breaking news
Sambani Chandrasekhar
-
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు భారీ షాక్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జిల్లాకు చెందిన పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, పీసీపీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్.. తెలంగాణ ఉద్యమ విద్యార్థి నేత ప్రస్తుత పీసీసి ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి కృష్ణ, సీనియర్ రాజకీయ నేత అబ్బయ్య దంపతులు, డా. రామచంద్రు నాయక్, వారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చదవండి: సీబీఐ, ఈడీ విచారణకు కేసీఆర్ సిద్ధమా?.. రేవంత్ సవాల్ -
తెలంగాణపై కేంద్రం నిర్ణయమే శిలాశాసనం
గువ్వలగూడెం (నేలకొండపల్లి), న్యూస్‌లైన్: తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్ర కేబినెట్ నిర్ణయమే శిలాశాసనమని కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ర్ట మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. ఆయన మంగళవారం గువ్వలగూడెం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణ పక్రియపై అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని, కేవలం చర్చ జరిగితే చాలని అన్నారు. సీమాంధ్రులు ఆందోళనను విరమించి, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకోవాలని సూచించారు. అక్కడి (సీమాంధ్ర) ఉద్యోగులు సమ్మె విరమించి ప్యాకేజీ కోసం డిమాండ్ చేయాలన్నారు. భద్రాచలం కావాలని అడిగే హక్కు సీమాంధ్రకు లేదని అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఢిల్లీలో దీక్ష చేయటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమావేశంలో ఆత్మా ప్రాజెక్ట ఖమ్మం డివిజన్ డెరైక్టర్ శాఖమూరి సతీష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెనికె జానకిరామయ్య, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డెరైక్టర్ పెద్దపాక వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు ఆవుల అప్పిరెడ్డి, బొల్లికొండ వెంకటనారాయణ, చావా రామయ్య, దండా సుభాష్, తుళ్లూరి మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.