ములుగును జిల్లా చేయాలని రాస్తారోకో
నల్లజెండా, బ్యాడ్జీలతో కాంగ్రెస్ నిరసన
ములుగు : ములుగును జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని తన కుమారునికి అప్పగించేందుకు తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మస్రగాని వినయ్‌కుమార్ ఆరోపించారు.
తండ్రీకొడుకులు పదవుల్లో ఉండి నియోజకవర్గ ప్రజలకు చీకటి రోజులు మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ నా యకులు ఆదివారం నల్లజెండాలు, బ్యాడ్జీలు ధరించి మండలకేంద్రం లో నిరసన ర్యాలీ నిర్వహించారు. సుమారు 200 మంది కార్యకర్తలు మౌనదీక్షగా ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కూరగాయాల మార్కె ట్ సమీపంలోని గాంధీ విగ్రహం ఎదుట అర్ధనగ్నంగా మోకాళ్ళపై కూర్చొని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగును జిల్లాగా ప్రకటించకపోవడం కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమన్నారు.టీఆర్ఎస్ నాయకులు జి ల్లాను రాకుండా చేశారని, మంత్రి చందూలాల్ ప్యాకేజీల కోసం స్పీకర్ మధుసూదనాచారికి అనుగుణంగా నడుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా మంత్రి సీఎం కేసీఆర్‌తో మాట్లాడి జిల్లా కోసం ఒప్పించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు వేములపల్లి భిక్షపతి, ఎండీ. యూనుస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు రాజుయాదవ్, నాయకులు నరేందర్‌రెడ్డి, పురుషోత్తం, బాబి, శ్రీనివాస్‌యాదవ్, మహేందర్, డీవి. రెడ్డి, సమ్మయ్య, రవి, కుమార్, రాములు, తిరుపతి, షర్పోద్దీన్, తిరుపతిగౌడ్ పాల్గొన్నారు.