ఒడిషాలో కుప్పకూలిన చార్టర్డ్ విమానం
భువనేశ్వర్: ఒడిషాలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా అందులోని ఆరుగురికి గాయలయ్యాయి. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శనివారం మధ్యాహ్నా సమయంలో రూర్కెలా సమీపంలోని రఘనాథ్పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా.. టేకాఫ్ అయిన 10 కి.మీ. దూరంలో విమానం ప్రమాదానికి గురైంది. సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది. పైలట్ సహా ఆరుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనలో చార్టర్డ్ ఫ్లైట్ ముందు భాగం నుజ్జు అయ్యింది. ప్రమాద గురించి తెలిసి చుట్టుపక్కల ప్రజలు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. తమ ఫోన్లలో ప్రమాదం ఫొటోలను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో పోలీసులు వాళ్లను చెదరగొట్టే ప్రయత్నం చేశారు.ఇంజిన్ ఫెయిల్ కావడంతోనే విమాన ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా స్పందించారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ओडिशा के राउरकेला में चार्टर प्लेन क्रैश, हादसे में 6 लोगों के घायल होने की खबर, इंडिया वन एयर का 9-सीटर चार्टर प्लेन क्रैश#PlaneCrash #Odisha #Rourkela pic.twitter.com/5iGZZf8e8y— Tahir Kamran | طاہرکامران (@TahirBijnori) January 10, 2026