breaking news
rupes
-
ఎంఎస్ ధోని కూతురు జివా స్కూల్ ఫీజు ఎంతో తెలుసా? (ఫొటోలు)
-
4 నుంచి రాజమండ్రిలో వైఎస్సార్సీపీ సమీక్షలు
మళ్లీ పెరిగిన ధరలు రెండు నెలలు గడవకముందే షాకిచ్చిన డెయిరీ లీటర్‌కు రూ. 2 వడ్డన నేటి నుంచి అమలు అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌లైన్: వినియోగదారులకు విశాఖ డెయిరీ మళ్లీ షాకిచ్చింది. రెండు నెలలు తిరక్క ముందే పాల ధర మళ్లీ పెంచింది. లీటరుకు రెండు రూపాయలు పెంచుతూ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. ఈ ధరలు ఆదివారంనుంచి అమల్లోకి రానున్నట్టు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో, ఈ ఏడాది ఏప్రిల్ 5న ధరలు పెంచిన డెయిరీ యాజమాన్యం రెండు నెలలు గడవకముందే మళ్లీ పెంచి సామాన్యుడిపై విపరీతమైన భారం మోపింది. ఇప్పటికే మోయలేని ధరలతో సతవుతవువుతున్న ప్రజలకు ఇప్పుడు పాల ధర మరో సమస్యగా మారనుంది. విశాఖ డెయిరీ గత ఏడాదిన్నర కాలంలో పాలరేట్లను పెంచడం ఇది ఆరోసారి. దీంతో సగటు వినియోగదారుడు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి తలెత్తింది. 2012 ఫిబ్రవరి, జూన్, గత ఏడాది మార్చి, సెప్టెంబర్లలో ఈ ఏడాది ఏప్రిల్‌లోని ప్రతిసారి రెండేసి రూపాయల వంతున ధర పెంచడంతో ఆ భారం ఒక్కో లీటరుకు పది రూపాయలనుంచి రూ.40 వరకు పెరిగింది. విద్యుత్ కోత, సిబ్బంది సమస్య, పెరిగిన ఇంధన ధరలు, పాల సేకరణ ధరల వంటి అనేక కారణాలు చూపుతూ ధరలు పెంచుతున్నట్టు డెయిరీ తెలిపింది. రైతుల నుంచి పాల సేకరణ తక్కువగా ఉండడంతో నిర్వహణ కష్టమవుతోందని ప్రకటనలో పేర్కొంది.