breaking news
salwar suit
-
Fashion: శ్రద్ధ శ్రీనాథ్ ధరించిన ఈ డ్రెస్ ధర 32 వేలకు పైనే! స్పెషాలిటీ?
పింక్ సల్వార్... ముత్యాల లోలాకులు.. గాజులతో మెరిసిపోతున్న ఈ హీరోయిన్ను గుర్తు పట్టే ఉంటారు. ‘మేమూ జెర్సీ సినిమా చూశాం లెండి’ అంటారా! అవునవును.. ఆ చిత్ర కథానాయికే ఈమె.. శ్రద్ధ శ్రీనాథ్. తెలుగుతోపాటు తన మాతృ భాష కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. వచ్చిన అవకాశాల్లో తాను మెచ్చిన పాత్రలకే ఓకే చెప్తుంది. వాసికే ఆమె ప్రాధాన్యం. సినిమాల్లోకి రాకముందు ఫ్యాషన్ గురించి పెద్దగా పట్టించుకునేది కాదుట. సినిమాల్లోకి వచ్చాకే ఫ్యాషన్ మీద శ్రద్ధ పెరిగింది అని చెప్పే శ్రద్ధ శ్రీనాథ్ ఫాలో అయ్యే బ్రాండ్స్ ఏంటో చూద్దాం... రా మ్యాంగో చేనేతకు ప్రాధాన్యమిచ్చే బ్రాండ్ ఇది. ఫ్యాషన్ ప్రపంచంలో దీని ప్రయాణం 2008లో మొదలైంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, వారణాసి మొదలైన ప్రాంతాల్లోని చేనేత కళతో అద్భుతాలు సృష్టిస్తోంది. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను డిజైన్చేయడం రా మ్యాంగో ప్రత్యేకత. ఆన్లైన్లో లభ్యం. బ్రాండ్ వాల్యూ డ్రెస్ బ్రాండ్: రా మ్యాంగో ధర: రూ. 32,800 BCOS ఇట్స్ సిల్వర్ బి అంటే బ్రాస్.. సీఓ అంటే కాపర్.. ఎస్ అంటే సిల్వర్... మొత్తంగా బికాజ్ ఇట్స్ సిల్వర్ బ్రాండ్. 2010లో.. ఇంట్లో మొదలై ఈ రోజు బెంగళూరులోని అతి పెద్ద జ్యూయెలరీ షో రూమ్ స్థాయికి ఎదిగిందీ బ్రాండ్. ఫ్లారెన్స్ ఎస్తర్, ప్రిసిల్లా పాల్, సిండ్రెల్లా రెంజి.. ఈ ముగ్గురు దీని వ్యవస్థాపకులు. ఆధునిక మహిళల అవసరాలు.. ఆలోచనలు.. అభిరుచులకు నాణ్యత, కళను మేళవించి రూపుదిద్దుకునేవే ఆఇౖ ఇట్స్ సిల్వర్ డిజైన్స్. ఆన్లైన్లో దొరుకుతాయి. ధరలూ అందుబాటులోనే ఉంటాయి. జ్యూయెలరీ బ్రాండ్: BCOS ఇట్స్ సిల్వర్ ధర: రూ. 14,430 అందం, ఆరోగ్యం రెండూ వేర్వేరు కాదు. ఆరోగ్యంగా ఉంటే మొహంలో కళ ఉట్టిపడుతుంది. అందుకే నా దృష్టిలో ఆరోగ్యమే అందం! – శ్రద్ధ శ్రీనాథ్ చదవండి: Fashion: వేడుకల వేళ.. కాటన్ కళ.. జరీ అంచుతో అనువుగానూ, అందంగానూ! -
అమ్మాయిలూ చీరలోనే రండి.. లేదంటే వద్దు
జైపూర్: రాజస్థాన్ సివిల్ సర్వీస్ పరీక్షలకు(ఆర్ఏఎస్) హాజరయ్యే అమ్మాయిలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అమ్మాయిలు కచ్చితంగ సల్వార్ సూట్ గానీ చీరగాని ధరించి రావాలని లేదంటే పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేస్తూ ప్రకటన జారీ చేసింది. అబ్బాయిలకు కూడా కొన్ని షరతులు విధించింది. హాఫ్ స్లీవ్స్ చొక్కాలు మాత్రమే ధరించాలని, చెప్పులు లేదా షాండిల్స్ను సాక్స్ లేకుండా ధరించి పరీక్షలకు రావాలని ఆదేశించింది. నిండుగా చొక్కాలు ధరించినవారిని, షూలు ధరించినవారిని పరీక్షలకు హాజరుకానివ్వబోమని స్పష్టం చేసింది. విభిన్న వస్త్రాలంకరణతో వచ్చి పరీక్షల్లో మోసం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్లే తాజాగా ఈ నిబంధన విధించాము తప్ప మరో ఉద్దేశం లేదని రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇచ్చింది.