breaking news
retd ias
-
'చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదు'
విశాఖపట్నం : స్విస్ ఛాలెంజ్ విధానం చాలా అభ్యంతరకరమైనదని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. బుధవారం విశాఖపట్నంలో ఈఏఎస్ శర్మ మాట్లాడుతూ... రాజధాని కోసం రైతుల నుంచి భూములు తీసుకుని.. విదేశీ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియంకు ఇస్తున్నారని ఆరోపించారు. భూములకు సంబంధించి ఎవరెవరితో ఒప్పందాలు చేసుకున్నారో బయటపెట్టాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ వెబ్సైట్లలోనూ ఎక్కడా ఒప్పందాల్లోని వివరాలు లేవని ఈఏఎస్ శర్మ గుర్తు చేశారు. ప్రభుత్వానికి కనీసం 51 శాతం ఉంటేనే... స్విజ్ చాలెంజ్ విధానాన్ని ఉపయోగించాలని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రభుత్వానికి 51 శాతం లేకుంటే... ఏపీ మౌలిక సదుపాయాల కల్పన చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందన్నారు. ఓ వేళ కోర్టు కొట్టేసినా... పరిహారం కింద నగదు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా ప్రజాహిత చర్యలు కాని... విధానాలు కాని లేవన్నారు. సింగపూర్ కంపెనీలకు ఎలాగోలా లాభాం చేకూర్చే విధానాలే కనిపిస్తున్నాయని ఈఏఎస్ శర్మ తెలిపారు. స్విస్ ఛాలెంజ్‌కు చీఫ్ సెక్రటరీ ఎలా ఒప్పుకున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రే నేరుగా సంప్రదింపులు జరపడం సరికాదని ఈఏఎస్ శర్మ అభిప్రాయపడ్డారు. -
ఉడకని మెతుకులు చెబుతున్న ఊసులు
ఆయన నక్సలైటు కాదు. కానీ పోరాడాడు. కలెక్టర్‌గా ఉంటూ వర్గపోరాటం చేశాడు. ఈమాట ప్రజలకైతే పొగడ్తే కానీ, ప్రభుత్వం దృష్టిలో వర్గపోరాటం తీవ్రవాదులు చేసేది. కానీ కేఆర్ వేణుగోపాల్ గారిపై ప్రభుత్వం ఈ అభియోగం మోపింది- కలెక్టర్ వర్గపోరాటం చేస్తున్నాడని. అంబేడ్కర్‌తో స్ఫూర్తి నొంది, అణగారిన వర్గాల పక్షపాతిగా నిలిచిన వేణుగోపాల్ నాడూ నేడూ అదే పోరాటం కొనసాగిస్తున్నారు. ఈ రోజు అదే పేద ప్రజల కోసం ఉడకని మెతుకులు ఏరుకుంటూ బాలింతలకు, చిన్నారులకు నాలుగన్నం మెతుకులు పెట్టండహో అంటూ అక్షరం అక్షరం అభ్యర్థిస్తున్నాడు. కేఆర్ వేణుగోపాల్ సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్ మెంట్ సర్వీసెస్) అమలు తీరుతెన్నులపై రాసిన ‘ఉడకని మెతుకు’ పుస్తకావిష్కరణ సభ సందర్భంగా సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూ. ప్రశ్న: ముగ్గురు ప్రధానులు- చంద్రశేఖర్, వి.పి.సింగ్, పి.వి. నరసింహారావుల దగ్గర కార్యదర్శిగా పనిచేసిన అనుభవం, దేశ ప్రతినిధి వర్గానికి ఐక్యరాజ్యసమితిలో నేతృత్వం, కశ్మీర్ సమస్యలో ప్రత్యేకదూత... వాటిలో మీకు అత్యంత ఆనం దాన్నిచ్చే అంశం? జవాబు: వీపీ సింగ్ లాంటి గొప్ప ప్రధానుల దగ్గర పనిచేయ డం నాకు ఆనందదాయకం. అయితే ప్రజలకు నిరంతరం మేలు చేసే గొప్ప పథకం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసీడీఎస్‌కి అంకురార్పణే నాకు అత్యంత ఆనందా న్నిచ్చిన అంశం. ఈ దేశంలో దీని కన్నా గొప్ప పథకం మరొక టుంటుందని నేను భావించడం లేదు. ఆరోగ్యవంతమైన భావిభారత పౌరుల కోసం నిర్దేశించిన పథకం ఇది. గర్భి ణులు, బాలింతలు, శిశువులకు పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించడమే ఈ పథకం రూపకల్పనకి ప్రధాన కారణం. 1970-72 ప్రాంతంలోనే దుర్గాబాయ్ దేశ్ ముఖ్ తెలంగాణలోని మహబూబ్ నగర్లో పైలట్ ప్రాజె క్టుగా దీన్ని మొదట ప్రవేశపెట్టారు. ఆ తరువాత 1975లో ఇందిరాగాంధీ మొత్తం దేశంలోని 33 బ్లాకుల్లో దీన్ని ఆచర ణలో పెట్టారు. ప్రశ్న: ‘ఉడకని మెతుకు’ రాయడానికి ప్రేరేపించిన అంశాలేవి? జవాబు: గర్భిణులు పౌష్టికాహారం తీసుకోపోతే అంగవైకల్యం కలిగి, అనారోగ్యకరమైన తరం జన్మిస్తుంది. పిల్లలే దేశ భవిష్యత్తు. దురదృష్టవశాత్తూ ఈ పథకం చచ్చిపోయింది. పథకం అమలు తీరుతెన్నులు పరిశీలించేందుకు నేనే స్వయంగా గ్రామాల్లో తిరిగాను. అవినీతి ఈ పథకాన్ని అధఃపాతాళానికి తొక్కేసింది. అంగన్ వాడీ కార్యకర్తల నియామకమే అవినీ తిలో కూరుకుపోయింది. అనంతపురంలోనైతే అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగానికి 30 వేలు లంచం అడుగుతున్నారు. ప్రకాశం జిల్లాలో 70 వేలు. శ్రీకాకుళంలో లక్ష రూపాయల ధర పలుకుతోంది. ఇక మూడు వేల రూపాయలు తీసుకొని బానిస చాకిరీ చేసే అంగన్వాడీ కార్యకర్తల కష్టాలు, కన్నీళ్లు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 154 అంగన్వాడీలను తనిఖీ చేశాం. చివరకు బాలింతల, పిల్లల బరువుతూచే యంత్రాలు సైతం అక్కడ అందుబాటులో లేవు. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే కాదు అధికారులు అప్రమత్తంగా లేకపోతే, చిత్తశుద్ధితో పనిచేయకపోతే ప్రజలకు మేలు చేసే ఏ పథకం అయినా ఇలాగే నిర్జీవంగా మారిపోతుంది. ప్రశ్న: ఐసీడీఎస్‌తోపాటు ఇంకేదైనా ప్రభుత్వ పథక రూపకల్పనలో నైనా మీరు భాగస్వాములయ్యారా? జవాబు: ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం కానీ, నేను పీవీ నరసింహారావు గారి దగ్గర సెక్రటరీగా పనిచేసేటప్పుడు ఇంతకన్నా అద్భుత మైన ఎంప్లాయ్మెంట్ అస్యూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాం. 1991 నుంచి రెండేళ్లపాటు అనేక చర్చల తర్వాత 1993లో దీన్ని తీసుకొచ్చాం. కూలితో పాటు కూలీలకు అవసరమైన తృణధాన్యాలను కూడా ప్రభుత్వమే ఈ పథకం ద్వారా అం దిస్తుంది. కూలీలు తినడానికి ఎంత అవసరమైతే అంత ఇవ్వాలన్నది సూత్రం. ఇప్పుడున్నది మాత్రం ఎటువంటి హామీ లేని ఉపాధిహామీ పథకం. ప్రశ్న: దళితుల సమస్యల పట్ల మీకున్న నిబద్ధత, సాహసం కారణంగా మీమీద ప్రభుత్వమే కేసు పెట్టింది. ఆ అనుభవాలు చెపుతారా? జవాబు: గుంటూరు జిల్లా తోట్లవల్లూరులో అగ్రకుల భూస్వాములు ఆక్రమించిన లంక భూములను లాక్కొని దళితులకు స్వాధీ నం చేశాను. దురాక్రమణలోని భూముల్లో పంటలను ధ్వం సం చేసే హక్కు ప్రభుత్వమే కల్పించింది. అయితే నేను భూములు పేద దళితులకు పంచటమే కాకుండా అగ్రకు లస్థులు వేసిన 75 ఎకరాల్లోని పంటను సైతం దళితులకు పం చాను. భూస్వాములు కోర్టుకి వెళ్ళారు. కృష్ణా జిల్లా ఉయ్యూ రు దగ్గర దళిత మహిళలు బహిర్భూమికి వెళ్ళకుండా ప్రభు త్వ భూమికి అగ్రకుల పెత్తందార్లు కంచె వేశారు. దాన్ని పెరి కివేసి దళిత మహిళల పక్షాన నిలబడ్డాను. ఈ కేసులో నన్ను కలెక్టరుగానే పనికిరానని, నేను దళితుడినని అందుకే వారి పక్షాన పోరాడుతున్నానని అభియోగం మోపారు.అది నాకు బిరుదే. ప్రభుత్వాధి కారిగా ఉండేవాళ్లు చేయాల్సింది ప్రజల పక్షం వహించడమే. పెత్తందార్లు, భూస్వాములకు కొమ్ము కాయడం కాదు. ప్రశ్న: నక్సలైట్ల ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో మీరు పనిచేశారు. వారిపై మీ అభిప్రాయం? జవాబు: 70 వ దశకంలో భూసంస్కరణల చట్టం చేశారు. దళితులు, ఆదివాసీలకు ఇచ్చిన భూమిని తిరిగి తీసుకోకూడదు. కానీ ఇది ఈ రోజుకీ అమలు జరగడంలేదు. తీవ్రవాదాన్ని నేను సమర్థించను. కానీ, ప్రజల హక్కులు అణచివేసినప్పుడు తిరుగుబాటు వస్తుంది. ఎటువంటి అణచివేతకు తావు లేకుండా ప్రభుత్వం పనిచేయాలి. ప్రశ్న: మతోన్మాదం మీద, కులం మీద మీ అభిప్రాయం? జవాబు: ఈ దేశంలో ఐక్యత ఉందని మీరు నమ్ముతారా? ఇక్కడ కేవలం హిందువులే బ్రతకాలా? క్రైస్తవులు, ముస్లింలు ఉండకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేదుకదా? ఈ మధ్య క్రైస్తవులపై దాడులు చేయొచ్చని ఒక ప్రకటన చదివాను. ఇలాంటి ప్రకటనలు ఎటువంటి భద్రతనిస్తాయి? మతో న్మాదం, కులతత్వం దేశ అభివృద్ధికి అడ్డుగోడగా తయా రయ్యాయి.. దాన్ని బద్దలు కొట్టాలి. దళితుల పక్షాన నిలబడినందుకే ఎన్నో కేసులను ఎదుర్కొన్నాను. పేదల పక్షం వహించినందుకు శంకరన్ గారికి, కాకి మాధవరావు గారికి నక్సలైట ముద్రవేస్తే, నేను వర్గపోరాటం చేస్తున్నానని ఆరోపించారు. ఏమైనా నాది అణగారిన వర్గాల పక్షమే, దళితుల పక్షమే. ప్రత్యేకించి దళిత మహిళల, నోరులేని చిన్నా రుల పక్షమే. అందుకే వారికే ‘ఉడకని మెతుకు’ పుస్తకాన్ని అంకితం ఇస్తున్నాను. అత్తలూరి అరుణ -
ఈ సేకరణ చట్టబద్ధం కాదు
సాక్షి, విజయవాడ బ్యూరో: ‘‘భూ సమీకరణ చట్టబద్ధం కాదు. చిన్నచిన్న ప్రాజెక్టులు, కాలనీల నిర్మాణం కోసమే పలుచోట్ల సమీకరణ జరిగింది. ప్రపంచంలో ఎక్కడా ఇంతవరకూ ఒక నగర నిర్మాణం కోసం భూమిని సమీకరించడం జరగలేదు’’ అని హర్యానా రాజధాని చండీగడ్ నిర్మాణాన్ని పర్యవేక్షించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దేవసహాయం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రకటించిన ప్రాంతంలో ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎం) చేపట్టిన వాస్తవాభిప్రాయ సేకరణలో ఆయన గత రెండు రోజులుగా పాల్గొంటున్నారు. శనివారం విజయవాడలోని ఇంజనీర్స్ భవన్లో జరిగిన రాజధాని రైతుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 1974-79లో చండీగఢ్ రెండో దశ నగర నిర్మాణ ప్రాజెక్టుకు పర్యవేక్షకునిగా పనిచేసిన అనుభవంతో తాను వాస్తవాభిప్రాయసేకరణలో పాల్గొంటున్నానని దేవసహాయం తెలి పారు.వాస్తవ పరిస్థితులతో నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమర్పిస్తామని చెప్పారు. ఒప్పించి భూములు తీసుకోవాలి: ఆర్కే రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని అయితే అందరినీ ఒప్పించి భూములు తీసుకోవాలని సూచిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. రాజధాని నిర్మాణ కమిటీలో ప్రతిపక్ష పార్టీకి, ఇతర రాజకీయ పార్టీలకు చివరికి రైతులు, రైతు నాయకులెవరికీ స్థానం కల్పించలేదని.. అందరూ టీడీపీ వారినే నియమించారని ఆయన విమర్శించారు. విజయవాడ కంటే పెద్ద నగరాన్ని కడతారా? ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణ విషయాలను సింగపూర్, జపాన్ వాళ్లకు చెప్తున్నారు గానీ ఇక్కడి వాళ్లకు చెప్పడంలేదని మాజీ మంత్రి, వ్యవసాయ వేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. విజయవాడకంటా పెద్ద నగరం కడతారా అని ప్రశ్నించారు.70 శాతం ప్రభావిత కుటుంబాలు ఒప్పుకుంటేనే ఎక్కడైనా భూములు తీసుకుంటారని కానీ బెదిరించి తీసుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.ఎస్.నాగిరెడ్డి మండిపడ్డారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు.. భూములు ఇవ్వడానికి తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయడంలేదని తుళ్లూరు మండలం రాయపూడి పీఎస్సీఎస్ అధ్యక్షుడు హరీంద్రనాథ్‌చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి సమితి అధ్యక్షుడు కొలనుకొండ శివాజీ అధ్యక్షత వహిం చగా.. సమాఖ్య కన్వీనర్ మల్లెల లక్ష్మణరావు, సమతా పార్టీ నేత కృష్ణారావు, ఎర్నేని నాగేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.