో మూడేళ్ల కిందటి నుంచే నైట్‌షెల్టర్ల ఏర్పాటు ప్రారంభమైనప్పటికీ, ఆశించిన ప్రయోజనం నెరవేరలేదు. జీహెచ్ఎంసీలోని నైట్‌షెల్టర్ల పనితీరును సమీక్షించిన ప్రభుత్వం.. లోటుపాట్లను గుర్తించింది. నైట్‌షెల్టర్లను నిజంగా ఆశ్రయకేంద్రాలుగా మార్చేం దుకు తగు సూచనలతో మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం ప్రారంభించిన ఎన్యూఎల్ఎం (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్) మార్గదర్శకాల మేరకు గూడు లేని పట్టణ ప్రజల కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. నైట్‌షెల్టర్ల నిర్మాణానికయ్యే వ్యయంలో 75 శాతం సొమ్మును కేంద్రప్రభుత్వం ఇవ్వనుంది. ఈ స్కీంను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఉత్తర్వుల్లో ముఖ్యాంశాలు.. నైట్‌షెల్టర్లలో నీరు, పారిశుధ్యం, భద్రత ఏర్పాట్లుండాలి రాత్రిపూట ఉండేందుకు స్థిరమైన, చాలినంత వసతి లేనివారితోపాటు వివిధ అవసరాల కోసం పట్ణణాలకు వచ్చి.. వసతి లేని వారు. వీధిబాలలు, అనాథలు, చిత్తు కాగితాలు ఏరుకునే పిల్లలు, తల్లిదండ్రుల్లేని బాలలు, హాస్పిటళ్లు, ైరె ల్వే స్టేషన్లు, బస్స్టేషన్ల సమీపంలో తలదాచుకునేవారు తదితరులు నైట్‌షెల్టర్లలో ఉండవచ్చు. ఒక్కో షెల్టర్‌లో 50- 100 మంది ఉండవచ్చు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా నైట్షెల్టర్లతోపాటు కుటుంబాల కోసం, ఒంటరి మహిళలు, వారి మీద ఆధారపడ్డ మైనర్పిల్లల కోసం, వృద్ధులు, అంగవికలురు, తదితరులకు సైతం వేర్వేరేగా షెల్టర్లు ఏర్పాటు చేయాలి. సర్వే చేసి నిరాశ్రయులను గుర్తించాలి. నైట్‌షెల్టర్లలో ఉండేవారికి గుర్తింపు కార్డులివ్వాలి. షెల్టర్లలో తాగడానికి, ఇతర అవసరాాలకు నీటితోపాటు చాలినన్ని టాయ్లెట్లు, బాత్రూంలు, ప్రథమచికిత్స కిట్లు, అవసరమైన వంటసామగ్రితోపాటు, పిల్లల రక్షణ ఏర్పాట్లు, ఎప్పటికప్పుడు దుప్పట్లను శుభ్రపరచడం.. ఇతరత్రా చర్యలు తీసుకోవాలి. మేనేజ్మెంట్ కమిటీలుండాలి. పిల్లలు సమీపంలోని పాఠశాలలకెళ్లే ఏర్పాట్లు. షెల్టర్లలోని వారి అర్హతలను బట్టి ఆయా ప్రభుత్వ పథకాలు, ఉపాధి పొందే ఏర్పాట్లు. నిర్వహణకు మేనేజర్, కేర్టేకర్లు తదితరులు.