breaking news
Sachin a Bil Ya Dreams
-
నా గురించి పూర్తిగా తెలియదు: సచిన్
ముంబై: తన గురించి ఎన్నో విషయాలు తెలుసునని అభిమానులు భావిస్తుంటారని, అయితే వారికి ఎన్నో తెలియని అంశాలు చాలా ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. సచిన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' ప్రచార కార్యక్రమంలో సచిన్ మాట్లాడారు. 'నా అభిమానులకు ఎన్నో తెలియని విషయాలున్నాయి. అందుకే జీవితకథ ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఈ మూవీ నన్ను కొత్తగా ఆవిష్కరిస్తుంది. నా జీవితంలోని ఎన్నో మధురస్మృతులను తెరపై చూసుకోనుండటం నన్ను మరింత ఉత్తేజితం చేస్తుంద'ని సచిన్ చెప్పారు. ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఓ పాటను సచిన్ ఆవిష్కరించారు. సచిన్ సచిన్ అంటూ మొదలయ్యే ఈ పాటకు సఖ్విందర్ గాత్రం అందించాడు. నిర్మాత రవి భాగ్చందక మాట్లాడుతూ.. సచిన్ ఇంట్లో వెయ్యి గంటల పాటు ఉన్న అరుదైన వీడియోల నుంచి 25 నిమిషాలపాటు అరుదైన సీన్లను తెరపై చూపిస్తామన్నారు. కేవలం తన ఇంట్లో మాత్రమే యాక్సెస్ అయ్యే కొన్ని వీడియోలను మూవీ యూనిట్ కు సచిన్ చూపించారు. వాంఖెడే స్డేడియంలో సచిన్ ఆటను మూవీలో చూడవచ్చన్నారు. -
నా సినిమా నన్ను ఆవిష్కరిస్తుంది: సచిన్
లండన్: తన జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘సచిన్ ఎ బిలి యన్ డ్రీమ్స్’ చిత్రం తనను ఆవిష్కరిస్తుందని సచిన్ టెండూల్కర్ చెప్పారు. సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందు కు ఇక్కడికి వచ్చిన సచిన్ మాట్లాడుతూ ‘నా జీవితంలోని మధురఘట్టాల్ని నేను తిరిగి చూసుకునేందుకు, నా సుదీర్ఘ పయనంలో నాకు మాత్రమే తెలిసిన విశేషాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ బయోపిక్చర్ ఉపయోగపడుతుం ది. ఈ సినిమా నా ఇన్నింగ్స్ల్లాగే అభిమానుల్ని అలరిస్తుంది. 24 ఏళ్ల కెరీర్లో నాపై కురిపించిన ఆదరాభిమానాల్ని ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా’నని అన్నారు. ఈ చిత్రానికి రవి భాగ్చంద్క నిర్మాతగా వ్యవహరించగా.. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ ఎర్స్కిన్ దర్శకత్వం వహించాడు.