breaking news
Rotary Club District Governor
-
తెలుగు రాష్ట్రాలలోని వరద భాదిత కుటుంబాలకు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం
తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు సాయం అందించేందుకు రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయి. తెలంగాణాలో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలు , ఆంధ్రప్రదేశ్ విజయవాడకు దిగువ తీరాన తెనాలి -రేపల్లె ఏరియాలో ఉన్న కొన్ని గ్రామాలలో పూర్తిగా నిరాశ్రయులైన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్‌లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఈ వరద ప్రమాదం సంభవించిన వెంటనే గత ఐదు రోజులుగా ఖమ్మం, భద్రాచలం, గుంటూరు, ప్రకాశం, జిల్లాలోని రోటరీ క్లబ్‌లు అన్ని కలిసి 'ఆత్మబంధువు' అనే ప్రాజెక్ట్ పేరున దాదాపు 50 లక్షల రూపాయలు విలువ చేసే వంట సామాను కిట్స్‌ని ఖమ్మం జిల్లాల్లలోని గ్రామాల్లో 2500 మందికి, అలాగే తెనాలి-రేపల్లె ఏరియాలోని గ్రామాల్లో 1500 వరద బాధితులుకు అందజేశామని తెలిపారు. గత మూడు రోజులుగా ఖమ్మం రోటరీ క్లబ వారు మల్లాది వాసుదేవ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్యాకెట్లో 5 కేజీల రైస్ ప్యాకెట్, బొంబాయి రవ్వ, 1 లీటరు వంట నూనె, 1/2 కేజీ చింతపండు, కందిపప్పు, ఉల్లిపాయలు, ఇతర దినుసులను ఒక కుటుంబానికి సరిపోయేలా అందజేశామని తెలిపారు. అదేవిధంగా పిగురాళ్ల రోటరీ క్లబ్ వారు డాక్టర్ విష్ణు బాబు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రాంతంలో పంచటానికి సుమారు 2500 కుటుంబాలకు వంట సామాను పాకెట్స్‌ని రెడీ చేస్తున్నట్లు తెలిపారు. ]అలాగే అన్ని చోట్ల రోటరియన్స్ ఎంతో శ్రమపడి వరద బాధిత కుటుంబాలని గుర్తించి నేరుగా వారికి సహాయం అందే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గత ఆదివారం సెప్టంబర్ 8న రేపల్లె ఏరియా గ్రామాలలో వంట సామను కిట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ విపత్తుపై స్పందించి ధన సహాయం, వస్తు సహాయం చేస్తున్న రోటరియన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి.(చదవండి: రండి వరద బాధితులను ఆదుకుందాం!) -
సర్కారీ బడులకు 25 వేల బెంచీలు
ఒకేరోజు అందించనున్న రోటరీ క్లబ్ గిన్నిస్ బుక్‌లోకి ఎక్కే అవకాశం హైదరాబాద్: 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఒకేరోజు తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 25 వేల బెంచీలు పంపిణీ చేసి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకోబోతున్నామని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ (3150) మల్లాది వాసుదేవ్ తెలిపారు. ఆయన ఆది వారం ఫిలించాంబర్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ స్నేహం ద్వారా సేవ అన్న నినాదంతో తాము రోటరీ సేవలను విస్తృతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 65 వేల బెంచీలు సరఫరా చేశామన్నారు. రోటరీ క్లబ్‌లు కొన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల్లో విద్యార్థులకు మంచినీటిని అందించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు స్కూల్ డ్రెస్‌లు, షూస్ కూడా పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ హరిప్రసాద్, జాయింట్ సెక్రటరీ శేషసాయి కుమార్, కమల్ కన్నన్, రాజేష్మింది పాల్గొన్నారు.