సాక్షి ఇండియా స్పెల్‌బీ 2013కు విశేష స్పందన
ఆల్కాట్‌తోట (రాజమండ్రి),న్యూస్‌లైన్ : సాక్షి ఇండియా స్పెల్‌బీ-2013 రెండోరౌండ్ పరీక్షకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. మొదటిరౌండ్లో అర్హత సాధించిన ఉభయగోదావరి జిల్లాల విద్యార్థులకు స్థానిక కవలగొయ్యిరోడ్డులోని ది ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ ఆవరణలో ఆదివారం రెండోరౌండ్ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు కేటగిరి-4కు, మధ్యాహ్నం 12.30 నుంచి 1.00 వరకు కేటగిరి-1కు, 2.30 నుంచి 3.00 గంటల వరకు కేటగిరి-2కు, 4.30 నుంచి 5.00 గంటల కేటగిరి-3కి పరిక్ష నిర్వహించారు.
ఉభయగోదావరి జిల్లాల్లోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి టీవీ చానల్ ప్రత్యక్షప్రసారం ద్వారా ఈ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ఫ్యూచర్‌కిడ్స్ స్కూలు కరస్పాండెంట్ యేలేటి రవిబాబు, డెరైక్టర్ విజయకుమారి, ప్రిన్సిపాల్ రవీంద్రనాథ్, ఉపాధ్యాయబృందానికి సాక్షి రాజమండ్రి యూనిట్ మేనేజర్ ఎం.శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు.