breaking news
riyaz bathkal
-
దశాబ్దం తర్వాత శిక్షలు
హైదరాబాద్‌తోపాటు దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతి పరిచిన గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులు అనిక్ షఫీక్ సయీద్, మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌కు ఉరిశిక్ష విధిస్తూ సోమవారం ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఇదే కేసులో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న రియాజ్ భత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ భత్కల్‌లకు ఆశ్రయమిచ్చిన మరో నింది తుడు తారిక్ అంజుమ్‌కు యావజ్జీవ శిక్ష విధించింది. మరో ఇద్దరు నిందితులు నిర్దోషులని న్యాయ స్థానం ప్రకటించింది. 44మంది అమాయకులను పొట్టనబెట్టుకుని, 77మందిని తీవ్రంగా గాయపరి చిన ఈ జంట పేలుళ్ల ఉదంతాలు జరిగి పదకొండేళ్లు దాటింది. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాదులు మహారాష్ట్రలోని పుణేలో ఈ దారుణానికి పథక రచన చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దిల్‌సుఖ్‌నగర్‌లో సైతం బాంబు పేలుడుకు కుట్ర పన్నినా అదృష్టవశాత్తూ బాంబుకున్న టైమర్ సరిగా పనిచేయకపోవడంతో అక్కడ పెను విషాదం తప్పింది. ఇప్పుడు దోషులిద్దరికీ పడిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. అక్కడ వచ్చే ఫలితాన్నిబట్టి రాజ్యాంగం ప్రకారం వారికి ఇతరత్రా మార్గాలు అందుబాటులో ఉంటాయి. చివరికి ఏం జరుగుతుందన్న సంగతి అలా ఉంచి ఈ పేలుళ్ల కేసు దర్యాప్తులో ఎడతెగని జాప్యం చోటు చేసుకున్న తీరు మన పోలీసు యంత్రాం గం సమర్ధతను ప్రశ్నిస్తుంది. ఏమాత్రం సంబంధం లేని అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవలం ఉన్మాదంతో ఇంత దారుణానికి ఒడిగట్టినవారిని వెన్నాడి సత్వరం పట్టుకోగలిగితే, వారిపై పకడ్బందీ సాక్ష్యాధారాలతో కేసులు పెట్టగలిగితే న్యాయస్థానాల పని సులువవుతుంది. అక్కడ కూడా త్వరగా విచారణ ముగిసి శిక్షలు పడతాయి. అది నేరగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. అలాంటి నేరం చేయ డానికి మరెవరూ సాహసించరు. ఉగ్రవాద ముఠాల ఆట కడుతుంది. విషాదమేమంటే ఇవన్నీ సక్ర మంగా సాగటం లేదు. ఈ జంట పేలుళ్ల కేసులో దాదాపు వందమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎన్నో నెలలపాటు కాస్తయినా పురోగతి సాధించలేక పోయింది. ఈలోగా రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ దేశం సరిహద్దులు దాటి పాకిస్తాన్ పరారయ్యారు. ఈ జంట పేలుళ్ల ఉదంతాలు ఎందరికో గర్భశోకం మిగిల్చాయి. ఆప్తులను పోగొట్టుకున్నవారు, అనాథలైనవారు ఎందరో! సజావుగా బతుకుబండి ఈడుస్తున్నవారూ, జీవితంలో ఒక స్థాయికి ఎది గివచ్చిన పిల్లలు, మరికొన్ని రోజుల్లో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లదల్చుకున్నవారు... ఇలా ఎందరెందరో ఈ పేలుళ్లకు బలయ్యారు. లుంబినీ పార్క్‌లో లేజర్ షో చూడటానికొచ్చినవారు, గోకుల్‌చాట్‌లో అల్పాహారం తిందామని వచ్చినవారితోపాటు ఆ రోడ్డు పక్కనుంచి నడిచి వెళ్తున్న వారు సైతం పేలుళ్లకు బలయ్యారు. ఈ ఉదంతాల్లో గాయపడిన కుటుంబాలవారిది మరో రకం విషాదం. నిన్నటివరకూ ఎంతో చురుగ్గా, సమర్ధవంతంగా పనిచేస్తూ తలలో నాలుకలా మెలగిన వారు శాశ్వత అంగవైకల్యంతో, కదల్లేని స్థితిలో, అయినవారిని గుర్తుపట్టలేని స్థితిలో పడటం తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ కుటుంబాలు తమవారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలన్న ఆశతో లక్షలాది రూపాయలు వెచ్చించాయి. ఎన్నో కుటుంబాలు ఆ క్రమంలో ఉన్న ఆస్తుల్ని కూడా పోగొట్టుకున్నాయి. అప్పులపాలయ్యాయి. కొందరు క్షతగాత్రులు తాము కూడా చనిపోయి ఉంటే బాగుండేదని వివిధ చానెళ్ల ముందు వాపోయారంటే వారు పడిన కష్టాలు ఎటువంటివో అర్ధమ వుతుంది. ఆ కుటుంబాలు చెబుతున్న ప్రకారం వారికి ప్రభుత్వాల నుంచి కూడా తగిన ఆసరా లభిం చటం లేదు. ఇది అత్యంత ఘోరం. ఉగ్రవాదుల ఉద్దేశం ప్రజల్లో భయోత్పాతం సృష్టించి, సమాజాన్ని కల్లోలపరచడం. ప్రభు త్వాలు ఇలాంటి ఉన్మాద ముఠాల కార్యకలాపాల గురించి, వారి పోకడల గురించి ప్రజల్లో అవ గాహన కల్పించటంతోపాటు పటì ష్టమైన నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఉగ్రవాదుల ఎత్తుగడలు విఫలమవుతాయి. పేలుళ్ల కోసం ఉగ్రవాదులు సాధారణంగా జనసమ్మర్థంగల ప్రాంతా లను ఎంచుకుంటారు. కనుక అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా అవసరమవుతుంది. హైదరాబాద్ నగరంలో దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడుసార్లు లక్ష్యంగా ఎంచుకుంటే 2002, 2007 సంవత్సరాల్లో ఏదో ఒక కారణం వల్ల వారు విఫలమయ్యారు. కానీ 2013లో అక్కడ రెండు బాంబులు పేలి 17మంది చనిపోయారు. 130 మందికిపైగా గాయపడ్డారు. ఆ ఘటన తర్వాత తాము ముందస్తు హెచ్చరికలు చేశామని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ప్రభుత్వ యంత్రాం గాల్లో కనబడే ఇటువంటి నిర్లక్ష్యమే నేరగాళ్లకు వరమవుతోంది. ఉగ్రవాదులు ఏదీ చెప్పి చేయరు. కానీ ప్రభుత్వ యంత్రాంగంతోపాటు జనంలో కూడా తగినంత అప్రమత్తత ఉంటే వీరి కుట్రలను వమ్ము చేయటం ఎంతో సులభం. సమాజంలో అరాచకం ప్రబలకుండా, సంక్షోభాలు తలెత్తకుండా, అమాయకుల ప్రాణాలు బలికాకుండా చూడటం రాజ్యం మౌలిక బాధ్యత. తమకు రక్షణ లభిస్తుం దని, తమ జీవనం సజావుగా సాగుతుందని ఆశించే పౌరుల్లో ఉగ్రవాద ఉదంతాలు అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆ దుస్థితి తలెత్తకుండా ఉండాలంటే రెప్పవాల్చని నిఘా అవసరం. లుంబినీ పార్క్ పేలుళ్ల ఉదంతంలో ఒక ఉగ్రవాది బ్యాగ్‌తో పాటు వచ్చి కూర్చోవటం, దాన్ని అక్కడ వదిలి వెళ్లడం యాదృచ్ఛికంగా ఒక విద్యార్థి గమనించి పేలుళ్ల తర్వాత అతగాడి రూపురేఖలపై సమాచారమిచ్చాడు. మరికొందరు సాక్షులు కూడా నిందితులను గుర్తుపట్టగలిగారు. కనుకనే ఇప్పుడీ శిక్షలు సాధ్యమయ్యాయి. ఈ పేలుళ్ల ఉదంతం నుంచి తగిన గుణపాఠాలు తీసుకుని మరె ప్పుడూ ఇలాంటివి జరగకుండా చూడటమే ప్రాణాలు కోల్పోయినవారికి నిజమైన నివాళి అవు తుంది. క్షతగాత్రులైనవారి కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుని, ఆ కుటుంబాల్లో అర్హులైన వారికి ఉపాధి కల్పించటం తమ బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. వారికి అన్నివిధాలా ఆసరాగా నిలబడాలి. -
పరారీలోనే ప్రధాన సూత్రదారి
సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్... గోకుల్‌చాట్, లుంబినీపార్క్ పేలుళ్లకు సూత్రధారిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతడి పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం చేశాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) గుట్టు బయటపడటం వెనుకా ఇతని ‘పాత్ర’ ఉంది. 2007 ఆగస్టు 25 నాటి ఆ జంట పేలుళ్లకు తొమ్మిదేళ్లు పూరై్తన నేపథ్యంలో ఇప్పటికీ పరారీలోనే ఉన్న ఈ గజ ఉగ్రవాది నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... ముంబైలో మొదలైన ‘ప్రస్థానం’... రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే రియాజ్ భత్కల్ నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు ముంబైలో నివసించింది. మొదటి నుంచి డబ్బుపై యావ ఎక్కువ ఉన్న ఇతగాడు ఈ నేపథ్యంలోనే ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు వంటివి చేసి డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కత, ముంబై, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగ్ నుంచి బయటకు వచ్చి కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రార్థనా స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ ప్రోద్భలంతో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరేతొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్‌చార్‌్జగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజా ఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు సమకూరుస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారుల కిడ్నాప్‌కు కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా రూపంలో భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేశాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్చార్జ్ హోదాలో ఉండటంతో నిధులుపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యూల్‌లోని ఎవరూ చేయలేకపోయారు. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే... ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. దీనిని మరో ఉగ్రవాది సాదిక్ షేక్ వ్యతిరేకించాడు. ఇలా చేయడం వల్ల తమ ఉనికి బయటపడి, దర్యాప్తు అధికారులకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు భారీగా వస్తాయని సాదిక్‌తో వాదించాడు. తన పంతం నెగ్గించుకొని ప్రతీ విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపేవాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురటై్టంది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లిన రియాజ్.. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్నాడు. జంట పేలుళ్లులో ఇదీ పాత్ర.... మహారాష్ట్రలోని పూణేకు చెందిన మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్‌చౌదరి, అనీఖ్ షపీఖ్ సయ్యద్‌లు మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు 2007 జూలైలో హైదరాబాద్ వచ్చారు. అదే ఏడాది జూలై, ఆగస్టుల్లో రియాజ్ అనేకసార్లు నగరానికి వచ్చి వెళ్లాడు. అక్బర్, అనీఖ్లు తమ ‘టార్గెట్’ను ఎంచుకొని ముంబైలో ఉన్న రియాజ్ భత్కల్‌కు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్ పేలుళ్లకు కొన్ని రోజుల ముందు ముంబైలో జరిగిన సమావేశంలో ఇండియన్ ముజాహిదీన్ మాస్టర్‌మైండ్ గా భావించే రియాజ్ భత్కల్, సాదిక్ షేక్‌లతో పాటు అన్సార్ అహ్మద్ బాద్షా షేక్ కూడా పాల్గొన్నాడు. ప్రణాళిక మొత్తం సిద్ధమయ్యాక ఆగస్టు 23న భత్కల్ నగరానికి వచ్చాడు. అప్పటికే పార్సిల్లో పంపిన బాంబులను అసెంబుల్ చేశాడు. చివరకు ఆగస్టు 25న రియాజ్ భత్కల్ గోకుల్‌ఛాట్‌లో, అనీఖ్ షఫీఖ్ సయ్యద్ లుంబినీపార్క్‌లో బాంబులు అమర్చగా... మహమ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరి దిల్‌షుక్‌నగర్‌లో బాంబు పెట్టాడు. మొదటి రెండూ పేలగా... మూడోది పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.