breaking news
samia
-
జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలకు విష్ణువర్ధన్, సామియా
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత బాలబాలికల జట్లను ప్రకటించారు. 23 మంది సభ్యులతో కూడిన ఈ బృందంలో తెలంగాణకు చెందిన విష్ణువర్ధన్ గౌడ్, సామియా ఇమాద్ ఫారూఖీలకు స్థానం లభించింది. ఈ మెగా ఈవెంట్ జూలై 20 నుంచి 28 వరకు చైనాలోని సుజౌలో జరుగుతుంది. మేలో జరిగిన చెన్నై, త్రివేండ్రం ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిన బాలబాలికలను ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) జనరల్ సెక్రటరీ అజయ్ సింఘానియా తెలిపారు. బాలుర విభాగంలో 11 మందిని, బాలికల విభాగంలో 12 మందిని ఎంపిక చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎంపికైన జట్టు జూలై 3 నుంచి 17 వరకు హరియాణాలోని పంచకులలో నిర్వహించే శిక్షణ శిబిరంలో పాల్గొంటారు. భారత జట్టుకు జూనియర్ చీఫ్ కోచ్‌గా సంజయ్ మిశ్రా వ్యవహరించనున్నారు. మిగతా కోచ్‌లుగా హైదరాబాద్‌కు చెందిన చేతన్ ఆనంద్, అరుణ్ విష్ణు, సయాలి గోఖలే, సచిన్ రాణా, టి.మారన్ ఉన్నారు. -
సామియా, గాయత్రి శుభారంభం
ఆలిండియా జూ. ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ హైదరాబాద్: ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయిలు సామియా ఇమద్ ఫారూఖి, పుల్లెల గాయత్రి ముందంజ వేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన అండర్-17 బాలికల సింగిల్స్ తొలి రౌండ్లో సామియా 21-14, 21-12తో ఇషిత (చండీగఢ్)పై, గాయత్రి 21-17, 22-20తో అనన్య గోయెల్ (ఢిల్లీ)పై గెలుపొందారు. మిగతా మ్యాచ్‌ల్లో మేఘ (ఏపీ) 21-12, 24-22తో రియా ఖత్రి(ఢిల్లీ)పై, శీతల్ 21-16, 21-8తో నిషిత వర్మ (ఏపీ)పై, అక్షిత (ఏపీ) 21-23, 26-24, 21-14తో ఇషిత (తెలంగాణ)పై, సిమ్రాన్ (మహారాష్ట్ర) 21-10, 21-10తో గీతకృష్ణ (ఏపీ)పై, రితిక ఠక్కర్ (మహారాష్ట్ర) 21-10, 21-16తో సాయిశ్రీయాపై విజయం సాధించారు. అండర్-17 బాలుర సింగిల్స్ తొలి రౌండ్లో కార్తికేయ (ఎయిరిండియా) 21-13, 21-13తో తరుణ్ (ఏపీ) పై, తుకుమ్ (అరుణాచల్ ప్రదేశ్) 21-11, 21-17తో ఇమ్రాన్ షేక్ (ఏపీ)పై, ఉత్సవ్ సోయ్ (ఢిల్లీ) 21-10, 21-19తో చరిత్ (ఏపీ)పై, వేద వ్యాస్ (ఏపీ) 21-9, 21-12తో వంశీకృష్ణ (తెలంగాణ)పై, అంకిత్ కుమార్ (ఉత్తరప్రదేశ్) 21-10, 21-14తో సాయికిరణ్ (ఏపీ)పై, గౌరవ్ మిథే (మహారాష్ట్ర) 21-14, 21-16తో వరప్రసాద్ (ఏపీ)పై, అభ్యాన్ష్ సింగ్ (ఉత్తర ప్రదేశ్) 19-21, 21-11, 21-16తో శ్రీకర్ మదినపై, ప్రణయ్ 21-12, 21-7) (ఏపీ)తో జాషన్ సింగ్ (పంజాబ్)పై, కౌషిక్ (తమిళనాడు) 21-16, 21-12తో అనురాగ్ (ఏపీ)పై, జశ్వంత్ (ఏపీ) 21-14, 21-11తో భవేశ్ పాండే (ఉత్తరాఖండ్)పై గెలుపొందారు.