russia warning
-
ఉక్రెయిన్ సేనలకు పుతిన్ హెచ్చరిక.. మీ ప్రాణాలకు గ్యారంటీ లేదంటూ..
మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న వేళ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. కర్క్స్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు లొంగిపోవడం మంచిది. లేకపోతే వారు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చారు. దీంతో, మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా పశ్చిమ రష్యాలోని కర్క్స్‌లో కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్బంగా పుతిన్ తాజాగా మాట్లాడుతూ..‘కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ (Ukraine) సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను. లేదంటే పరిస్థితి మరోలా ఉంటుంది. రష్యా ఫెడరేషన్తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటాం. మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని వెల్లడిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, పుతిన్ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ సేనల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ను కనికరించాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు తాను విజ్ఞప్తి చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధంలో ఆ దేశ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. కీవ్ సేనలను అన్ని వైపుల నుంచి రష్యా దళాలు చుట్టుముట్టాయని తెలిపారు. అందుకే.. ఉక్రెయిన్ సైనికులపై కనికరం చూపాలని తాను పుతిన్‌కు విజ్ఞప్తి చేశానని చెప్పారు. లేకపోతే రెండో ప్రపంచయుద్ధం తర్వాత జరిగే అతి దారుణమైన ఊచకోతగా ఇది మిగిలిపోతుందని అన్నారు. కాల్పుల విరమణకు సంబంధించి రష్యా నుంచి మంచి సంకేతాలు వస్తున్నాయని, మాస్కోతో జరిపిన చర్చలు ఫలించే అవకాశం ఉందన్నారు. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణకు సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నానని పుతిన్ చేసిన ప్రకటనపై ట్రంప్ సంతృప్తి వ్యక్తం చేశారు.⚡️ BREAKING: President Putin responded to President Trump regarding his appeal to spare Ukrainian soldiers in the Kursk region:“We have read today’s appeal from President Trump to spare the lives of servicemen of the Ukrainian Army in the Kursk region. In this regard, please… pic.twitter.com/RmmbqO1oS3— 🇷🇺Russia is not Enemy (@RussiaIsntEnemy) March 14, 2025 -
పుతిన్ పైశాచికత్వం.. ఉక్రెయిన్‌లో 51 మంది మృతి..
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఏడాదిన్నరకు పైగా రష్యా సైన్యం దాడులు.. ఉక్రెయిన్‌పై కొనసాగుతున్నాయి. తాజాగా రష్యా రాకెట్లో ఉక్రెయిన్‌లో భారీ ప్రాణనష్టం చోటుచేసుకుంది. రాకెట్ దాడిలో 51 మంది మృతిచెందినట్టు సమాచారం. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు ఉక్రెయిన్ దేశ అధికారులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలో రష్యా రాకెట్ దాడులు చేసింది. గురువారం మధ్యాహ్నం కుప్యాన్స్క్ జిల్లాలోని హ్రోజా గ్రామంలో ఒక షాపు, కేఫ్‌పై రష్యా రాకెట్ల దాడి జరిగినట్లు ఆ ప్రాంత గవర్నర్ తెలిపారు. ఈ రాకెట్ దాడిలో సుమారు 51 మంది మరణించినట్లు చెప్పారు. బిల్డింగ్ శిథిలాల్లో కొందరు చిక్కుకున్నట్లు వెల్లడించారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిన్నట్లు టెలిగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ⚡️Yermak: Russia attacks village in Kharkiv Oblast, killing 49 people. Russian forces attacked a grocery store in the village of Hroza in Kharkiv Oblast’s Kupiansk district, killing at least 49 people, Andriy Yermak, the head of the Presidential Office, reported on Oct. 5. 📷… pic.twitter.com/rKOmYg8i07 — The Kyiv Independent (@KyivIndependent) October 5, 2023 మరోవైపు.. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ రిజియన్‌లోని బెరిస్లావ్ ప్రాంతంలోని ఓ ఆసుపత్రిపై రష్యా దాడులకు తెగబడింది. ఆసుపత్రి, మెడికల్ ఎమర్జెన్సీ స్టేషన్‌పై రష్యా బాంబు దాడులు ప్రయోగించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 😥Russian bomb hits hospital and emergency medical station in Beryslav, Kherson region#UkraineWar #Ukraina #UkraineRussiaWar #Russia pic.twitter.com/GNXABLsXpr — Hieu Nguyen (@HieuTraderPro) October 5, 2023 కాగా, స్పెయిన్‌లో జరుగనున్న యూరప్ నేతల సదస్సులో పాల్గోనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్కీ తాజా రష్యా దాడిపై స్పందించారు. గ్రోసరీ షాపుపై జరిగిన రష్యా రాకెట్ దాడిని క్రూరమైన ఉగ్రవాద దాడి అని ఆరోపించారు. ఈ సంఘటనలో 48 మందికిపైగా మరణించినట్లు తెలుస్తున్నదని వెల్లడించారు. మరోవైపు 19 నెలలుగా ఉక్రెయిన్‌పై దాడులను రష్యా కొనసాగిస్తున్నది. స్వాధీనం చేసుకున్న కొన్ని ప్రాంతాలను రష్యాలో కలుపుకున్నది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ సాక్షిగా ట్రూడో చిల్లర చేష్టలు -
అమెరికాకు రష్యా సీరియస్ వార్నింగ్
సిరియా వైమానిక స్థావరం మీద క్షిపణి దాడులు చేసినందుకు అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా సీరియస్‌గా హెచ్చరించింది. విదేశాంగ విధానంలో అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న తొలి నిర్ణయమే అమెరికా – రష్యాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. మధ్యధరా సముద్రంలో అమెరికా మోహరించిన యూఎస్ఎస్ పోర్టర్, యూఎస్ఎస్ రాస్ అనే రెండు యుద్ధనౌకల నుంచి సుదూరంగా ఉన్న సిరియాలోని షైరత్ వైమానిక స్థావరం మీద దాదాపు 60 వరకు తోమహాక్ క్షిపణులను ప్రయోగించి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. రెబల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో సిరియా సైన్యం రసాయన దాడులకు పాల్పడి, 70 మంది అమాయకులను మట్టుబెట్టడంతో తాము ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా చెబుతున్నా, అంతర్జాతీయ సమాజం మాత్రం దాన్ని అంతగా ఆమోదించడం లేదు. బ్రిటన్ లాంటి ఒకటి రెండు దేశాలు మాత్రం అమెరికాను సమర్థించాయి. మిగిలిన వాళ్లంతా అమెరికా దుందుడుకు చర్యను ఖండించారు. గత ఆరేళ్లుగా సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం ఇది రెండోసారి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదేశాలతోనే రసాయన దాడులు జరిగాయని, వాటిలో కనీసం 70 మంది మరణించారని చెబుతుండగా... సిరియా ప్రభుత్వం మాత్రం ఆ దాడులు చేసింది తాము కాదని అంటోంది. ఈ రసాయన దాడి అనంతరం అమెరికా చేసిన క్షిపణి దాడులతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రష్యా ఎప్పటినుంచో సిరియాకు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అమెరికా అక్రమంగా తీసుకున్న ఈ ఏకపక్ష చర్యలను తాము గట్టిగా ఖండిస్తున్నామని, దీనికి ప్రాంతీయంగాను, అంతర్జాతీయంగాను వచ్చే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్యసమితిలో రష్యా ఉప రాయబారి వ్లాదిమిర్ సాఫ్రన్‌కొవ్ తెలిపారు. మాకు ఒక్క అడుగే దూరం: మెద్వదెవ్ రష్యా సైన్యంతో నేరుగా తలపడేందుకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే అమెరికా ఉందన్న విషయాన్ని ఈ దాడులు నిరూపిస్తున్నాయని రష్యా ప్రధానమంత్రి డిమిట్రీ మెద్వదెవ్ వ్యాఖ్యానించారు. అమెరికా క్షిపణి దాడుల్లో ధ్వంసమైన వైమానిక స్థావరంలో రష్యాకు చెందిన ప్రత్యేక బలగాలు, హెలికాప్టర్లు అన్నీ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మీద సిరియా చేస్తున్న పోరాటానికి అండగానే ఇవి అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా అనాలోచితంగా చేసిన ఈ దాడి ఫలితంగా రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యేకమైన హాట్‌లైన్ మూతపడుతుందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ చెబుతోంది. మరిన్ని చర్యలు: అమెరికా ఒబామా హయాంలో రష్యాతో తీవ్రంగా దెబ్బతిన్న సంబంధాలను తాను మెరుగు పరుస్తానని ట్రంప్ చాలా సందర్భాలలో తెలిపారు. సమీప భవిష్యత్తులో తాము సిరియా మీద మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవ్ నుచిన్ తెలిపారు. సిరియా విషయంలో మాత్రం అవసరమైతే తాము మరిన్ని చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉన్నామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. అయితే అది అవసరం అవుతుందని తాను భావించడం లేదన్నారు. ఒకవైపు రసాయన ఆయుధాలు ఉపయోగిస్తుంటే మరోవైపు అమెరికా మాత్రం చూస్తూ ఊరుకోబోదని ఆమె తెలిపారు. రసాయన ఆయుధాల ఉపయోగాన్ని నిరోధించడం తమ కీలక జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమని ఆమె అన్నారు.