breaking news
run for her
-
బాలికా.. నువ్వే ఏలిక
గచ్చిబౌలి: సేవా భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియంలో ‘రన్ ఫర్ ఏ గర్ల్ చైల్డ్’ పేరిట నిర్వహించిన 5కే రన్ ఉత్సాహంగా సాగింది. కార్యకమాన్ని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. బాలికల వికాసానికి తోడ్పాటు అందిస్తూ సేవా భారతి ప్రపంచానికి మంచి సందేశాన్ని అందిస్తోందని కితాబిచ్చారు. ‘బేటీ బచావో..బేటీ పడావో’ నినాదంతో ప్రదాని నరేంద్ర మోదీ బాలికల విద్యను ప్రోత్సహిస్తున్నారని, స్త్రీ, పురుషుల మధ్యనున్న వ్యత్యాసాలను తగ్గించేందుకు సమాజంలో మరింత చైతన్యం తీసుకరావాల్సిన అవసరం ఉందన్నారు. సేవా భారతి స్వచ్ఛంద సంస్థ తెలంగాణలో 185 కిశోర్ వికాస్ కేంద్రాల ద్వారా బాలికలకు విద్య, వృత్తి విద్యలో శిక్షణ ఇస్తోందన్నారు. తాను పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళతానని, పర్యావరణ పరిరక్షణకు అందరు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. మహిళల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. అనంతరం రన్లో విజేతలకు కేంద్ర సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వల్, జయేష్ రంజన్లు బహుమతులు ప్రదానం చేశారు. ఉత్సాహంగా రన్.. 10కే రన్‌ను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్, హెచ్‌సీయూ వైస్ చాన్సలర్ పి.అప్పారావు ప్రారంభించారు. 21కే రన్‌ను ఏఓసీ సెంటర్ కమాండెంట్, బ్రిగేడియర్ జేజేఎస్ బిందర్, ప్రముఖ జిమ్నాస్ట్ మేఘనారెడ్డి ప్రారంభించారు. రన్లో 400 మంది సైనికులతో పాటు వివిధ ఐటీ కంపెనీలకు చెందిన 8 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. -
Run for Her
హాఫ్ మారథాన్, పింకథాన్.. పేరేదైనా నగరవాసులు రన్ రాజా రన్ అంటున్నారు. ఈ వరుసలో కొత్తగా చేరింది ఉమెన్‌థాన్. ఆడవాళ్లను గౌరవించాలన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘రన్ ఫర్ హర్’. అమ్మ కోసం కొడుకు... కూతురును ప్రేమించే తండ్రి... అక్క గురించి తమ్ముడు... భార్యను గౌరవించే భర్త... గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రేమికుడు... రొటీన్ గిఫ్ట్‌కి భిన్నంగా, వారిపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఇదో వేదిక . మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో ఏకకాలంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది ‘క్వాంటా జీ ఈవెంట్స్’. కూకట్పల్లి సుజనామాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో హీరో రాజశేఖర్, జీవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ విభిన్నమైన ఈవెంట్ గురించి... మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు చరమగీతం పాడాలన్న లక్ష్యంతో ఈ ఈవెంట్‌ను కండక్ట్ చేస్తోంది ‘క్వాంటా జీ ఈవెంట్స్’. ఈ సంస్థ ముగ్గురు డెరైక్టర్స్‌లో ఒకరైన దినేశ్ రాజ్ నెల్లూరువాసి. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండేవాడు. చెన్నై హిందూ కాలేజీలో బీకామ్ చేసిన దినేశ్ తమ బంధువులను కలిసేందుకు తరచూ సిటీకి వస్తుండేవాడు. అలా తెలియకుండానే హైదరాబాద్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. బీకామ్ అయ్యాక ఓ బ్యాంక్‌లో పనిచేస్తూ సొంతూరులో ఫ్రెండ్స్‌తో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. ఆ అనుభవంతో చెన్నైకి చెందిన నిత్యశ్రీ, కేరళకు చెందిన గణపతి సుభన్తో కలిసి క్వాంటా జీ ఈవెంట్‌ను స్థాపించారు. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో దినేశ్.. సహచరులతో కలిసి గతేడాది డిసెంబర్లో చెన్నైలో ‘మై ఫ్లాగ్ మై ఇండియా’ ఈవెంట్ చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కారు. జాగృతే లక్ష్యంగా... మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలన్న తన ఆలోచనను తోటి డెరైక్టర్లతో చర్చించారు దినేశ్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలను గౌరవించాలనే థీమ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఫలితం... ఉమెన్‌థాన్... బై మెన్. వెంటనే కార్యరూపమిచ్చారు. ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ‘అడవాళ్లను గౌరవించేలా చేయడమే మా లక్ష్యం. ఈ పరుగు వల్ల నలుగురు మారినా మేం సక్సెస్ అయినట్టే. ఈ ఈవెంట్లో 12 వేలమంది పాల్గొంటారని అంచనా. వచ్చే ఏడాది ముంబై, కోల్‌కతా నగరాలో కూడా నిర్వహించాలనుకుంటున్నాం. తద్వారా మొత్తం 65 వేల మంది ఈ ఈవెంట్లో పాల్గొనేలా చూడాలనుకుంటున్నాం’ అంటున్నారు దినేశ్. ప్రేమను పొందవచ్చు... మూడు, ఐదు, పది కిలోమీటర్లు... మూడు కేటగిరీల్లో పరుగు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మార్చి 7 లోపు బీబ్ కలెక్ట్ చేసుకోవచ్చు. పాల్గొనేవారికి మెడల్స్‌తో పాటు టీ షర్ట్లు, బీబ్, ఫ్లవర్స్, బొకేలు కూడా ఇస్తారు. వీటిని రన్లో పాల్గొన్న మెన్ తీసుకెళ్లి తమ కుటుంబంలోని మహిళలకు ఇచ్చుకోవచ్చు. దీంతో ఆడవాళ్లను గౌరవిస్తున్నారనే నమ్మకంతోపాటు వారి మనసును, ప్రేమను గెలుచుకోవచ్చు. ఎవరెవరు..! పురుషులు సింగిల్‌గా పాల్గొనవచ్చు. మహిళలైతే భర్త, తండ్రి, సోదరుల్లో ఎవర్నైనా తమ వెంట తెచ్చుకోవాలి. ఎంట్రీ ఫీజు రూ.600. ఆసక్తి ఉన్నవారు ఠీౌఝ్చ్చ్టజిౌ.ఛిౌఝ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వాంకె శ్రీనివాస్