breaking news
rta employees
-
10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు
► సెకెండ్ వెహికల్ రిజిస్ట్రేషన్లలో అక్రమాలు ► రవాణా ఆదాయానికి భారీ గండి ► గ్రేటర్ పరిధిలో అక్రమాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడిన 10 మంది ఆర్టీఏ ఉద్యోగులపై ప్రభుత్వం శనివారం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ ఆదేశాలు వెలువరించారు. సస్పెండైన వారంతా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లా ల్లోని పలు ఆర్టీఏ కార్యాలయాల్లో పనిచేస్తున్న క్లర్క్‌లు, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఉన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆరుగురు, రంగారెడ్డిలో ఇద్దరు, మేడ్చెల్‌లో ఇద్దరు సస్పెండ్ అయ్యారు. రెండో వాహనం రిజిస్ట్రేషన్లలో వాహనదారుల నుంచి తీసుకున్న 14 శాతం పన్నును ప్రభుత్వ ఖాతాలో జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకు న్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లు వెత్తాయి. 2014 నుంచి 2015 వరకు జరిగిన ఈ అక్రమాల్లో మొత్తం 36మంది ఉద్యోగులు భాగస్వా ములై ఉన్నట్లు అప్పట్లోనే గుర్తించారు. వారందరికీ గత సంవత్సరమే చార్జి మెమోలు జారీ చేశారు. వారిలో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిని ప్రస్తుతం సస్పెండ్ చేశారు. భారీ ఎత్తున ఆదాయానికి గండి... సాధారణంగా వాహనాల రిజిస్ట్రేషన్లపై రవాణా శాఖ వాటి ఖరీదులో కొంతమొత్తాన్ని జీవితకాల పన్నురూపంలో వసూలు చేస్తుంది. ద్విచక్ర వాహనాలపై 9 శాతం, కార్లపైన 12 శాతం చొప్పున వసూలు చేస్తారు. సదరు వ్యక్తులు తమకు అప్పటికే ఒక వాహనం ఉండి రెండో వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం వాహనం ఖరీదులో 14 శాతం పన్ను చెల్లించవలసి ఉంటుంది. ఇలా రెండో వాహనం రిజిస్ట్రేషన్లపైన వాహనదారులు చెల్లించే పన్ను పెద్ద ఎత్తున దారి మళ్లినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొందరు ఉద్యోగులు వాహనదారుల పేరు, ఇంటి నంబర్, చిరునామా వంటి వివరాల్లో స్వల్ప మార్పులు చేసి ప్రభుత్వ ఖజానాకు పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టారు. అప్పటి రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా ఈ కుంభకోణాన్ని గుర్తించి పెద్ద ఎత్తున క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులు తప్పిదాలకు పాల్పడినట్లు గుర్తించి మెమోలు జారీ చేశారు. తాజాగా 10 మంది ఉద్యోగులను తీవ్రమైన తప్పులకు పాల్పడినట్లు గుర్తించి సస్పెండ్ చేయడం గమనార్హం. పేర్లు ప్రకటించకపోవడంతో ఆ 10 మంది ఎవరన్న దానిపై ఆర్టీఏ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఖైరతాబాద్, అత్తాపూర్, ఉప్పల్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, సికింద్రాబాద్ వంటి అన్ని చోట్ల ఈ పన్ను ఎగవేత ఉదంతాలు చోటుచేసుకున్నాయి. -
కోటేషన్ నుంచే మాముళ్లు షురూ
షోరూంల దగ్గర నుంచే దందా మొదలు ఆర్టీవో పనులకు అదనపు వసూళ్లు షోరూం నిర్వాహకులతో ఆర్టీఏ సిబ్బంది కుమ్మక్కు వాహనదారులపై అదనపు భారం సాక్షి, హన్మకొండ : సిబ్బంది పని భారం తగ్గించడం, సేవలు సుళువుగా పొందేందుకు వీలుగా నూతన వాహనం కొనుగోలు సమయంలోనే రిజిస్ట్రేషన్, హై సెక్యూరిటీ నెంబర్ పేట్ పొందేందుకు వీలుగా షోరూంల్లోనే తగిన రుసుము చేల్లించి రశీదు పొందే విధానాన్ని ఇటీవల రవాణాశఖ ప్రవేశపెట్టింది. ఈ నూతన పద్దతిని వాహన షోరూం యాజమాన్యాలు, అక్కడ పని చేసే సిబ్బంది ఆర్టీవో సిబ్బందితో కలిసి తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్రమ ఆదాయానికి మార్గంగా ఎంచుకున్నారు. దీంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది. తాత్కాలిక రిజిష్ట్రేషన్, శాశ్వత రిజిష్ట్రేషన్, నంబరు ప్లేట్లకు సంబంధించి వివిధ వాహనాలకు రవాణా శాఖ నిర్ధేశించిన ఫీజు కంటే రెండు నుంచి నాలుగు రెట్లు షోరూముల్లో అధికంగా వసూలు చేస్తున్నారు. రిజిష్ట్రేషన్లకు సంబంధించిన కంప్యూటర్ బిల్లులు ఇవ్వాల్సి ఉండగా తెల్లకాగితాలపై రాసి ఇస్తున్నారు. ద్విచక్ర, ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు తదితర వాహనాలకు చెందిన షోరూములు జిల్లాలో 69 ఉన్నాయి. తొంభైశాతానికి పైగా షోరూముల్లో ఈ అదనపు వసూళ్ల దందా నిరాటంకంగా కొనసాగుతోంది. దీన్ని అరికట్టాల్సిన రవాణాశాఖ అధికారులు ఈ వ్యవహరానికి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా జిల్లాలో రవాణాశాఖలో పని చేస్తోన్న ఉన్నతాధికారి అండదండల కారణంగానే ఈ దందా అడ్డుఅదుపు లేకుండా కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. - వాహనదారుడు ఫీజు, యూజర్ చార్జీలతో తాత్కాలిక, శాశ్వత రిజిష్ట్రేషన్‌కు చెల్లించాల్సిన ఫీజు వివరాలు (రూపాయల్లో) వాహనాలు తాత్కాలిక శాశ్వత ద్విచక్రవాహనం 80 395 త్రీ, ఫోర్ వీలర్లు 150 400 లైట్ కమర్షియల్ 200 700 మీడియం గూడ్స్, పాసింజర్ వాహనం 250 635 హెవీ గూడ్స్, పాసింజర్ వాహనం 350 800 రిజిష్ట్రేషన్‌లో ఇలా షోరూముల్లో జరుగుతున్న అదనపు వసూళ్లకు సంబంధించి ద్విచక్ర వాహనాల తాత్కాలిక రిజిష్ట్రేషన్ ఫీజు 80, శాశ్వత రిజిష్ట్రేషన్ ఫీజు 395లను కలుపుకుని రూ. 475లకు వాహనం కొనుగోలు సమయంలో షోరూం సిబ్బందికి చెల్లిస్తే సరిపోతుంది. వాస్తవంలో ఇంతకు రెట్టింపు ముట్టచెప్పాల్సి వస్తోంది. వివిధ వాహనాల షోరూముల్లో ఒక ద్విచక్ర వాహనానికి కనీసం రూ. 800ల నుంచి రూ. 1500ల వరకు వసూలు చేస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు వంటి వాహనాలకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన «ఫీజు కంటే నాలుగు రెట్లు అధికంగా వసూళ్లు చేస్తున్నారని వాహనదారులు తెలుపుతున్నారు. సెక్యూరిటీ దోపిడి హై సెక్యూరిటీ ప్లేట్లకు సంబం«ధించి ప్రభుత్వం నిర్ణయించిన «ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. మాటల గారడీలు చేస్తూ వాహనం కొనుగోలు చేసే వ్యక్తులను తప్పుతోవ పట్టిస్తున్నారు. సరైన కంప్యూటర్ బిల్లు చేతిలో పెట్టకుండా లెటర్ ప్యాడ్‌పై రాసి ఇచ్చే పద్దతిని కొనసాగిస్తున్నారు. ద్విచక్రవానానికి మొత్తం రూ. 245 లు తీసుకోవాల్సి ఉండగా వివిధ షోరూములు నంబర్ ప్లేట్లకు గరిష్టంగా రూ.1100లు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. ఆటోలు, కార్లు , లారీలు వంటి వాహనాలకైతే ఈ వసూళ్లు భారీ స్థాయిలో ఉంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. రవాణాశాఖ నిర్ణయించిన ఫీజులు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ధరలు (రూపాయల్లో). - ద్విచక్రవాహనం 245 - త్రీవీలర్ 282 - లైట్ మోటర్ వాహనాలు 619 (అద్దానికి స్టిక్కర్‌తో సహా) -ఇతర వాహనాలకు ఆద్దాలతో సహా 649 -
సమ్మెలోకి ఏఆర్టీ ఉద్యోగులు
అనంతపురం సిటీ : సర్వజనాస్పత్రిలోని యాంటీరిట్రో వైరల్ థెరపీ(ఏఆర్టీ) సెంటర్లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ నెల 19న దేశ వ్యాప్త సమ్మెలో పాల్గొననున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక ఆస్పత్రి సూపరింటెండెంట్జగన్నాథ్కు వారు వినతి పత్రాన్ని అందజేశారు.