breaking news
Retired paramilitary forces
-
ఓఆర్ఓపీ అమలు కోసం నేడు ధర్నా
-
ఓఆర్ఓపీ అమలు కోసం నేడు ధర్నా
న్యూఢిల్లీ: ‘ఒకే ర్యాంకు ఒకే పెన్షన్’ (ఓఆర్ఓపీ) అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, పారామిలటరీకి ప్రత్యేక చెల్లింపులు చేయాలనే డిమాండ్లతో రిటైర్డ్ పారామిలటరీ దళాలు సోమవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగనున్నాయి. దీంతో పాటు పార్లమెంట్ వరకు మార్చ్ నిర్వహించి నిరసన తెలుపనున్నాయి. అనంతరం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన పత్రాన్ని అందించనున్నాయి. సైనికులకి సరైన ఆహారం అందించట్లేదని వీడియో పోస్ట్ చేసి వార్తల్లోకెక్కిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ తన కుటుంబంతో కలసి ఈ ధర్నాలో పాల్గొననున్నారని అధికారులు తెలిపారు.