breaking news
r.mallikarjuna rao
-
వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్), న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు బీసీ స్టడీసర్కిల్ సెంటర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సర్కిల్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ. లక్ష లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతోపాటు స్టడీ మెటీరియల్, స్టయిపెండ్ అందిస్తామని తెలిపారు. వివరాలకు ఏలూరు సెయింట్ ఆన్స్ కళాశాల సమీపంలోని ఆంధ్రాబ్యాంక్ ఎదుట ఉన్న బీసీ స్టడీ సెంటర్లో గాని, 08812 232477 నంబర్‌లోగాని సంప్రదించాలని మల్లికార్జునరావు సూచించారు. -
ఎస్సీ, ఎస్టీలకు విదేశీ విద్య
చింతలపూడి, న్యూస్‌లైన్: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు విదేశీ విద్యను అందించనున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డెరైక్టర్ ఆర్.మల్లికార్జునరావు తెలిపారు. చింతలపూడి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విదేశీ కళాశాలల్లో ఇంజినీరింగ్, మెడిసిన్, ఫార్మసీ కోర్సుల ప్రవేశం కోసం దరఖాస్తు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణం అందించే అవకాశం ఉందన్నా రు. అవసరమైతే మరో రూ.5 లక్షలు అందజేస్తామని చెప్పా రు. పథకంలో భాగంగా రాష్ట్రంలో ఈ ఏడాది 500 మంది విద్యార్థులను విదేశాలకు పంపారన్నారు. రూ. 2 లక్షల సంవత్సర ఆదాయం ఉన్న కుటుంబాల్లోని విద్యార్థులు పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జిల్లా నుంచి ఈ ఏడాది ఇద్దరు విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జిల్లాకు నాలుగు కళాశాల హాస్టళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు చెందిన 1,022 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో వీరికి స్టడీ క్యాంపుల నిర్వహణ ఆలస్యమైందని.. వచ్చేనెల మొదటి వారంలోపు క్యాంపులు ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలిపారు. వసతి గృహాల మరమ్మత్తులకు జిల్లాలో రూ.4.70 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. ఈ నిధుల్లో రూ. 2.70 కోట్లు మరమ్మత్తులకు, మిగిలినవి మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణానికి ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఏఎస్‌డబ్ల్యువో జీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.