breaking news
Sahasam
-
వారం రోజులు తిండి పెట్టలేదు, చులకనగా చూశారు: జగపతిబాబు
హీరోగా, హీరో తండ్రిగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయగల సత్తా ఉన్న నటుడు జగపతి బాబు. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఆయన కెరీర్లో గుర్తుండిపోయిన ఓ సంఘటనను మీడియాతో పంచుకున్నాడు. 'నేను ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 35 ఏళ్లవుతోంది. నాకు సినిమా తప్ప మిగతా ఏం తెలియదు. నాకు బాగా గుర్తుండిపోయిన చేదు సంఘటన చెప్తాను.. సాహసం సినిమాలో నేను సెకండ్ హీరో. ఆ మూవీ షూటింగ్లో ఏడు రోజులపాటు నాకు తిండిపెట్టలేదు, కనీసం తింటారా? అని కూడా అడగలేదు. అప్పుడు లైట్‌బాయ్ కూడా నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఈ అవమానం నాకు మంచి గుణపాఠం నేర్పించింది. ఇక్కడే ఉంటాడులే, ఎలాగో సినిమా చేస్తాడులే అని నన్ను చులకనగా చూసేవారు. ఇతర భాషల్లో సినిమాలు చేసి వస్తే మాత్రం అప్పుడిక్కడ మనకు ప్రత్యేక గౌరవమిస్తారు' అని చెప్పుకొచ్చాడు. తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. 'పెద్దమ్మాయి అమెరికన్‌ను పెళ్లాడింది. చిన్నమ్మాయినైతే పెళ్లే వద్దన్నాను. వివాహం అనే సాంప్రదాయాన్నే నమ్మను. పెళ్లి, పిల్లలు.. అని బాధ్యత తీర్చుకోవడానికి వారి వెంటపడటం కరెక్ట్ కాదు. చిన్నమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటే తననే వెతుక్కోమన్నాను' అని చెప్పుకొచ్చాడు జగ్గూభాయ్. చదవండి: మనోజ్ పెళ్లెప్పుడు? అన్న ప్రశ్నకు మంచు లక్ష్మీ సమాధానం ఏంటంటే? -
గోపిచంద్ ముచ్చటగా మూడో సారి
గోపిచంద్‌కు ఒక్కడున్నాడు, సాహసం వంటి డీసెంట్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. మనమంతా లాంటి డిఫరెంట్ మూవీ తరువాత యేలేటి ప్రస్తుతం గోపిచంద్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. రోటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు రూపొందించే చంద్రశేఖర్ యేలేటి తొలి సినిమా నుంచి అదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గోపిచంద్ పంతం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తైయిన వెంటనే చంద్రశేఖర్‌తో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. ఈ మధ్యే గోపిచంద్‌ను కలిసి కథ కూడా వినిపించారని, కథ నచ్చడంతో సినిమాను ఓకే చేశారని తెలుస్తోంది. గంతలో చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చేసిన రెండు సినిమాలు గోపిచంద్‌కు నటుడిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. ముచ్చటగా మూడోసారి తెర మీదకు వచ్చేందుకు రెడీ అవుతున్న వీరు.. ఈ సారి కమర్షియల్ గా కూడా సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. చక్రవర్తిని దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న పంతం సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. గోపిచంద్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాను జూలై 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అందరూ డిఫరెంట్ అంటారు...నేను న్యాచురల్ అంటాను!
‘‘డిఫరెంట్ సినిమాలు తీయాలని ప్రయత్నించిన మాత్రాన డిఫరెంట్ కథలు, ఆలోచనలు రావు. అందరూ నా సినిమాలను డిఫరెంట్ అంటున్నారు కానీ.. నాకు మాత్రం న్యాచురల్‌గానే అనిపిస్తాయి. నా ఆలోచనలు అంతే’’ అని దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి అన్నారు. ఆయనదర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మనమంతా’ ఆగస్టు 5న విడుదల కానుంది. మోహన్‌లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావు ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో రజనీ కొర్రపాటి నిర్మించారు. చంద్రశేఖర్ ఏలేటి చెప్పిన విశేషాలు... ♦ ‘సాహసం’ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్. ఆ చిత్రం విడుదల తర్వాత హ్యూమన్ ఎమోషన్స్ ఉన్న సినిమా తీయాలనుకున్నాను. కథ రాయడానికి కొంచం ఎక్కువ సమయమే పట్టింది. గతేడాది డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశాం. కథ రాసిన తర్వాతే ఆర్టిస్టులను ఎంపిక చేస్తాను. మోహన్‌లాల్, గౌతమి అయితే ఈ కథకు న్యాయం చేస్తారని భావించాను. నా ఫస్ట్ చాయిస్ వాళ్లే. నేను ఫస్ట్ చాయిస్ ఎవర్ని అనుకున్నానో లక్కీగా వాళ్లందరికీ కథ నచ్చింది. ఇలాంటి కథలు అంగీకరించాలంటే నిర్మాతకు మంచి అభిరుచి ఉండాలి. ప్రేక్షకులకు మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో సాయి కొర్రపాటిగారు కథ వినగానే నిర్మించడానికి అంగీకరించారు. ♦ ప్రతిరోజూ మనమంతా పలు సంఘటనలను చూస్తాం. వాటిని చూసిన తర్వాత ఓ స్కూల్ పాప ఎలా స్పందిస్తుంది? ఓ కాలేజీ స్టూడెంట్, ఓ హౌస్‌వైఫ్, ఓ మిడిల్ ఏజ్డ్ పర్సన్.. వివిధ సంఘటనల పట్ల వీరంతా ఎలా స్పందిస్తారనేది ‘మనమంతా’. ఈ నాలుగు కథలూ క్లైమాక్స్‌లో కలుస్తాయి. అప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా ఉంటుంది. కథేంటో చెప్తే ప్రేక్షకులకు కిక్ ఉండదు. ♦ ఇప్పటివరకూ నేను తీసిన సినిమాల్లో బాగా కష్టపడిన సినిమా ఇది. ఓ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత నాలుగైదు రోజుల్లో ఆ మూడ్‌లోకి వెళతాం. నాలుగు కథలు కావడంతో స్క్రీన్‌ప్లే రాయడం కష్టమైంది. యాక్షన్ లేదు, ఎక్కువ పాటలు లేవు, థ్రిల్లర్ కాదు, ఫ్యామిలీ డ్రామాలో స్క్రీన్‌ప్లే కొత్తగా ప్రయత్నించాను. ♦ యాక్టింగ్‌లో మోహన్‌లాల్‌గారు జీనియస్. ఈ రోజు కొత్తగా నిరూపించుకోవలసిన అవసరం లేదు. స్పాంటేనియస్ యాక్టర్. ఫస్ట్ టేక్‌లో నటించినట్టు, సెకండ్ టేక్‌లో నటించరు. ఆ పాత్రలా బిహేవ్ చేస్తారు. గౌతమిగారు, మిగతా ఆర్టిస్టులు కూడా బాగా నటించారు. తెలుగులో డబ్బింగ్ చెప్తానని మోహన్‌లాల్‌గారు పట్టుబట్టారు. ♦ ‘ప్రయాణం’ తర్వాత వెంకటేశ్‌గారితో ఓ సినిమా తీయాలని ప్లాన్ చేశా. కానీ, కుదరలేదు. ఆ కథకూ, ఈ ‘మనమంతా’ కథకూ ఎటువంటి సంబంధం లేదు. ♦ ‘ఐతే’ తీసినప్పుడు ఓవర్సీస్ మార్కెట్ ఇంతలేదు. మల్టీప్లెక్స్‌లు లేవు. ఇటీవల భిన్నమైన కథలతో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఓవర్సీస్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మూడు నాలుగేళ్ల తర్వాత ఈ ట్రెండ్ ఇంకా మారుతుంది. ♦ మంచి కథకు స్టార్ హీరో తోడయితే.. ఆ సినిమా ప్రేక్షకులకు త్వరగా చేరువ అవుతుంది. మలయాళంలో మోహన్‌లాల్‌గారు సూపర్‌స్టార్. ఆయన నటిస్తున్నప్పుడు మలయాళంలో తీయకపోవడం మూర్ఖత్వం అవుతుంది. అందుకే ఈ చిత్రాన్ని మలయాళంలో తీశాం. తమిళంలో మాత్రం డబ్బింగ్ చేస్తున్నాం. -
మేకింగ్ ఆఫ్ 'సాహసం'-ప్రోమో
-
సాక్షి సినిమా 15th July 2013
-
సాహసం: గోపీచంద్‌తో చిట్‌ఛాట్