breaking news
romantic relations
-
‘ఆ బంధాలు సునిశితం’
సాక్షి,ముంబయి: రొమాంటిక్ అనుబంధాలు సునిశితమైనవని, భాగస్వామి విజయాలు, అభిరుచులను అర్థం చేసుకునే వారు దొరకడం కష్టమని బాలీవుడ్ భామ దీపికా పడుకోన్ అన్నారు.ఇండస్ర్టీలో నెంబర్ వన్ స్ధానాన్ని కాపాడుకోవడం అంత సులభం కాదన్నారు. కాలంతో్ పాటు తన వ్యక్తిగత బాంధవ్యాలు కొన్ని బలపడ్డాయని, అయితే ఈ ప్రయాణంలో కొందరు స్నేహితులు తనకు దూరమయ్యారని చెప్పారు. స్కూలు స్నేహితులు కొందరితో తానిప్పటికీ టచ్‌లో ఉంటానని చెప్పుకొచ్చారు. కొందరు తనకు వచ్చిన విజయాలతో తనను సరిగ్గా బేరీజు వేయలేక దూరమయ్యారని, వీటిని జీవితంలో భాగంగానే తాను చూశానని, తనను అర్ధం చేసుకున్న వారు మాత్రం తనతోనే ఉన్నారని దీపికా అన్నారు. హేమమాలిని బయోగ్రఫీ ‘హేమమాలి: బియాండ్ ది డ్రీమ్ గర్ల్’ ఆవిష్కరణ సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. స్టార్డమ్, త్యాగం ఒకదాని వెంట ఒకటి ఉంటాయని, తమ లక్ష్యాలను సాకారం చేసుకునేందుకు అంకిత భావంతో ముందుకెళ్లాలని అన్నారు. తాను కాలేజ్‌కు వెళ్లలేకపోయాయని, కేవలం ఇంటర్ మాత్రమే పూర్తిచేయగలిగానని కెరీర్ తొలినాళ్ల గురించి గుర్తుచేసుకున్నారు. మోడల్‌గా బిజీగా ఉండటంతో బెంగుళూర్ నుంచి తరచూ ఢిల్లీ, ముంబయి వెళ్లాల్సివచ్చేదన్నారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తిచేద్దామని ప్రయత్నించినా కుదరలేదని, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కూడా వర్కవుట్ కాలేదన్నారు. దీంతో తన చదువుపై తల్లితండ్రుల నుంచి బోలెడు ఫిర్యాదులు ఎదురయ్యేవని అన్నారు. -
సొమ్మును బట్టే సంసార బంధం
అందమైన అమ్మాయి.. హేండ్సమ్ కుర్రాడు.. మనసులు కలిశాయి.. కానీ ఆ బంధం మాత్రం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. ఎందుకంటే, అవతలివాళ్ల దగ్గర సొమ్ములు నిల్ అని తేలిపోయింది. అవును, ఇప్పుడు చాలావరకు సంబంధాలు ఆర్థిక స్థోమతను బట్టే ఆధారపడి ఉంటున్నాయట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇద్దరు మనుషులు కలవాలంటే అవతలివాళ్లు ఎంత ధనవంతులు అన్నదే ప్రధానంగా చూస్తున్నారట. ఇద్దరి మధ్య బాగా అవగాహన ఉంటే బాగుంటుందని ఇంతకుముందు అనుకునేవాళ్లని, కానీ ఇప్పుడు మాత్రం డబ్బుకు ప్రాధాన్యం బాగా ఎక్కువ ఇస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రొమాంటిక్ సంబంధాలు కూడా దీనిమీదే ఆధారపడుతున్నాయని అంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ప్రొఫెసర్ డారియస్ చాన్ దీనిపై తమ పరిశోధన వివరాలను వెల్లడించారు. ఇందుకోసం చైనాలోని కాలేజి విద్యార్థులను రెండు గ్రూపులుగా చేసి పరిశోధన చేశారు. అప్పటికే దీర్ఘకాలిక లైంగిక సంబంధాలు ఉన్నవారిని ఇందుకోసం ఎంపిక చేసుకున్నారు. ఒక గ్రూపు వారిని బాగా డబ్బుందని అనుకోవాలని, మరో గ్రూపువారిని బాగా పేదలు అనుకోవాలని చెప్పారు. బాగా ధనవంతులమని అనుకున్న కుర్రాళ్లు, తమ భాగస్వామి శారీరక అందంతో అంతగా సంతృప్తి చెందలేదట. వాళ్లతో సంబంధాలను తక్కువ కాలమే కొనసాగించాలని అనుకున్నారట. తాము ధనవంతులమని అనుకున్న అమ్మాయిలు కూడా అబ్బాయిల శారీరక లక్షణాలకు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదట. అదే అటూ ఇటూ కూడా ధనవంతులమని అనుకున్న వాళ్లలో మాత్రం అవతలి వాళ్ల మీద ఆకర్షణ చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బాగా డబ్బున్న అమ్మాయిలు తమ భాగస్వామి శారీరక ఆకర్షణకు ప్రాధాన్యం ఇచ్చారని, అయితే డబ్బు తక్కువగా ఉంటే మాత్రం వాళ్లతో స్వల్పకాలిక సంబంధాలనే కోరుకున్నారని చెప్పారు.