breaking news
sakalajanula samme
-
ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఎసి
-
సకలజనుల సమరభేరి సభకు హైకోర్టు అనుమతి
-
‘సకలజనుల సమ్మె’ను సెలవుగా ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. సింగరేణి, ట్రాన్స్కోలతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు 42 రోజుల సమ్మెకాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం ఆర్టీసీకి ఎందుకు వర్తింపజేయలేదని ఆ సంఘం నేతలు బాబు, రాజిరెడ్డి ప్రశ్నిం చారు. ఆర్టీసీ కార్మికులకు కూడా ప్రత్యేక సెలవుగా ప్రకటించాలని శనివారం ఇక్కడ జరిగిన సంతకాల సేకరణ కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల ఐదో తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 30 వేల మంది సంతకాలు చేశారని, దీన్ని 25వ తేదీ వరకు పొడిగిస్తున్నామని వెల్లడించారు. డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెండి: ఎన్ఎంయూ డీజిల్‌ను జీఎస్టీ (12 శాతం పన్ను) పరిధిలోకి తేవటం వల్ల దాని ధర భారీగా తగ్గించి ప్రజలకు మేలు చేసే వెసులుబాటు కలుగుతుందని ఆర్టీసీ ఎన్ఎంయూ డిమాండ్ చేసింది. ముఖ్యంగా డీజిల్ ధర తగ్గి ఆర్టీసీకి సాలీనా రూ.500 కోట్ల మేర భారం తగ్గుతుందని ఆ సంఘం నేతలు నాగేశ్వరరావు, కమాల్‌రెడ్డి, నరేందర్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. -
17వేల మందికి సమ్మె వేతనాలు లేవు
ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య శ్రీరాంపూర్ : సింగరేణì వ్యాప్తంగా 17వేల మంది కార్మికులు సకల జనుల సమ్మె వేతనాలు పొందలేకపోయారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ ప్రెస్‌క్లబ్‌లో యూనియన్ అధ్యక్షుడు వై.గట్టయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో కార్మికులంతా కలిసి సకలజనుల సమ్మెలో పాల్గొన్నారని తెలిపారు. నాడు ఉద్యమంలో పాల్గొంటూనే గనులు మునిగిపోకుండా, కూలిపోకుండా అత్యవసర సిబ్బంది విధులు నిర్వహించారు. కాలనీల్లో నీటి సరఫరా చేస్తూ, ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తూ అనేక మంది నాడు సమ్మె కాలంలో విధులు నిర్వహించారు. వారు నాడు విధులు నిర్వహించకుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ అలాంటి వారికి నేడు సమ్మె వేతనాలు చెల్లించకపోవడానికి కారణం గుర్తింపు సంఘం వైఫల్యమే అన్నారు. కేవలం కొద్ది మందికే ప్రయోజనం చేకూరేలా ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దీని కోసం పెట్టిన నిబంధనలు కేవలం కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ఉన్నాయన్నారు. దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి కార్మికుల సమస్యలపై సెప్టెంబర్ 2న దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని సీతారామయ్య కోరారు. ఈ సమ్మెపై శనివారం శ్రీరాంపూర్ ప్రెస్‌క్ల»Œ లో జాతీయ సంఘాల నేతలంతా కలిసి సమావేశం కానున్నట్లు తెలిపారు. 10వ వేజ్‌బోర్డు కమిటీని వెంటనే వేయాలని, గ్రాట్యూటీపై ఉన్న సీలింగ్ ఎత్తివేయాలని, పింఛన్ 25 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. గతేడాది కంపెనీ సాధించిన లాభాల నుంచి 25 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ కేంద్ర కార్యదర్శి ముస్కె సమ్మయ్య, బ్రాంచి సెక్రెటరీలు ల్యాగల శ్రీనివాస్, కొట్టె కిషన్‌రావు, నాయకులు కాంపెల్లి నర్సయ్య పాల్గొన్నారు.