breaking news
Robo-2
-
కన్ఫర్మ్: ‘కాలా’ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరి 2.0?
ఊహించినట్టుగానే ‘కాలా’ ముందుకు జరిగాడు. 2.0 (రోబో-2) వెనుకడుగు వేశాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా సినిమా ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత, రజనీ అల్లుడు ధనుష్ శనివారం అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీతో కూడిన ‘కాలా’ పోస్టర్లు రిలీజ్ చేశారు. నిజానికి ఏప్రిల్ 27న శంకర్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 2.0 సినిమా విడుదల కావాల్సి ఉంది. మొదట గత ఏడాది దీపావళిలో ఈ సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. తీరా గణతంత్ర దినోత్సవానికి వాయిదా వేసి.. అప్పటికీ కుదరకపోవడంతో ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు తెస్తామని ప్రకటించారు. తాజా రూమర్ల ప్రకారం ఏప్రిల్‌లోనూ ఈ సినిమా వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. దీనికితోడు 2.0 విడుదల తేదీగా భావిస్తున్న ఏప్రిల్ 27న ‘కాలా’ వస్తుండటంతో మరోసారి శంకర్ సినిమా వాయిదా ఖాయమని వినిపిస్తోంది. పా. రంజిత్ దర్శకత్వంలో సంచలన విజయం సాధించిన ‘కబాలి’ సినిమాకు సీక్వెల్‌గా ’కాలా’ రూపొందింది. ఈ సినిమాలో ముంబై గ్యాంగ్‌స్టర్‌గా రజనీ నటిస్తున్నాడు. ఈ సినిమాలో నానాపటేకర్, హ్యూమా ఖురేషీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు రజనీకాంత్, అక్షయ్‌కుమార్ కీలక పాత్రల్లో ‘రోబో’ సినిమాకు సీక్వెల్‌గా రూ. 400 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా శంకర్ ‘2.0’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. -
రాజమౌళికి సవాల్ విసరబోతున్న శంకర్
-
సౌత్మూవీలో విలన్‌గా షారుక్..?
-
రోబో-2 విలన్‌గా అమీర్‌ఖాన్!
రజనీకాంత్ నటించిన ‘రోబో’కు సీక్వెల్‌గా దర్శకుడు శంకర్ ‘రోబో-2’ నిర్మాణానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ఇందులో విలన్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ‘రోబో-2’లో కూడా రజనీకాంత్ సరసన హీరోయిన్ ఐశ్వర్యారాయ్ నటించనుంది. అయితే, విలన్ పాత్రపై అమీర్ ఆసక్తి చూపుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.