breaking news
RTC DM Balaji Dayal harassment
-
ఆర్టీసీ డీఎం వేధింపులు : కార్మికుల నిరసన
-
ఆర్టీసీ డీఎం వేధింపులు : కార్మికుల నిరసన
సత్తెనపల్లి: గుంటూరుజిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సత్తెనపల్లి డిపో మేనేజర్ సి.బాలాజీ దయాళ్ వేధింపులకు నిరసనగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం ధర్నా చేపట్టారు. మహిళా కండక్టర్ జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి డిపో మేనేజర్ వేధింపులే కారణమని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. డీఎం వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు జయలక్ష్మి సోమవారం విజయవాడ వెళ్లారు. అక్కడ ఆర్టీసీ ఎండీని కలిసేందుకు వీలు కుదరకపోవడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. డిపో మేనేజర్ తీరుపై ఆర్టీసీ కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్య తీసుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.