సబ్కా సాత్-సబ్కా వికాస్ నినాదంతో కేంద్ర బడ్జెట్
- స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక(వరల్డ్ ఎకనమిక్ ఫోరం- డబ్ల్యూఈఎఫ్) 44వ ప్రపంచ ఆర్థిక సదస్సు జనవరి 21 నుంచి 25 వరకు జరిగింది.
- జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ జింబాబ్వే జనవరి 29న ప్రకటించింది.
- 2013-14 జీడీపీ అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా అంచనా వేసింది. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది.
- పన్ను చెల్లింపుదారుల్లో విశ్వసనీయతను పెంచి, ఆదాయపన్ను నిబంధనలను క్రమబద్ధీకరించే చర్యల్లో భాగంగా పన్నుల పరిపాలనా సంస్కరణల కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.
- దేశంలో మరో రెండు నూతన బ్యాంకుల ఏర్పాటుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2న సూత్రప్రాయమైన అనుమతిని మంజూరు చేసింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ సంస్థ ఐడీఎఫ్సీ, మైక్రోఫైనాన్స్ సంస్థ బంధన్‌లకు నూతన బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడానికి ఆర్బీఐ అనుమతినిచ్చింది.
- ఐఎంఎఫ్ ఏప్రిల్ 8న విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ ఔట్‌లుక్‌లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2014లో 5.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. కాగా 2014-15లో భారత వృద్ధిరేటు 5.7 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.
- కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ 2014-15 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఏప్రిల్ 9న నియమితులయ్యారు.
- 2011లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని ప్రపంచ బ్యాంకుకు చెందిన ఇంటర్నేషనల్ కంపారిజన్ ప్రోగ్రాం ఏప్రిల్ 30న విడుదల చేసిన నివేదిక తెలిపింది. అమెరికా మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో నిలిచాయి.
- విదేశీ బ్యాంకుల్లో అక్రమంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీసి, స్వదేశానికి తెచ్చేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం మే 27న ప్రకటించింది. ఈ బృందానికి చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.బి.షా, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరిజిత్ పసాయత్ వ్యవహరిస్తారు.
- మన దేశంలో 2013 నాటికి 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది..
- ప్రభుత్వ యాజమాన్యంలోని నమోదిత కంపెనీలన్నింటిలో ప్రజలకు కనీసం 25 శాతం షేర్లు (మినిమమ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్) ఉండాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిర్దేశించింది.
- ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు ప్రతిష్టాత్మక నవరత్న హోదా లభించింది. ఈ రెండు కంపెనీలతో నవరత్న హోదా పొందిన వాటి జాబితా 16 కు చేరింది.
- ఉల్లి, బంగాళాదుంపలను నిత్యావసర వస్తువుల చట్టం 1955 కిందకు తెచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జూలై 2న ఆమోదం తెలిపింది. తద్వారా ఉల్లి, బంగాళాదుంపల లభ్యతను పెంచేందుకు, వాటి ధరల నియంత్రణకు వీలవుతుంది.
- 2011-12లో భారత్‌లో పేదరికం 29.6 శాతం ఉన్నట్లు రంగరాజన్ కమిటీ పేర్కొంది.
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ. 17,94,892 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జూలై 10న లోక్‌సభకు సమర్పించారు. అందరితో కలిసి... అందరి వికాసానికి (సబ్కా సాత్-సబ్కా వికాస్) నినాదంతో రూపొందించిన బడ్జెట్లోని ముఖ్యాంశాలు... ప్రణాళిక వ్యయం రూ.5,75,000, ప్రణాళికేతర వ్యయం రూ.12,19,892 కోట్లు, మొత్తం బడ్జెట్ వ్యయం రూ. 17,94,892 కోట్లు.
- ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2013-14 ఆర్థిక సర్వేను జూలై 9న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ముఖ్యాం శాలు.. జీడీపీ వృద్ధిరేటు 2014-15లో 5.4-5.9 శాతంగా ఉండొచ్చు. ఇది 2015-16లో 7-8 శాతానికి పెరిగే అవకాశం ఉంది. 2014-15లో కరెంట్ ఖాతా
లోటును జీడీపీలో 2.1 శాతానికి పరిమితం చేయాలి.
- ప్రపంచంలో 1.2 బిలియన్ల మంది అత్యంత పేదరికంలో ఉన్నారు. వారిలో మూడోవంతు భారత్‌లోనే ఉన్నారని ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల-2014 నివేదిక పేర్కొంది. భారత్‌లో 1994లో 49.4 శాతంగా ఉన్న పేదరికం 2010 నాటికి 32.7 శాతానికి తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
- టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కంపెనీల విలువ జూలై 23న రూ. 5 లక్షల కోట్లకు చేరుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయగా కంపెనీగా రికార్డు సృష్టించింది.
- రక్షణ రంగంలో 49 శాతం, రైల్వేల్లో కొన్ని విభాగాల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 6న అంగీకరించింది.
- దేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూపు నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో ఎల్ఐసీ, ఎస్బీఐ నిలిచాయి.
- దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
- ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ రూ. 1,000గా నిర్ణయిస్తూ కేంద్రం ఆగస్టు 29న నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే సామాజిక భద్రత పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించింది.
- భారత్ తరపున ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా సుభాష్‌చంద్ర గార్గ్ సెప్టెంబర్ 10న నియమితులయ్యారు. ఆయన రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
- వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రపంచ పోటీ జాబితాలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ 3న
జెనీవాలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొత్తం 144 దేశాలు పోటీపడగా స్విట్జర్లాండ్, సింగపూర్, అమెరికా మొద టి మూడు స్థానాల్లో నిలిచాయి.
- ఓఎన్జీసీ, సీఐఎల్, ఎన్హెచ్పీసీలలో వాటాలను విక్రయించేందుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సెప్టెంబర్ 10న ఆమోదం తెలిపింది. ఈ మూడు కంపెనీల్లో వాటాల విక్రయం వల్ల రూ. 43,800 కోట్లు సమకూరనున్నాయి.
- అపర కుబేరుల (బిలియనీర్) ప్రపంచ జాబితాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సెస్-2014 సెప్టెంబర్ 17న వివరాలను వెల్లడించింది. భారత్‌లో ఈ ఏడాది 100 మంది బిలియనీర్లు ఉన్నట్లు తేల్చింది.
- చిన్న ిపిల్లలు సొంతంగా బ్యాంకు ఖాతాల నిర్వహణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంకులు సెప్టెంబర్ 24న అనుమతించాయి. పదేళ్లు వయసు దాటిన వారికి ఈ సదుపాయాన్ని కల్పించారు.
- మేక్ ఇన్ ఇండియా ప్రచార కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25న న్యూఢిల్లీలో ప్రారంభించారు. భారత దేశాన్ని అంతర్జాతీయ ఉత్పత్తి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
- పన్నులకు సంబంధించిన కేసులను పరిష్కరించేందుకు జాతీయ పన్ను ట్రైబ్యునల్ చట్టాన్ని ఏర్పాటు చేస్తూ
2005లో పార్లమెంట్ ఆమోదించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 25న తీర్పునిచ్చింది.
- ఫోర్బ్స్ విడుదల చేసిన 2014 భారత కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సారథి ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. సన్ ఫార్మాస్యూటికల్ అధిపతి దిలీప్ సంఘ్వి రెండో స్థానం, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ మూడోస్థానం దక్కించుకున్నారు.
- ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 55వ స్థానం దక్కింది. ప్రపంచ ఆర్థిక వేదిక-2014 లింగ అసమానత్వ సూచీలో భారత్ 114 వ స్థానంలో నిలిచింది.
- ప్రముఖ ఆర్థిక వేత్త అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అక్టోబరు 16న బాధ్యతలు చేపట్టారు.
- యూరోమనీ మ్యాగజైన్ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును వాషింగ్టన్లో అక్టోబరు 10న భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు.
- ఏిషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఎఐఐబీ) అక్టోబరు 24న బీజింగ్ కేంద్రంగా ఏర్పాటైంది. ఎఐఐబీ 2015 నుంచి పనిచేస్తుంది.
- డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం అక్టోబరు 18న నిర్ణయం తీసుకుంది.
- పని చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే దేశాల్లో భారత్ 18వ స్థానంలో నిలిచింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు అక్టోబరు 6న విడుదల చేసిన నివేదికలో అమెరికా మొదటి స్థానంలో, రెండు మూడు స్థానాల్లో బ్రిటన్, కెనడా ఉన్నాయి.
- 2014-15లో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంటుందని ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ పేరుతో అక్టోబరు 27న విడుదల చేసిన నివేదికలో ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఈ వృద్ధి రేటు 2015-16లో 6.4 శాతం,
2016-17లో 7 శాతం ఉండొచ్చని అంచనా వేసింది.
- ప్రపంచ బ్యాంకు అక్టోబరు 29న విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 142వ స్థానంలో నిలిచింది. సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
- ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు చైర్‌పర్సన్‌గా అనితా
కపూర్ నవంబరు 5న నియమితులయ్యారు.
- ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన మాజీ ఉద్యోగులు పింఛను పొందేందుకు ఉద్దేశించిన జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ నవంబరు 10న న్యూఢిల్లీలో ప్రారంభించారు.
- 2014కు సంబంధించి దేశంలో అధిక ఆదాయం పొందుతున్న సంస్థలతో రూపొందించిన ‘ఫార్చ్యూన్ 500 జాబితా’ను ఫార్చ్యూన్ ఇండియా డిసెంబర్ 14న విడుదల చేసింది. ఇందులో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రథమ స్థానంలో నిలిచింది. రిలయన్స్ రెండు, భారత్ పెట్రోలియం మూడో స్థానంలో ఉన్నాయి.
- టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు నవంబర్‌లో సున్నాగా నమోదైంది. అంటే 2013 నవంబర్‌లో ఉన్న స్థాయిలోనే 2014 నవంబర్‌లో కూడా టోకు ధరలు ఉన్నట్లు. గత ఐదున్నరేళ్లలో ఇదే కనిష్టం.
- వ్యాపారానికి అనుకూల దేశాలకు సంబంధించి ఫోర్బ్స్ విడుదల చేసిన 9వ వార్షిక ర్యాంకింగ్స్‌లో డెన్మార్క్ మొదటి స్థానంలో ఉంది. హాంకాంగ్, న్యూజిలాండ్‌లు రెండు, మూడో స్థానాలను దక్కించుకున్నాయి. ఈ జాబితాలో భారత్ 93వ స్థానంలో నిలిచింది.
- వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ డిసెంబర్ 20న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రవేశపన్ను, ఆక్ట్రాయ్, సేవా పన్ను వంటి అనేక పన్నులు ప్రత్యేకంగా లేకుండా ఒకటే పన్ను విధానాన్ని 2016, ఏప్రిల్ నుంచి అమలు చేసే లక్ష్యంతో ఈ బిల్లును రూపొందించారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా దీన్ని తీసుకొచ్చారు.
- బొగ్గు గనులు, బీమా రంగానికి సంబంధించిన రెండు ఆర్డినెన్సులపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్ 26న సంతకాలు చేశారు. దీంతో బీమా రంగంలో మరింతగా విదేశీ పెట్టుబడుల రాకకు వీలు కానుంది. అలాగే సుప్రీం కోర్టు గతంలో రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి కేటాయించేందుకూ సాధ్యపడనుంది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి
కార్యక్రమం (యూఎన్డీపీ) మానవాభివృద్ధి నివేదిక-2013ను జూలై 24న విడుదల చేసింది. 187 దేశాల ఈ జాబితాలో భారత్ 135వ స్థానంలో నిలిచింది. కాగా తొలి మూడు స్థానాల్లో నార్వే, ఆస్ట్ట్రేలియా, స్విట్జర్లాండ్‌లు ఉన్నాయి. వీసా, మాస్టర్ కార్డ్‌ల లాంటి చెల్లింపులకు ఉపయోగించే రూపే కార్డును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మే 8న ఆవిష్కరించారు. భారత సొంత చె ల్లింపుల గేట్‌వే రుపేను నేషనల్ సిమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేసింది.