breaking news
road accident in jammalamadugu
-
డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి
-
డివైడర్ను ఢీకొట్టిన కారు : ముగ్గురి మృతి
జమ్మలమడుగు : వైఎస్సార్జిల్లాలో జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మలమడుగు పాతబస్టాండ్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. తాడిపత్రి నుంచి వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగ్రాతులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మృతులను జమ్మలమడుగుకు చెందిన అశ్వద్ధామ, గోవర్ధన్, తులసీరామ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.