breaking news
Sadum
-
11 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన తామరపూలు
సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది. వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. -
'బాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారు'
సదుం (చిత్తూరు జిల్లా) : ఏపీ నూతన రాజధానిలో తెలుగుదేశం నేతలు కొన్న భూముల డబ్బులతో రైతులు బంగారంపై తీసుకున్న రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయవచ్చని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం సదుం మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్న జగన్ మోహన్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. త్వరలో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. భూదందా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.